TG Panchayat Elections 2025: తెలంగాణలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మెుదలైన పోలింగ్ మధ్యాహ్నం ఒంటి గంట వరకూ కొనసాగనుంది. అనంతరం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు కార్యక్రమం మెుదలవుతుంది. గెలిచిన అభ్యర్థుల వివరాలను ప్రకటించనున్నారు. సర్పంచ్, వార్డు ఫలితాలు వెలువడిన వెంటనే ఉపసర్పంచ్ ఎన్నిక కూడా జరగనుంది.
రంగారెడ్డి జిల్లాలో ఉద్రిక్తత
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్ పూర్ గ్రామంలోని ఓ వార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్ లో ప్రచారం చేస్తున్నారంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొద్దిసేపటికే అది తీవ్రతరంగా మారి పరస్పర దాడులకు దారి తీసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం అస్మత్పూర్ వార్డులో ఉద్రిక్తత
కాంగ్రెస్ అభ్యర్థి పోలింగ్ బూత్‌లో ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ ఆగ్రహం
దీంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ
పరస్పరం దాడులు చేసుకున్న రెండు పార్టీల కార్యకర్తలు pic.twitter.com/1e0zcSNo4k
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025
ఏజెంట్ల మధ్య ఘర్షణ
వికారాబాద్ జిల్లా మాదారంలో ఓ పోలింగ్ కేంద్రం వద్ద పెద్ద గొడవ చోటుచేసుకుంది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్లు ఒకరితో ఒకరు ఘర్షణకు దిగారు. పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారంటూ తోసుకున్నారు. దీంతో పోలీసులు కలుగుజేసుకొని ఇరుపార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు.
వికారాబాద్ జిల్లా మాదారంలో పోలింగ్ కేంద్రం వద్ద గొడవ
బీఆర్ఎస్, కాంగ్రెస్ ఏజెంట్ల మధ్య ఘర్షణ
పోలింగ్ కేంద్రం వద్ద ప్రచారం చేస్తున్నారని తోపులాట
ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు pic.twitter.com/HObupKxwdq
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025
ప్లెక్సీ వివాదం..
ఆసిఫా పాజ్ జిల్లాలో పంచాయతీ ఎన్నికల సందర్భంగా ప్లెక్సీ వివాదం తలెత్తేంది. నూతనంగా ఏర్పడిన రాజంపేట గ్రామ పంచాయతీలో ఈ ఫ్లెక్సీ వివాదం చెలరేగింది. ఈ గ్రామంలోనే ఎమ్మెల్యే లక్ష్మీ, కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ నివాసాలు ఉన్నాయి. వారి ఇళ్ల ముందు ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. దీంతో కాంగ్రెస్ నాయకులు.. ఎమ్మెల్యే ఇంటికి వెళ్లి ఫ్లెక్సీలను తొలగించేందుకు యత్నించారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. రంగంలోకి దిగిన ఎన్నికల సిబ్బంది.. ఇద్దరి ఇళ్ల ముందు ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు.
ఆసిఫాబాద్ జిల్లాలో ఎన్నికల వేళ ఫ్లెక్సీ వివాదం
నూతనంగా ఏర్పడిన రాజంపేట గ్రామ పంచాయతీకి తొలిసారి జరుగుతున్న ఎన్నికలు
రాజంపేట గ్రామంలోనే ఎమ్మెల్యే లక్ష్మి, కాంగ్రెస్ నాయకుడు శ్యామ్ నాయక్ నివాసాలు
ఎమ్మెల్యే ఇంటి ముందున్న ఫ్లెక్సీలను తొలగించేందుకు యత్నించిన కాంగ్రెస్ నాయకులు
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025
9 గంటల వరకు పోలింగ్ ఎంతంటే?
ఉదయం 7 గంటల నుంచి 9 గంటల మధ్య పలు జిల్లాల్లో నమోదైన పోలింగ్ శాతాన్ని అధికారులు వెల్లడించారు. నిర్మల్ జిల్లాలో 18.60 శాతం, సిద్ధిపేటలో 24.35 శాతం, మెదక్ 24.89 శాతం, సంగారెడ్డి 26.75శాతం, ఉమ్మడి నల్లగొండ 29 %, మంచిర్యాల 27.15%, రంగారెడ్డి 21.58 శాతం, పెద్దపల్లి 22.50 శాతం, జయశంకర్ భూపాలపల్లి 26.11 శాతం, వరంగల్ 22.26 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు.
ఓటేయడానికి ఉత్సాహంగా దివ్యాంగులు, వృద్ధులు
తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉదయం పూటే ఓటు వేయడానికి వచ్చిన దివ్యాంగులు, వృద్ధులు#PanchayatElection pic.twitter.com/EqhGix49PR
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025
ఉత్సాహాసంగా ఓటింగ్..
మూడో విడత పంచాయతీ పోలింగ్ చాలా చోట్ల శాంతియుత వాతావరణంలో కొనసాగుతోంది. యువతీ యువకులు, పెద్దలు, వృద్ధులు, వికలాంగులు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. తమ గ్రామాన్ని అభివృద్ధి చేస్తారని నమ్మకమున్న సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేస్తున్నారు. మరోవైపు ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పోలింగ్ కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
తెలంగాణలో కొనసాగుతున్న తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ #PanchayatElection pic.twitter.com/wg0243QLMP
— BIG TV Breaking News (@bigtvtelugu) December 17, 2025
3,752 గ్రామాల్లో పోలింగ్..
మూడో విడతలో భాగంగా 182 మండలాల్లోని 4,159 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలకు ఈసీ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో 394 పంచాయతీలు, 7,908 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 11 గ్రామ పంచాయతీలు, 116 వార్డుల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. ప్రస్తుతం 3,752 గ్రామ పంచాయతీలకు, 28,410 వార్డులకు ఎన్నికలు జరుగుతున్నాయి. సర్పంచ్ పదవికి 12,652 మంది, వార్డు సభ్యుల స్థానాలకు 75,725 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మూడో విడతలో మెుత్తం 36,483 పోలింగ్ స్టేషన్లను అధికారులు ఏర్పాటు చేయగా.. ఓటర్లు ఆయా కేంద్రాల వద్దకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు.
Also Read: CS Ramakrishna Rao: మెట్రో టేకోవర్‌కు డెడ్‌లైన్ ఫిక్స్.. మార్చి కల్లా ప్రక్రియను పూర్తి చేయాలి.. రామకృష్ణారావు ఆదేశం!
పటిష్ట బందోబస్తు ఏర్పాటు
మరోవైపు మూడో విడత పోలింగ్ కోసం పటిష్ట బందోబస్తును పోలీసులు ఏర్పాటు చేశారు. 3,547 కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. 4,502 మంది ఆర్వోలు, 77,618 మంది పోలింగ్ సిబ్బంది, 2,489 మంది మైక్రో అబ్జర్వర్లు విధుల్లో ఉన్నారు. ఈ విడతలో మొత్తం 53,06,401 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషులు 26,01,861 మంది ఉండగా, మహిళలు 27,04,394 మంది, ఇతరులు 140 మంది ఉన్నారు. దాదాపు లక్ష మంది మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారు.
36,165 మందిని బైండోవర్
పంచాయతీ పోలింగ్ సందర్భంగా ఎలాంటి ఉద్రిక్తతలు చోటుచేసుకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా 36,165 మందిని బైండోవర్ చేయగా.. 912 లైసెన్స్డ్ ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. ఓటర్ల సౌకర్యం కోసం ఎన్నికల సంఘం టీఈ–పోల్ (Te-poll) అనే మొబైల్ యాప్‌ను సైతం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఓటర్లు తమ స్లిప్పులను డౌన్‌లోడ్ చేసుకోవడంతో పాటు, పోలింగ్ కేంద్రం ఎక్కడుందో మ్యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫిర్యాదుల కోసం 9240021456 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని ఎన్నికల అధికారులు తెలిపారు.

