Thaman Reply: ‘ఓజీ’, ‘అఖండ 2’ సినిమాల తర్వాత మంచి ఫామ్‌లో ఉన్న థమన్ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తున్నారు. మరో సారి ఆయన సినిమా కోసం చేసే శ్రమ గురించి చెబుతూ ఆయన్ని ట్రోల్ చేసేవారికి సమాధానం చెప్పారు. ఇటీవల ఆయన ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. ఇలా చెప్పుకొచ్చారు. రెమ్యూన రేషన్ గురించి అయితే నా దగ్గర అసలు ప్రాబ్లమ్ ఉండదు. వ్యక్తిత్వం అవసరం దాని తర్వాతే సంగీతం.. ఉదాహరణకు నేను అయిదు కోట్లు తీసుకుంటే నాలుగు కోట్ల తంభై అయిదు లక్షలు సినిమాకే ఖర్చు పెడతాను. ఎందుకు అంటే డబ్బు ఆగదు.. ఆల్బమ్ అలా నిలిచిపోతుంది ఎన్ని సంవత్సరాలు అయినా.. అందులో సినిమా కోసం ఎక్కువ ఖర్చు పెడతాను. అందుకే నన్ను ప్రిఫర్ చ చేయడానికి అందరూ ఇష్టపడతారు.. అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా ఒక సినిమా ఆల్బమ్ హిట్ అయితే ఎలా ఉంటుందో లిటరల్ గా అందరూ చూశాము. కోవిడ్ సమయంలో మాకు అలా వైకుంఠపురంలో సినిమా పాటల నుంచే రాయల్టీ వచ్చేది. అప్పుడు వాటి మీదే ఆధారపడే వారము అప్పుడు ఆ మనీ మాకు చాలా ఉపయోగపడ్డాయి. అంటూ చెప్పుకొచ్చారు. దీంతో థమన్ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టేస్తాడో ఆయన్ని ట్రోల్ చేసేవారికి సమాధానం ఇచ్చినట్లు అయింది.
Read also-Akhanda2: పూనకాలు తెప్పిస్తున్న బాలయ్య బాబు ‘అఖండ 2: తాండవం’.. ఇది చూస్తే షాక్ అవుతారు..
అంతే కాకుండా తాను ఇంటికి తీసుకెళ్లేది చాలా తక్కువ అని అందుకే తాను కూడా పాడటం మానేశారని అన్నారు. తనకు వచ్చిన డబ్బులు ఎక్కువ షోల నుంచి వస్తుందని, సినిమా నుంచి వచ్చేది చాలా తక్కువ తాను తీసుకుంటానని ఆయన చేశారు. అయితే క్యారెక్టర్ చాలా అవసరం అని మ్యూజిక్ చాలా తక్కువ అని ఆయన చెప్పుకొచ్చారు. ఫుడ్ గురించి మాట్లాడితే క్వాలిటీగా తినడం చాలా అవసరం అని, జంక్ ఫుడ్, ఫారిన్ ఫుడ్ అయితే అసలు తినను అంటూ చెప్పుకొచ్చారు. అంతే కాకుండా రోజులో ఖచ్చితంగా ఓ పపాయ మాత్రం తింటానంటూ చెప్పుకొచ్చారు. ఏది ఏం చేసిన మంచి పేరు మాత్రం చిరకాలం ఉండిపోతుందన్నారు. అయితే ఇదంతా థమన్ ను ట్రోల్ చేసేవారికి ఒక చెంప పెట్టులా ఉంది.
Read also-Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

