Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్..!
Panchayat Elections (imagecredit:twitter)
Telangana News

Panchayat Elections: రాష్ట్రంలో ముగిసిన రెండో విడత పోలింగ్.. అత్యధిక శాతం పోలింగ్ నమోదైన జిల్లా ఇదే..!

Panchayat Elections: రెండో విడత ఆదివారం పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఓటర్లు ఉదయం 7 గంటల నుంచే పోలింగ్​కేంద్రాలకు చేరుకొని ఓటు హక్కును వినియోగించుకున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్​ముగిసింది. ఒంటి గంటలోపు క్యూలైన్​లో ఉన్నవారిని ఓటేసేందుకు ఎన్నికల ఆఫీసర్లు అనుమతి ఇచ్చారు. మధ్యాహ్నం రెండు గంటల నుంచి కౌంటింగ్​ ప్రారంభించి, విజేతలను ఎన్నికల అధికారులు ప్రకటించారు.

మహిళా ఓటర్లు ఉత్సాహం

రాష్ట్రంలో రెండో విడతలో 3,911 పంచాయతీలకు, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. 46,70,972 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 85.86 % పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 91.72%, ఖమ్మం జిల్లాలో 91.21% పోలింగ్​ నమోదు కాగా, నిజామాబాద్​ జిల్లాలో అత్యల్పంగా 76.71% ఓటింగ్​ నమోదైంది. రెండో విడతలో మొత్తం 54,40,339 మంది ఓటర్లు ఉండగా.. అందులో 46,70,972 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇందులో పురుషుల కంటే మహిళా ఓటర్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ విడతలో మొత్తం 4,333 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 5 పంచాయతీలు, 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇక మరో 415 పంచాయతీల్లో సర్పంచ్, అలాగే 8,307 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కోర్టు కేసులు, ఇతర కారణాల వల్ల 2 పంచాయతీలు, 18 వార్డుల్లో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్, 29,917 వార్డు మెంబర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.

Also Read: Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో..

రాష్ట్ర వ్యాప్తంగా తొలివిడత పంచాయతీ ఎన్నికల్లో 84.28 శాతం పోలింగ్ ​నమోదు కాగా.. రెండో విడతలో 85.86% ఓటింగ్ నమోదైంది. రెండో విడుతా 1.58 శాతం ఎక్కువ పోలింగ్​అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా రెండో విడుత 54,40,339 ఓటర్లు ఉండగా.. 46,70,972 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందులో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 86% ఓటింగ్​ నమోదైంది. 26,57,702 పురుష ఓటర్లుకు గాను.. 22,77,902 మంది ఓటేశారు. పురుష ఓటర్లు 85.71% మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 202716 మంది ఓటర్లుకు గాను.. 18,5937 మంది ఓటేయగా.. (91.72 శాతం)తో అగ్రస్థానంలో నిలిచింది. నిజామాబాద్ జిల్లాలో మొత్తం 23,8838 ఓటర్లు ఉండగా.. 18,3219 మంది ఓటేయగా.. (76.71 శాతం)తో చివరి స్థానంలో నిలిచింది. ఖమ్మం జిల్లాల్లోనూ 91.21%, సూర్యాపేట జిల్లాలో 89.55%, మెదక్​ 88.74%, నల్గొండ 88.74% నమోదు కాగా.. అత్యల్పంగా నిజామాబాద్ 76.71%, జగిత్యాల: 78.34%, భద్రాద్రి కొత్తగూడెం 82.65%, నిర్మల్: 82.67%, వికారాబాద్: 82.72% ఓటింగ్​ నమోదైంది.

పురుషుల ఓటింగ్ శాతం

ఈ విడతలో మహిళా ఓటర్లు 27,82,494 ఓటర్లు ఉండగా.. 23,93,010 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. పలు జిల్లాల్లో మహిళలు పెద్దఎత్తున ఓటింగ్ లో పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 91.62%, ఖమ్మం 90.88%, మెదక్​ 89.28% అత్యధికంగా ఓటింగ్​ నమోదు కాగా.. భద్రాద్రి కొత్తగూడెం 81.38%, వికారాబాద్ 81.79%, ములుగు 82.79% అత్యల్పంగా మహిళా ఓటింగ్ నమోదైంది. పురుషుల ఓటింగ్ శాతంలో కూడా యాదాద్రి 91.83%, ఖమ్మం 91.56% జిల్లాలే ముందంజలో ఉన్నాయి. కౌంటింగ్ కేంద్రం వద్ద ఎక్కువ మంది ఉండకుండా 144 సెక్షన్ విధించారు. వార్డుల వారీగా రౌండ్ టు రౌండ్ ఓట్ల ఫలితాలను వెల్లడించారు. గెలుపొందిన సర్పంచ్, వార్డు మెంబర్లు ప్రత్యేకంగా సమావేశమై ఉప సర్పంచ్‌లను ఎన్నుకున్నారు. కొన్ని చోట్ల చెదురుముదురు ఘటనలు మినహా మిగిలిన అన్నీ చోట్ల పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని ఎన్నికల అధికారులు తెలిపారు.

Also Read: KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క