Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు
Medak District ( image credit: swetcha reporter)
Telangana News

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

Medak District: మెదక్ జిల్లా, మనోహరాబాద్ మండలం, చెట్లగౌరారం/రంగయిపల్లిలోని ఎంఎస్ అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో  రాత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ ప్లాంట్‌లోని బట్టీలో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించడంతో, ఆ ప్రాంతంలో విషాద వాతావరణం నెలకొంది. ఈ భారీ పేలుడు కారణంగా పరిశ్రమలో పనిచేస్తున్న ఒక కార్మికుడు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగయిపల్లికి

ఈ ఘటనలో మరో నలుగురు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన క్షతగాత్రులను వెంటనే మేడ్చల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. పేలుడు జరిగిన సమయంలో బట్టీల వద్ద దాదాపు 50 మంది కార్మికులు పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే మేడ్చల్, తుప్రాన్ ప్రాంతాల నుంచి అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన రంగయిపల్లికి చేరుకుని, మంటలను పూర్తిగా అదుపులోకి తీసుకువచ్చారు.

Also Read:Medak District: రైతు వద్ద లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కిన సర్వేయర్.. ఎంతంటే..!

గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు

ప్రమాదం జరిగిన వెంటనే పరిశ్రమ పరిసర ప్రాంతాలన్నీ దట్టమైన పొగతో కమ్ముకుపోయాయి. ఈ పొగ కారణంగా చుట్టుపక్కల గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు, ఘటనాస్థలికి వెళ్లేందుకు ప్రయత్నించిన కార్మికుల కుటుంబ సభ్యులు, గ్రామస్థులను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగి, తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కంపెనీ యాజమాన్యం ఇంతవరకు స్పందించలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Also Read: Medak District: పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం ఉమ్మడి మెదక్ జిల్లాలో ఏర్పాట్లు పూర్తి

Just In

01

MLA Malla Reddy: జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశంలో మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. దెబ్బకు సైలెంట్ అయిన సభ్యులు

iBomma Ravi: ఐ బొమ్మ రవికి షాక్​.. మరోసారి కస్టడీకి అనుమతించిన కోర్టు

Pawan Kalyan: గ్రామానికి రోడ్డు కోరిన గిరిజన యువకుడు.. సభ ముగిసేలోగా నిధులు.. డిప్యూటీ సీఎం పవన్‌పై సర్వత్రా ప్రశంసలు

Panchayat Elections: మూడో దశ పంచాయతీ పోరుకు సర్వం సిద్ధం.. ఉత్కంఠగా మారిన దేవరకొండ రెవెన్యూ డివిజన్ ఓట్లు

Gurram Paapi Reddy: సినిమాను హిట్ చేయండి.. మంచి భోజనం పెడతా! ఈ మాటంది ఎవరంటే?