Akhanda 2: గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna), బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను (Boyapati Sreenu) కాంబినేషన్‌లో తాజాగా థియేటర్లలోకి వచ్చిన పాన్ ఇండియా చిత్రం ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam). ఈ సినిమా విడుదల విషయంలో ఎలాంటి అవాంతరాలను, అడ్డంకులను ఫేస్ చేసిందో అందరికీ తెలిసిందే. అందుకే డిసెంబర్ 5న విడుదల కావాల్సిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలైంది. ఒక వారం పాటు ఈ సినిమాపై ఏ రకంగా కామెంట్స్ పడ్డాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే చాలు.. నందమూరి అభిమానులు భగ్గమన్నారు. ముఖ్యంగా 14 రీల్స్ ప్లస్ బ్యానర్ నిర్మాతలైన రామ్ ఆచంట, గోపి ఆచంటను టార్గెట్ చేస్తూ నందమూరి అభిమానులు చేసిన ట్రోలింగ్ హాట్ టాపిక్ అయ్యింది. ఇక ఈ సినిమా విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా మేకర్స్ అఖండ భారత్ సెలబ్రేషన్స్ అంటూ ఓ వేడుకను నిర్వహించారు.
Also Read- Bigg Boss Buzzz: నా హార్ట్ నా మైండ్‌ని డామినేట్ చేసింది.. భరణి సంచలన వ్యాఖ్యలు
నిర్మాతలు ఎందుకు రాలేదు..
ఈ వేడుకకు చిత్రయూనిట్ తరపున అందరూ హాజరయ్యారు. ఆఖరికి నందమూరి నటసింహం బాలయ్య కూడా వచ్చారు. కానీ, చిత్ర నిర్మాతలు రామ్ ఆచంట, గోపి ఆచంట మాత్రం రాలేదు. దీంతో మరోసారి వారి పేర్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారి, వైరల్ అవుతున్నాయి. వారు ఈ వేడుకకు రాకపోవడంతో నెటిజన్లు, అభిమానులు కూడా రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ వేడుకలో నిర్మాతలకు సపోర్ట్‌గానే బాలయ్య, బోయపాటి, థమన్ వంటి వారు మాట్లాడారు. బాలయ్య అయితే, సినిమా ఆగిపోవడానికి కారణం శివాజ్ఞ లేకపోవడమే అని కూడా చెప్పడం విశేషం. ఆయన ఒక వారం ఆగి రిలీజ్ అవ్వాలని భావించి ఉంటారు కాబట్టే.. ఆలస్యమైందని చెప్పారు. ఇక థమన్ అయితే.. నిర్మాతలకు దెబ్బ తగిలితే బ్యాండేజ్ వేయండి కానీ, బ్యాండ్ వాయించకండి అంటూ కాస్త ఘాటుగానే స్పందించారు. బోయపాటి కూడా సినిమా ఇండస్ట్రీ అందరిది, ఐక్యత అవసరం అన్నట్లుగా మాట్లాడారు. అంతా బాగానే ఉంది కానీ, నిర్మాతలు ఎందుకు రాలేదనే దానిపై మాత్రం భారీ స్థాయిలో చర్చ నడుస్తుంది.
Also Read- VV Vinayak: ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో వివి వినాయక్.. ఈ ఫొటోకి అర్థం అదేనా?
భవిష్యత్‌లో ఈ బ్యానర్‌లో కష్టమే..
నందమూరి బాలకృష్ణను ఫేస్ చేయలేకే వారు ఈ వేడుకకు రాలేదా? అంతకు ముందు కూడా వారిద్దరే సినిమా టాక్‌పై మాట్లాడారు తప్పితే.. యూనిట్‌లో కలిసి కనిపించలేదు. చివరి నిమిషంలో సినిమా ఆపేస్తారని వారికి తెలిసి కూడా కావాలనే ఇలా చేశారని కొందరు నెటిజన్లు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. బాలయ్య వంటి హీరోతో సినిమా చేసిన తర్వాత, ఇలాంటి గొడవలు ఉంటే ముందే సరి చేసుకోవాలి. అలా చేయకపోవడంతో ఆయన ఆగ్రహానికి కూడా వారు గురయ్యారు. మళ్లీ భవిష్యత్‌లో ఈ బ్యానర్‌లో బాలయ్య సినిమా చేసే అవకాశం బహుశా ఉండకపోవచ్చు. కొందరైతే బాలయ్య హీరో కాబట్టి.. చివరి నిమిషంలో ఇలాంటి అడ్డంకులు ఏర్పడితే.. ఎప్పటి నుంచో ఉన్న గొడవలన్నింటికీ పరిష్కారం లభించే అవకాశం ఉందనే నిర్మాతలు భావించి ఉంటారనేలా కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఏదిఏమైనా, 14 రీల్స్ ప్లస్ నిర్మాతలను చూసి, ఇండస్ట్రీ అలెర్ట్ అయితే బాగుంటుంది. లేదంటే, అగ్ర హీరోల ఆగ్రహానికి బలికాక తప్పదు..
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

