VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?
VC Sajjanar (imagecredit:twitter)
Telangana News, హైదరాబాద్

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

VC Sajjanar: నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ నిర్వహించే ఈవెంట్లకు నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుల అనుమతి తీసుకోవాలని హైదరాబాద్ కమిషనర్​వీ.సీ.సజ్జనార్​స్పష్టం చేశారు. త్రీ, ఫైవ్ స్టార్ హోటళ్లు, పబ్‌లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు ఆయన ఈ మేరకు సూచనలు జారీ చేశారు. పర్మిషన్​లేకుండా కార్యక్రమాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈవెంట్ నిర్వహించడానికి పదిహేను రోజుల ముందే దరఖాస్తులు చేసుకోవాలని ఆయన సూచించారు. ఈవెంట్ మొత్తాన్ని తప్పనిసరిగా సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ చేయాలని, పార్కింగ్​ప్రదేశాల్లో కూడా సీసీ కెమెరాలు తప్పనిసరని చెప్పారు. అవసరమైనంత మంది సెక్యూరిటీ గార్డులను నియమించుకోవాలని తేల్చి చెప్పారు. ఈవెంట్లు జరిగే చోట ఎలాంటి ఆయుధాలు తీసుకురాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా నిర్వహకులదే అని పేర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఈవెంట్ నిర్వాహకులదే అన్నారు.

Also Read: Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

సౌండ్‌పై కఠిన నిబంధనలు

అశ్లీల నృత్యాలను ప్రోత్సహించవద్దని సీపీ ఆదేశించారు. రాత్రి 10 గంటలకు అవుట్‌డోర్ సౌండ్​ సిస్టమ్, డీజే సౌండ్​ మిక్సర్​ వంటి పరికరాలను నిలిపి వేయాలని చెప్పారు. ఇండోర్ (Indoor)లో మాత్రమే రాత్రి 1 గంట వరకు వీటికి అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, ఆ సమయంలో కూడా శబ్దం 45 డెసిబుల్స్‌కు మించి ఉండరాదన్నారు. మైనర్లకు మద్యం సరఫరా చేయవద్దని హెచ్చరించారు. మాదక ద్రవ్యాల వినియోగానికి అవకాశం కల్పిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. అంతేకాకుండా, మద్యం సేవించిన వారి వాహనాలు డ్రైవ్​చేసేందుకు అవసరమైనంత మంది డ్రైవర్లను అందుబాటులో పెట్టుకోవాలని కూడా నిర్వాహకులకు సూచించారు.

Also Read: Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..