Chiranjeevi Movie: 'మనశంకరవరప్రసాద్ గారు' షూటింగ్ పూర్తి..
manaankara-vara-prasad(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Chiranjeevi Movie: ‘మనశంకరవరప్రసాద్ గారు’ షూటింగ్ పూర్తి.. ఎమోషన్ అయిన దర్శకుడు..

Chiranjeevi Movie: మెగాస్టార్ చిరంజీవి మాస్-అండ్-ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. బ్లాక్‌బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం ఆకట్టుకునే ప్రమోషనల్ కంటెంట్, దూకుడుగా సాగుతున్న ప్రచార కార్యక్రమాలతో సంచలనం సృష్టిస్తోంది. విక్టరీ వెంకటేష్ కీలకమైన ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తుండగా, శ్రీమతి అర్చన సమర్పిస్తున్నారు. ఈ రోజు చిత్ర నిర్మాతలు సినిమా విడుదల తేదీని ప్రకటించడానికి ఒక గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించారు.

Read also-Shambala Movie: సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ నుంచి ‘నా పేరు శంబాల’ సాంగ్ రిలీజ్..

‘మన శంకర వర ప్రసాద్ గారు’ పూర్తి షూటింగ్ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని, ప్రస్తుతం పోస్ట్-ప్రొడక్షన్ పనులను వేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రం సంక్రాంతికి కేవలం 2 రోజుల ముందు, జనవరి 12న థియేటర్లలో విడుదల కానుంది. సోమవారం విడుదల కావడం వల్ల, ఈ చిత్రం ఏడు రోజుల లాంగ్ వీకెండ్ బెనిఫిట్ పొందుతుంది. పండుగ సెలవుల పూర్తిగా కలిసిరానున్నాయి. మంచి ప్లానింగ్ తో చేసిన రిలీజ్ టైం సంక్రాంతి సీజన్‌లో బాక్సాఫీస్ వద్ద సినిమాకు బలమైన వసూళ్లను అందించి, ప్రేక్షకుల రష్ ని గరిష్ఠంగా పెంచుతుందని భావిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి యంగ్ అండ్ డైమనిక్ గా కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. రెడ్ కార్ పై బ్లాక్ సూట్ లో కాఫీ సిప్ చేస్తూ మెగా స్వాగ్ తో మెస్మరైజ్ చేశారు చిరంజీవి.

చిరంజీవి, అనిల్ రావిపూడిల కలయికే ఇప్పటికే చాలా ఎక్సయిట్మెంట్ ని క్రియేట్ చేసింది, రెండు చార్ట్‌బస్టర్ పాటలు సంచలనం సృష్టించాయి. వెంకటేష్ ప్రత్యేక పాత్ర తోడవడంతో సినిమాపై అంచనాలు మరో స్థాయికి చేరాయి. నయనతార కథానాయికగా నటిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో బలమైన తారాగణం ఉండటంతో అంచనాలు గణనీయంగా పెరిగాయి. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్‌ను, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్‌ను చూసుకుంటున్నారు. కథను ఎస్. కృష్ణ, జి. ఆది నారాయణ సంయుక్తంగా రాశారు.

Read also-Dandora Movie: శివాజీ ‘దండోరా’ సినిమా నుంచి టైటిల్ సాంగ్ విడుదలైంది.. చూశారా మరి..

గ్రాండ్ ప్రెస్ మీట్ లో డైరెక్టర్ అని అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిన్ననే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాం. మీడియా మిత్రులతో ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా పండగ మొదలుపెట్టాం. ఇది ఒక 20, 30 రోజుల జర్నీ ఉంటుంది. ఈ సినిమాని మేలో మొదలుపెట్టాం. మెగాస్టార్ చిరంజీవి గారితో ఓపెనింగ్ ముహూర్తంతో స్టార్ట్ చేశాం. అక్కడ్నుంచి ఈ ఏడు ఎనిమిది నెలలో జర్నీ నాకు చాలా మెమొరబుల్. నిన్న ఆయనతో లాస్ట్ వర్కింగ్ డే. నేను ఇంకా ఆ ఎమోషన్ లోనే ఉన్నాను. మేమిద్దరం కూడా ఒక మంచి మెమోరియల్ జర్నీగా షేర్ చేసుకున్నాం. ఒకరినొకరు మిస్ అవుతున్నామనే ఫీలింగ్ ఇద్దరిలో ఉంది. అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

Just In

01

Crime News: జైలు నుంచి ఇటీవలే విడుదల.. అంతలోనే చంపేశారు.. దారుణ ప్రతీకార హత్య

Bandla Ganesh: ‘మోగ్లీ 2025’పై బండ్ల గణేష్ రివ్యూ.. ‘వైల్డ్’ అర్థమే మార్చేశారు

Bondi Beach Attack: యూదులే టార్గెట్.. బోండీ బీచ్ ఉగ్రదాడిలో సంచలన నిజాలు వెలుగులోకి

Balakrishna: ‘అఖండ2’తో సనాతన హైందవ ధర్మం మీసం మెలేసింది

India vs South Africa: ధర్మశాల టీ20.. స్వల్ప స్కోరుకే దక్షిణాఫ్రికా ఆలౌట్