Bandi Sanjay: యువతకు ఇచ్చిన హామీ ఏమాయే?
Bandi Sanjay (imagecredit:twitter)
Telangana News

Bandi Sanjay: యువతకు అందుబాటులో ఉంటానన్న హామీ ఏమాయే? బండి సంజయ్

Bandi Sanjay: రాష్ట్రంలో ఒకవైపు ప్రజలు ఇబ్బంది పడుతుంటే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) మాత్రం మెస్సీ మ్యాచ్ ను వీక్షించేందుకు, వినోదం కోసం ఢిల్లీ(Delhi) నుంచి హైదరాబాద్(Hyderabad) కు వచ్చారని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు ఏ సమస్య ఉన్నా తెలంగాణ(Telangana) యువతకు తక్షణమే అందుబాటులో ఉంటానని చేసిన వాగ్ధానాలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఈ హామీలు ఆయన మరిచారని, ఆయన కేవలం వీఐపీ(VIP) ఈవెంట్లు, ఫొటోలకు మాత్రమే పరిమితమయ్యారని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

Also Read: Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..

ప్రజల జీవితాలతో ఫుట్‌బాల్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల జీవితాలతో ఫుట్‌బాల్ ఆడుతోందని బండి ఆగ్రహం వ్యక్తంచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తయినా ఆరు గ్యారెంటీల్లో చాలావరకు ఇంకా పూర్తిగా అమలు కాలేదన్నారు. హామీలు కాగితాలకే పరిమితమయ్యాయని విమర్శించారు. మూసీ ప్రక్షాళన పేరిట పేదల ఇళ్లు కూల్చివేత, విద్యార్థులకు ఫుడ్ పాయిజనింగ్, రైతులు, నేత కార్మికుల ఆత్మహత్యలు, పెన్షన్లు, పదవీ విరమణ చెల్లింపులో జాప్యం, ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇవ్వడంలేదని విమర్శించారు. తెలంగాణలో శాంతిభద్రతలు క్షీణించాయని, పట్టపగలే హత్యలు జరుగుతున్నాయని, దేవాలయాలు కూల్చివేస్తున్నారని, కమిషన్లు బహిరంగంగా వసూలు చేస్తున్నారని ఆరోపించారు.

Also Read: India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క