BiggBoss9 Prize Money: బుల్లి తెర ప్రేక్షకులను టీవీలకు కట్టిపడే కంటెంట్ తో స్ట్రీమింగ్ అవుతున్న రియాలిటీ షో ‘బిగ్ బాస్9’. ఈ షో చివరి అంకానికి చేరుకుంటుంది.. ఒక్కక్కరుగా బిగ్ బాస్ నుంచి వెళ్లి పోతున్నారు. చివరిగా ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ శనివారం చివరిగా సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. తాజాగా 98 వ రోజుకు సంబంధించి ప్రోమో విడుదల చేశారు. అందులో బిగ్ బాస్ విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ గురించి ప్రస్తావించారు. అందులో విన్నర్ గెలుచుకునే ప్రైజ్ మనీ ఎంతంటే అక్కరాలా ఏభై లక్షలు.. ఈ మొత్తాన్ని గెలిచిన వారు ఇంటికి తీసుకువెళ్లవచ్చు.. అని బిగ్ బాస్ విన్నర్ ప్రైజ్ మనీని రివీల్ చేశారు. అయితే ఈ మనీ గెలుచుకున్న వారు వేరే వారిని పంపించాలి అంటే ఎంత ఇచ్చి పంపించేస్తారు. అని ఒక్కొక్కరినీ అడిగారు. అందులో ముందుగా వచ్చింది.. భరణి. ఆయన వచ్చి నేను ముందు ఎవరిని పంపించాలి అనుకుంటే ముందుగా గుర్తొచ్చేది. ఇద్దరే ఒకటి ఇమ్మానియేలో రెండు డీమాన్ పవన్ ఇందులో డిమాన్ పవన్ కన్నా ఇమ్మానుయేల్ కు ఎక్కువ మనీ ఇస్తాను. ఎంత అంటే దాదాపు ఇరవై లక్షలు ఇచ్చి పంపించేస్తాను అని అన్నాడు.
Read also-Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

