CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు
CM Revanth Reddy (imagecedit:twitter)
Political News, Telangana News

CM Revanth Reddy: మోడీ, అమిత్ షా ది గోల్వాల్కర్ భావాలు: సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy: మహాత్మా గాంధీ, అంబేడ్కర్ రాజ్యాంగ రచన సమయంలో నిర్వహించిన రాజ్యాంగ సభలో దళితులు, ఆదివాసీలు, మైనార్టీలు, పేదలకు ఓటు హక్కు విషయం చర్చకు వచ్చినపుడు ఆర్ఎస్ఎస్(RSS) నేతలు, గోల్వాల్కర్(Golwalkar) తదితరులు వారికి ఓటు హక్కు ఇవ్వవద్దన్నారని, గాంధీ(Gandhi), అంబేద్కర్(Ambedkar) వారికి ఓటు హక్కు కల్పించినందున ఈ దేశంలో ప్రభుత్వం ఏర్పాటులో అణగారిన వర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) వ్యాఖ్యానింంచారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఓటు చోర్ గద్దీ చోడ్ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.

రాహుల్ గాంధీ

ఆర్ఎస్ఎస్, గోల్వాల్కర్ భావజాలంతో ఉన్న నరేంద్ర మోదీ(Narendra Modi), అమిత్ షా, (Amit Shah) ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వారి భావజాలాన్ని అమలుచేసేందుకు 400 సీట్లు కావాలని కోరుకుంటారన్నారు. కానీ బీజేపీకి 400 సీట్లు ఇస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని, రిజర్వేషన్లు ఎత్తివేస్తారని రాహుల్ గాంధీ చెప్పడంతోనే దేశ ప్రజలు బీజేపీని 240 సీట్లకు పరిమితం చేశారని రేవంత్ అన్నారు. ఇవ్వాళ రాజ్యాంగం, జర్వేషన్లు ఉన్నాయని, అందుకే ఇపుడ సర్ పేరుతో ప్రయత్నాలు మళ్లీ ప్రయత్నాలు చేస్తున్నారని సీఎం రేవంత్ విమర్శించారు.

Also Read: Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

ప్రభుత్వాల ఏర్పాటులో..

నాడు పేదలు, దళితులు, ఆదివాసులు, మైనారిటీల కోసం గాంధీ, అంబేద్కర్ నిలబడినట్లే ఇప్పుడు రాహుల్ గాంధీ(Rahulgandhi), మల్లికార్జున్ ఖర్గే(Mallikarjun Kharge) వారి పక్షానం వారి హక్కులు కాపాడి, ప్రభుత్వాల ఏర్పాటులో భాగస్వామ్యాన్ని కొనసాగించేందుకు అండగా నిలుస్తున్నారని వ్యాఖ్యానించారు. సర్ పేరుతో తొలుత ఓటర్ కార్డు తొలగిస్తారని, ఆ తర్వాత ఆధార్, రేషన్ కార్డులన్నీ తొలగించి, వారికున్న హక్కులన్నీ గుంజుకునేందుకు కుట్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సమస్య ఎన్నికలదో, కాంగ్రెస్(Congress) పార్టీ దో కాదని, ఇది ఇపుడు దేశ సమస్య అని, ఈ సమస్యకు వ్యతిరేకంగా రాహుల్ గాంధీ చేసే పోరాటంలో కలిసి సాగేందుకు తెలంగాణ సిద్ధంగా ఉందని, దేశ ప్రజలంతా కలిసి రావాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

Also Read: KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క