కాంగ్రెస్ దావోస్ (Davos) పర్యటన సక్సెస్ అయింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) బృందం 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, రికార్డు సృష్టించింది. అయితే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మాత్రం కాంగ్రెస్ పై విమర్శలు గుప్పిస్తోంది. పెట్టుబడులు తేకుండా ఫేక్ ప్రచారం చేసుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. వీరి విమర్శలను కాంగ్రెస్ కూడా ధీటుగానే తిప్పికొడుతోంది. తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు తీసుకొస్తే గులాబీ నాయకుల గుండెల్లో ముళ్ళు గుచ్చుకుంటున్నాయని కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పెట్టుబడులు చూసి కేసీఆర్, కేటీఆర్ లకి కడుపు మండుతోందని మండిపడుతున్నారు. అంతేకాదు, బ్యానర్లు పెట్టి మరీ బీఆర్ఎస్ ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు కాంగ్రెస్ శ్రేణులు.
Also Read : Uttam Kumar Reddy | ఉర్సు ఉత్సవాల్లో మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
కేసీఆర్, కేటీఆర్ లకు ఈనో ప్యాకెట్లు.. అని హైదరాబాద్ వ్యాప్తంగా బ్యానర్లు ఏర్పాటు చేశారు. “పెట్టుబడులు చూసి కడుపు మంటా? వాడండి ENO..!” క్యాప్షన్ తో ఏర్పాటు చేసిన హోర్డింగులు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. #DigestTheGrowth పేరుతో ఏర్పాటు చేసిన బ్యానర్లు ప్రజలను ఆకర్షిస్తున్నాయి. “దావోస్ (Davos) పర్యటనలో 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు తెచ్చి, రికార్డు సృష్టించిన సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్, కాంగ్రెస్ పరిపాలనలో భారీ పెట్టుబడులను, తెలంగాణ అభివృద్ధిని జీర్ణించుకోలేకపోతున్న కేసీఆర్, కేటీఆర్, బీఆర్ఎస్ నేతలు. కడుపు మంట తగ్గేందుకు బీఆర్ఎస్ నేతలకు ఈనో ప్యాకెట్లు వాడాలి” అంటూ కాంగ్రెస్ నేతలు భారీగా హోర్డింగ్ లు ఏర్పాటు చేశారు.
కాగా, దావోస్ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అద్భుతం చేశారు. అంచనాలను తలకిందులు చేస్తూ చరిత్ర సృష్టించారు. ఏకంగా లక్షా డైభ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు అవగాహన ఒప్పందాలు సాధించారు. గత యేడాది నలభై వేల కోట్లతో పోలిస్తే నాలుగు రెట్లకు పైగా ఒప్పందాలు దావోస్ వేదికగా మూడు రోజుల్లో కుదరడం విశేషం. అంతకు ముందు పదేళ్ల ప్రభుత్వంలో ఉన్న అన్ని లెక్కలనూ చెరిపివేసి కొత్త చరిత్ర లిఖించారు.