Ustaad BhagatSingh: ‘దేఖలేంగే..’ చూసిన వినాయక్ ఏమన్నారంటే?
UBS-vv-vinayak(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..

Ustaad BhagatSingh :తెలుగు చిత్ర పరిశ్రమలో మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ వి.వి. వినాయక్. ఆయన ఒక సినిమాను మెచ్చుకున్నారంటే అందులో ఖచ్చితంగా ‘దమ్ము’ ఉంటుందని అర్థం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, బ్లాక్‌బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మొదటి సింగిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ అనేక రికార్డులు బ్రేక్ చేసింది. సినీ పరిశ్రమలోని అనేక మంది నుంచి హరీష్ శంకర్ కు ప్రశంసలు అందుతున్నాయి. తాజాగా ఈ క్రమంలోనే ఈ పాటను వీక్షించిన వినాయక్, చిత్ర యూనిట్‌ను అభినందనలతో ముంచెత్తారు. ముఖ్యంగా హరీష్ శంకర్ ను అయితే ఆకాశానికి ఎత్తేశారా.

Read also-The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా!.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

హరీష్ శంకర్ మార్క్ మేకింగ్

వినాయక్ మాట్లాడుతూ, హరీష్ శంకర్‌ను ‘కల్ట్ కెప్టెన్’ అని సంబోధిస్తూ ప్రశంసించారు. “పవన్ కళ్యాణ్ గారి బాడీ లాంగ్వేజ్‌ను, ఆయనలోని మాస్ ఎనర్జీని ఎలా వాడుకోవాలో హరీష్‌కు బాగా తెలుసు. గతంలో ‘గబ్బర్ సింగ్’తో అది నిరూపితమైంది. ఇప్పుడు ‘దేఖ్ లేంగే సాలా’ చూస్తుంటే, పవన్ కళ్యాణ్‌ను మునుపెన్నడూ లేని విధంగా, ఒక సరికొత్త యాంగిల్‌లో ప్రజెంట్ చేసినట్లు అనిపిస్తోంది” ఈ పాటలో ఆయన్ని చూస్తుంటే.. అచ్చం పవన్ కళ్యాణ్ కొడుకుని చూసినట్లు అనిపిస్తుందని వినాయక్ పేర్కొన్నారు. దీంతో సినిమా పై అంచనాలు మరింత పెరిగాయి.

Read also-Virat Anushka: విరాట్ కోహ్లీ, అనుష్కలపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రేమానంద్ జీ చెప్పింది ఇదేనా?

అభిమానుల అంచనాలకు తగ్గట్టుగా..

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. గ్లింప్స్‌లో ఆయన చెప్పిన “గాజు గ్లాసు పగిలే కొద్దీ పదును పెరుగుతుంది” అనే డైలాగ్ పొలిటికల్ సెటైర్‌గాను, అటు ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే విధంగానూ ఉంది. వినాయక్ వంటి లెజెండరీ డైరెక్టర్ ఈ గ్లింప్స్ గురించి సానుకూలంగా స్పందించడం సినిమాపై అంచనాలను అకాశానికి చేర్చింది. “హరీష్ శంకర్ టేకింగ్ మరియు దేవి శ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ గ్లింప్స్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి. పవన్ గారి మేనరిజమ్స్ మళ్ళీ పాత రోజులను గుర్తుచేస్తున్నాయి.” – వి.వి. వినాయక్ మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. వినాయక్ ప్రశంసలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో, హరీష్ శంకర్ తనదైన శైలిలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

Just In

01

Mega War: రామ్ చరణ్ రికార్డ్ బ్రేక్ చేయలేకపోతున్న మెగాస్టార్ చిరంజీవి.. ఎందులోనంటే?

Polavaram Project: పోలవరం నల్లమల సాగర్‌‌పై సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం పిటిషన్​!

KK Passes Away: టాలీవుడ్‌లో విషాదం.. నాగార్జున ‘కేడి’ సినిమా దర్శకుడు కన్నుమూత..

Minister Nara Lokesh: శ్రీచరణికి రూ.2.5 కోట్ల బహుమతి.. చెక్ అందజేసిన మంత్రి నారా లోకేశ్

Singareni: ఒడిశాలో సింగరేణి మెగా ప్రాజెక్టులు.. ఐపీఐసీఓఎల్‌తో 18న కీలక ఒప్పందం!