The RajaSaab: ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా!..
the-rajasab-pre-release-event
ఎంటర్‌టైన్‌మెంట్

The RajaSaab: ప్రభాస్ ‘ది రాజాసాబ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడో తెలుసా!.. చీఫ్ గెస్ట్ ఎవరంటే?

The RajaSaab: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న హారర్ర్ కామెడీ సినిమా ‘ది రాజాసాబ్’. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త ప్రేక్షకుల్లో ప్రభాస్ అభిమానుల్లో ఉత్సాహాన్ని రేపుతోంది. అదేంటంటే.. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాదులోని రామోజీ ఫిల్మి సిటీలో డిసెంబర్ 28న జరగనుంది. ఈ ఈవెంట్ కు ప్రత్యేక అతిథిగా మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. అన్న వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిని చూసిన ప్రభాస్ ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ విషయం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇప్పటికే రాజాసాబ్ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ మంచి టాక్ సంపాదించుకుంది. మొదటి సాంగ్ కూడా చాట్ బాస్టర్ గా నిలిచింది. రెండో పాటకు సంబంధించి ప్రోమోను కూడా విడుదల చేశారు. ఈ పాట సినిమా పై ఉన్న అంచనాలను మరింత పెంచింది.

Read also-Virat Anushka: విరాట్ కోహ్లీ, అనుష్కలపై మండిపడుతున్న నెటిజన్లు.. ప్రేమానంద్ జీ చెప్పింది ఇదేనా?

ఊపు తెస్తున్న ప్రమోషన్లు

ఇప్పటికే విడుదలైన ‘ది రాజాసాబ్’ అప్డేట్స్ సినిమాపై హైప్‌ను అమాంతం పెంచేశాయి. ప్రభాస్ వింటేజ్ లుక్స్, చిలిపి నవ్వులు అభిమానులను ఫిదా చేశాయి. చాలా కాలం తర్వాత ప్రభాస్ ఒక ఫుల్ లెంగ్త్ ఎంటర్‌టైనర్ చేస్తున్నారనే భరోసాను ఈ టీజర్ ఇచ్చింది. ఇప్పటికే విడుదలైన మొదటి పాట ‘చార్ట్‌బస్టర్’గా నిలిచి, మ్యూజిక్ లవర్స్ ప్లేలిస్టులో టాప్‌లో కొనసాగుతోంది. తాజాగా విడుదలైన రెండో పాట ప్రోమో సినిమాపై ఉన్న అంచనాలను మరో స్థాయికి తీసుకెళ్లింది. ఇందులో ప్రభాస్ డాన్స్ మూమెంట్స్ అభిమానులను కట్టిపడేస్తున్నాయి.

Read also-Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?

చిత్ర యూనిట్ వ్యూహం

మారుతి ఈ చిత్రాన్ని కేవలం హారర్ కామెడీగానే కాకుండా, ప్రభాస్ ఇమేజ్‌కు తగ్గట్టుగా భారీ నిర్మాణ విలువలతో రూపొందిస్తున్నారు. తమన్ సంగీతం, గ్రాండ్‌ విజువల్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అయితే చిరంజీవి రాకపై చిత్ర యూనిట్ నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఒకవేళ ఇది నిజమైతే, బాక్సాఫీస్ వద్ద ‘రాజాసాబ్’ ప్రభంజనం మామూలుగా ఉండదని విశ్లేషకులు భావిస్తున్నారు. సోషల్ మీడియాలో జరుగుతున్న ఈ ప్రచారంపై మేకర్స్ క్లారిటీ ఇస్తే, ప్రభాస్ ఫ్యాన్స్ హంగామా మరో రేంజ్‌లో ఉంటుంది. ప్రభాస్ లుక్, మారుతి కామెడీ టైమింగ్, మరియు మెగాస్టార్ ఆశీస్సులు తోడైతే ‘ది రాజాసాబ్’ వచ్చే ఏడాది బాక్సాఫీస్ వద్ద రికార్డుల వేట మొదలుపెట్టడం ఖాయం. ‘ది రాజాసాబ్’ జనవరి 9, 2026న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా విడుదల కోసం ప్రభాస్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.  పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

Just In

01

Bigg Boss9 Telugu: చివరి రోజుల్లో పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్న ‘బిగ్ బాస్ తెలుగు సీజన్ 9’.. ఈ ఫన్ మామూలుగా లేదుగా..

Dr Gopi: రైతుల కష్టాలకు చెల్లు.. ఇది ఒక్కటీ ఉంటే చాలు, ఇంటికే యూరియా!

IND vs SA 4th T20I: లక్నోలో నాల్గో టీ-20.. సిరీస్‌పై కన్నేసిన భారత్.. దక్షిణాఫ్రికాకు అసలైన పరీక్ష!

Hyderabad Police: నమ్మించి పని మనుషులుగా ఉద్యోగాల్లో చేరి.. బంగారు ఆభరణాలు చోరీ!

Ustaad BhagatSingh : ‘దేఖలేంగే సాలా..’ సాంగ్ చూసి వీవీ వినాయక్ హరీష్‌కు చెప్పింది ఇదే.. ఇది వేరే లెవెల్..