Phone Tapping Case: తలకు చుట్టుకోనున్న ట్యాపింగ్ బాగోతం
Phone Tapping Case (imagecredit:twitter)
Telangana News

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ బిగ్ అప్డేట్.. సింక్​ అయిన డేటా కోసం ప్రయత్నాలు ముమ్మరం

Phone Tapping Case: ఫోన్​ ట్యాపింగ్​ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ఎస్​ఐబీ మాజీ ఛీఫ్​ ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణ జరుపుతున్న సిట్​ అధికారులు డిజిటల్ ఆధారాలపై ఫోకస్​ పెట్టారు. ట్యాపింగ్​ బాగోతాన్ని నడిపించిన సమయంలో ప్రభాకర్ రావు ఉపయోగించిన జీ మెయిళ్లతోపాటు ఐ క్లౌడ్​ ఖాతాలపై రెండో రోజు విచారణలో నిశితంగా ప్రశ్నించారు. అమెరికా నుంచి ఇక్కడికి రావటానికి ముందే ప్రభాకర్​ రావు ఈ ఖాతాలతోపాటు తాను వాడిన డిజిటల్ పరికరాల్లోని డేటాను ఎరేజ్​ చేసినా ఎఫ్ఎస్​ఎల్ ద్వారా రిట్రైవ్​ చేయించిన సమాచారం ఆధారంగా విచారణ చేస్తున్నారు. హైదరాబాద్ జాయింట్ సీపీ తఫ్సీర్​ ఇక్భాల్ విచారణను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. కాగా, ముందు ముందు ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం మరికొందరు అధికారుల మెడకు చుట్టుకోనున్నట్టుగా తెలుస్తోంది.

కస్టోడియల్ విచారణ

కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక వెలుగు చూసిన ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బీఆర్​ఎస్ హయాంలో ఎస్​ఐబీ ఛీఫ్​ గా ఉన్న ప్రభాకర్ రావు ఈ బాగోతంలో కీలక పాత్రధారి అని ఇప్పటికే వెల్లడైంది. ఈ క్రమంలోనే సుప్రీం కోర్టులో పిటిషన్​ దాఖలు చేయటం ద్వారా ఆయనకు అత్యున్నత న్యాయస్థానం అంతకు ముందు కల్పించిన మధ్యంతర రక్షణ రద్దయ్యేలా చేశారు. కస్టోడియల్ విచారణ జరిపితేనే ప్రభాకర్ రావు నోరు తెరిచే అవకాశాలు ఉన్నాయని సుప్రీం కోర్టుకు తెలిపారు. ఈ వాదనలతో ఏకీభవించిన సుప్రీం కోర్టు వారం రోజులపాటు ప్రభాకర్​ రావును కస్టోడియల్ విచారణకు అనుమతించింది. దాంతో శుక్రవారం ప్రభాకర్ రావును సిట్​ కార్యాలయానికి పిలిపించిన సిట్​ అధికారులు విచారణ మొదలు పెట్టారు. రాత్రికి ఇంటికి కూడా పంపించ లేదు. ఇక, శనివారం ఉదయం నుంచే మరోసారి ప్రశ్నల వర్షం కురిపించారు.

Also Read: Room Heater Safety: కొత్త హీటర్ కొనుగోలు చేసే ముందు తప్పక తెలుసుకోవాల్సిన ప్రభుత్వ సూచనలివే!

ఈ వివరాల ఆధారంగా..

గతంలో జరిపిన విచారణ సమయంలో ప్రభాకర్ రావు అయిదు జీ మెయిల్ అకౌంట్లు, రెండు ఐ క్లౌడ్​ ఖాతాలకు సంబంధించిన పాస్ వర్డులను విచారణాధికారులకు తెలిపారు. అయితే, వాటిని పరిశీలించగా డేటా మొత్తం ఎరేజ్​ చేసినట్టుగా తేలింది. దీని గురించి అడిగితే డివైస్​ ల నుంచి తన వ్యక్తిగత డేటాను మాత్రమే తొలగించానంటూ ప్రభాకర్​ రావు చెప్పారు. దాంతో దర్యాప్తు అధికారులు ఎఫ్ఎస్​ఎల్ సాయం తీసుకున్నారు. కొంతమేర డేటాను రిట్రైవ్​ చేయగలిగిన ఎఫ్ఎస్​ఎల్ వర్గాలు ఆ వివరాలను సిట్​ అధికారులకు అందచేశాయి. ఈ వివరాల ఆధారంగా ప్రభాకర్​ రావును సిట్​ అధికారులు ప్రశ్నిస్తున్నారు. అయితే, కీలక ప్రశ్నలన్నింటికీ ప్రభాకర్ రావు మౌనం వహిస్తున్నట్టుగా సమాచారం. ఏయే నెంబర్లను ట్యాప్ చేయాలన్న దానిపై మౌఖికంగా ఆదేశాలు వచ్చేవా? వస్తే…ఎవరు ఇచ్చేవారు? ట్యాప్​ చేసిన ఫోన్ల సమాచారాన్ని ఎవరికి అందచేశారు? దీనిని స్టోర్​ చేసిన పెన్​ డ్రైవ్​ లను ఏం చేశారు? అన్న ప్రశ్నలకు జవాబులు ఇవ్వటం లేదని తెలిసింది.

వివరాలను ఇవ్వాలని లేఖలు

ఈ ప్రశ్నలకు నేనేం చేశానో పై అధికారులు అందరికీ తెలుసు.. రివ్యూ కమిటీ అనుమతులతోనే అంతా చేశా అని మాత్రం చెబుతున్నట్టుగా తెలియవచ్చింది. ఈ నేపథ్యంలోనే ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారం ముందు ముందు మరికొందరు అధికారుల తలకు చుట్టుకునే అవకాశాలు ఉన్నట్టుగా పోలీసువర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక, ప్రభాకర్ రావు ఉపయోగించిన జీ మెయిల్ అకౌంట్లు, ఐ క్లౌడ్​ ఖాతాల్లో సింక్ అయిన డేటాను సేకరించేందుకు సిట్ అధికారులు చర్యలకు శ్రీకారం చుట్టినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో జీ మెయిల్, యాపిల్​ కంపెనీలకు డేటా వివరాలను ఇవ్వాలని లేఖలు రాయాలని నిర్ణయించినట్టుగా సమాచారం. కేసులో ఈ వివరాలు అత్యంత కీలకం కాగలవని అధికారులు భావిస్తున్నారు. ఒక్కసారి ఈ సమాచారం చేతికి అందితే ప్రభాకర్ రావు నోరు తెరిపించటం సులువవుతుందని అధికారులు చెబుతుండటం గమనార్హం.

Also Read: Akhanda2 Premiere: ‘అఖండ 2’ డే 1 ప్రీమియర్స్ గ్రాస్ ఎంతో తెలుసా?.. ఫ్యాన్స్‌కు పండగే..

Just In

01

Kerala Local Polls: కేరళ రాజకీయాల్లో కీలక పరిణామం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపు ఖాయం?

Drug Seizure: 70 లక్షల విలువైన మాదక ద్రవ్యాలు సీజ్.. ఎలా పట్టుకున్నారంటే?​

AIIMS Bibinagar: తెలంగాణ ప్రజల డీఎన్ఏలో డేంజర్ బెల్స్.. రీసెర్చ్‌లో బయటపడ్డ సంచలన విషయాలు?

Messi In Hyderabad: హైదరాబాద్‌లో క్రేజ్ చూసి మెస్సీ ఫిదా.. కీలక వ్యాఖ్యలు

Road Accident: మెదక్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. గుర్తు తెలియని వాహనం ఢీకొని నలుగురు మృతి..!