Ustaad BhagatSingh: తెలుగు ప్రజలకు పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పవర్ స్టార్‌గా అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ఆయన, సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చురుగ్గా ఉంటున్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్టులలో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. ఈ సినిమా ప్రకటన వచ్చినప్పటి నుంచి ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి. దీనికి కారణం ఈ సినిమా దర్శకుడు హరీష్ శంకర్. పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబినేషన్‌లో గతంలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ (2012) ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అనేది అందరికీ తెలిసిందే. ఆ సినిమా అప్పటివరకు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వచ్చిన పరాజయాల పరంపరకు ఫుల్‌స్టాప్ పెట్టి, సరికొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. అటువంటి చారిత్రక విజయాన్ని అందించిన కాంబినేషన్ మళ్లీ కలుస్తుండటంతో, ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై అంచనాలు ఆకాశాన్ని అంటాయి.
Read also-Bigg Boss9: ఏం ఫన్ ఉంది మామా ఈ రోజు బిగ్ బాస్‌లో.. అందరూ పర్ఫామెన్స్ అదరుగొట్టేశారు..
తాజాగా ఈ సినిమా నుంచి మొదటి సింగిల్ విడుదల చేశారు దర్శకుడు హరీష్ శంకర్. దీనిని సంబంధించిన ఈవెంట్ ను కాకినాడ జిల్లాలోని ఆదిత్య యూనివర్సిటీలో నిర్వహించారు. ఈ సాంగ్ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా.. హరిష్ శంకర్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ముందు ఖుషీ సినిమా లాగా కాలేజ్ లవ్ స్టోరీ అనుకున్నా కానీ కుదరలేదు. తర్వాత నేను ఎక్కడ కనిపించినా అన్నా మరో గబ్బర్ సింగ్ ఎప్పుడు తీస్తున్నావు అంటూ ఎక్కడ పడితే అక్కడ అడిగేవారు దీంతో మరో రిమేక్ తీయాలి అనుకున్నా. అది కూడా అంత కరెక్ట్ అనిపించలేదు, అందుకే దానిని కూడా పక్కన పెట్టేశాను. చాలా కాలం ఆలోచించిన తర్వాత ఈ సినిమాకు స్టిక్ అయ్యాను. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ను అభిమానులు ఎలా చూడాలనుకుంటున్నారో అలా తీయాలని ఈ సినిమా తీశాము. ఈ సినిమాలో ప్రతి పాటా కొన్ని సంవత్సరాలు నిలిచిపోతుంది. అంటూ చెప్పుకొచ్చారు. అంటే ఆయన చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఈ సినిమా రిమేక్ కాదన్న మాట. దీంతో ఇప్పటి వరకూ రిమేక్ అనుకున్న అభిమానులకు క్లారిటీ వచ్చింది.
Read also-Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..
ఇప్పటికే ఈ సినిమానుంచి విడుదలైన దేకలేంగే సాలా సాంగ్ 25 మిలియన్లు వ్యూస్ సాధించి రికార్డులు నెలకొల్పింది. ఇంతకు ముందు హరీష్ శంకర్ మాట్లాడుతూ, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కేవలం ‘తేరి’ కథాంశం ఆధారంగా మాత్రమే తీసుకున్నామని, ఇది పూర్తిగా రిమేక్ కాదని స్పష్టం చేశారు. “మేము ‘తేరి’ కథ యొక్క స్ఫూర్తిని తీసుకున్నాం. తెలుగు ప్రేక్షకులకు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులకు నచ్చే విధంగా కథలో 70-80 శాతం మార్పులు చేశాం. పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్‌కు, ఆయన ప్రస్తుతం ఉన్న రాజకీయ ప్రయాణానికి అనుగుణంగా కథనాన్ని తీర్చిదిద్దాం. ఇది కేవలం ఒకేలాంటి పాయింట్‌తో మొదలై, పూర్తిగా కొత్తగా మలిచిన సినిమా. ఇది కేవలం స్ఫూర్తితో తీసిన చిత్రం, రిమేక్ కాదు” అని హరీష్ శంకర్ వివరించారు. ‘గబ్బర్ సింగ్’ కాంబో మళ్లీ రిపీట్ అవుతోంది, కాబట్టి పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అంచనాలకు మించి ఉండే అవకాశం ఉంది. మొత్తం మీద, ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిమేక్ అనే ప్రచారాన్ని పక్కన పెడితే, హరీష్ శంకర్ తనదైన శైలిలో పవన్ కళ్యాణ్‌ను కొత్తగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అర్థమవుతోంది. ఈ సినిమా తప్పకుండా పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓ పండుగలాంటి సినిమా అవుతుందని చిత్ర యూనిట్ నమ్మకంగా చెబుతోంది.

