Rowdy Janardhan: రౌడీ హీరో విజయ్ దేవరకొండ (Vijay Deverakonda)కు అర్జెంట్‌గా ఓ హిట్ కావాలి. ఆయన ఎన్నో ఆశలు పెట్టుకున్న ‘లైగర్’, ‘కింగ్‌డమ్’ వంటి భారీ బడ్జెట్ సినిమాలు అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో.. ఇప్పుడాయన ఆశలన్నీ ‘రౌడీ జనార్థన్’ (Rowdy Janardhan)పైనే పెట్టుకున్నారు. విజయ్ దేవరకొండ సరసన కీర్తి సురేష్ (Keerthy Suresh) హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. విజయ్ దేవరకొండకు మంచి హిట్ ఇవ్వాలని దిల్ రాజు ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తున్నారు. వారి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఫ్యామిలీ స్టార్’ చిత్రం నిరాశ పరచడంతో.. ఎలాగైనా ‘రౌడీ జనార్థన్’తో హిట్ కొట్టాలని దిల్ రాజు చాలా స్ట్రాంగ్‌గా ఫిక్సయ్యారని తెలుస్తోంది. అందుకు ఈ సినిమా విషయంలో దిల్ రాజు బాగా ఇన్‌వాల్వ్ అవుతున్నారనేలా టాక్ నడుస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ సాలిడ్ అప్డేట్‌ను మేకర్స్ వదిలారు. అదేంటంటే..
Also Read- Pawan Kalyan: ‘ఓజీ’ దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఊహించని సర్‌ప్రైజ్.. ఇది వేరే లెవల్!
‘రౌడీ జనార్థన్’ టీజర్ రెడీ..
ఈ సినిమా ప్రారంభోత్సవం తర్వాత ఎటువంటి అప్డేట్‌ని మేకర్స్ ఇవ్వలేదు. అందుకే డైరెక్ట్‌గా ‘రౌడీ జనార్థన్’ మూవీ టీజర్‌ను విడుదల చేసి ఫ్యాన్స్‌కు ట్రీట్ ఇవ్వాలని మేకర్స్ చూస్తున్నట్లుగా సమాచారం. ఈ క్రమంలో ఈ చిత్ర టీజర్‌ను డిసెంబర్ 18న విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తోంది. ఈ టీజర్‌తోనే ప్రమోషన్స్ కూడా మొదలు పెట్టనున్నారని టాక్. సినిమాను 2026 ప్రథమార్థంలో అంటే వేసవికి విడుదల చేయాలనేది టీమ్ ప్లాన్‌గా సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ నాన్ స్టాప్‌గా జరుగుతోంది. ఈ సినిమాను రవి కిరణ్ కోలా (Ravi Kiran Kola) రూపొందిస్తున్న సంగతి తెలిసిందే. విజయ్ దేవరకొండ 15వ సినిమాగా, ఎస్వీసీ బ్యానర్ 59వ సినిమాగా ‘రౌడీ జనార్థన్’ చిత్రీకరణ జరుపుకుంటోంది. ఇక ఈ టీజర్ తర్వాత సినిమాపై అంతా ఓ క్లారిటీకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే, అసలీ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి పోస్టర్ కూడా రివీల్ చేయకపోవడంతో.. ఎవరికీ ఎటువంటి సమాచారం లేదు.
Also Read- Jinn Trailer: భూతనాల చెరువు కాలేజ్‌లో దాగి వున్న మిస్టరీ ఏంటి? ఇది ‘జిన్’ ఆడే ఆట!
విజయ్‌కు ఎంతో కీలకం
మరోవైపు విజయ్ దేవరకొండకు ‘లైగర్’ ఫ్లాప్ తర్వాత నిలదొక్కుకోవడానికి సరైన సినిమానే పడలేదు. సినిమాలైతే ఆయన చేస్తూనే ఉన్నాడు కానీ, హిట్ మాత్రం ఆయనకు రావడం లేదు. ‘కింగ్‌డమ్’ బ్లాక్‌బస్టర్ అవుతుందని, సీక్వెల్ కూడా ఉంటుందని అంతా భావించారు. ఇప్పుడా సీక్వెల్‌పై కూడా క్లారిటీ లేదు. అందుకే ఈ సినిమా విజయ్‌కు, ఆయన కెరీర్‌కు ఎంతో కీలకం కానుంది. మరోవైపు ‘రౌడీ జనార్థన్’తో పాటు ‘టాక్సీవాలా’ ఫేమ్ రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో కూడా విజయ్ ఓ సినిమా కమిటయ్యారు. ఈ సినిమాలో తన ఫియాన్సీ రష్మిక మందన్నా (Rashmika Mandanna) హీరోయిన్‌గా నటించనుందనేలా టాక్ నడుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి కూడా వివరాలు తెలియాల్సి ఉంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

