Messi Mania: మెస్సీ మేనియా‌తో ఉర్రూతలూగుతున్న స్టేడియం
Messi-Mania (Image source X)
Telangana News, హైదరాబాద్

Messi Mania: ఉప్పల్‌లో మెస్సీ మేనియా.. ఉర్రూతలూగుతున్న స్టేడియం

Messi Mania: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) ‘G.O.A.T. ఇండియా టూర్ 2025’లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం సందడిగా (Messi Mania) మారిపోయింది. మరికొద్దిసేపట్లోనే మ్యాచ్ ప్రారంభం కానుండడంతో మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ స్టేడియానికి బయలుదేరారు. వీరు ప్రయాణిస్తున్న కాన్వాయ్ ఫలక్‌నుమా ప్యాలెస్‌ నుంచి ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియానికి చేరుకోబోతున్నారు. కాన్వాయ్ కోసం చంద్రాయణ గుట్ట నుంచి ఉప్పల్ స్టేడియం వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. అంటే, ఎక్కడా ఒక్క ట్రాఫిక్ సిగ్నల్ కూడా లేకుండా కాన్వాయ్ స్టేడియానికి చేరుకోనుంది.

ఉర్రూతలూగుతున్న స్టేడియం

మెస్సీని చూసేందుకు ఉప్పల్ స్టేడియానికి అభిమానులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. మ్యాచ్ ప్రారంభానికి ముందు ఏర్పాటు చేసిన మ్యూజిక్ కన్సర్ట్‌ స్టేడియాన్ని ఉర్రూతలూగించింది. రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీతో పాటు పలువురు సింగర్లు పాడిన పాటలతో స్టేడియం హోరెత్తింది. మరోవైపు, లైటింగ్ షో కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. మెస్సీ ధరించే అర్జెంటీనా ఫుల్‌బాల్ జెర్సీని పోలి వుండే రంగులతో స్టేడియం పైకప్పుకు లైటింగ్ ఏర్పాటు చేశారు. లైటింగ్ షో అబ్బురపరిచేలా ఉంది. క్రికెట్ గ్రౌండ్‌ని ఫుట్‌బాల్ ఆడే గ్రౌండ్‌గా మార్చివేశారు.

Read Also- Bigg Boss9 Telugu: రీతూ వెళ్లిపోయాకా డీమాన్ పవన్ పరిస్థితి ఎలా ఉందంటే?.. భరణికి నచ్చనిదెవరంటే?

7.50 గంటలకు మ్యాచ్ ప్రారంభం..

షెడ్యూల్ ప్రకారం, రాత్రి 7.15 గంటలకు మెస్సీ ఉప్పల్ స్టేడియానికి చేరుకోనున్నాడు. ఫ్రెండ్లీ మ్యాచ్ రాత్రి 7.50 గంటలకు మొదలవుతుంది. 8.06 గంటలకు ముఖ్యమంత్రి ప్రవేశిస్తారు. 2.07 గంటలకు లియోనెల్ మెస్సీ మైదానంలోకి అడుగుపెడతాడు. వీరిద్దరూ మార్కింగ్ ప్రకారం పొజిషన్ తీసుకుంటారు. 8.08 గంటలకు రోడ్రిగో డి పాల్, లూయిస్ సువారెజ్ మైదానంలోకి ఎంటర్ అవుతారు. 8.10 గంటలకు హార్డ్ స్టాప్. అంటే, మ్యాచ్‌ను నిలిపివేస్తారు. 8.11 గంటలకు మెస్సీ, సీఎం రేవంత్ రెడ్డి కలిసి బాల్‌తో డ్రిబుల్ చేస్తారు. అంటే, ప్రత్యర్థిని చేధించుకొని బంతికి ముందుకెళ్లడం.

8.13 గంటలకు పెనాల్టీ షుటౌట్

8.13 గంటలకు పెనాల్టీ షూటౌట్ ఉంటుది. గోట్ కప్ విజేతను నిర్ణయించేందుకు ఇరు జట్లు చెరో 3 షాట్లు కొడతాయి. రాత్రి 8.13 గంటలకు రాహుల్ గాంధీ మైదానంలోకి అడుగు పెడతారు. 8.15 గంటలకు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడిన రెండు జట్లతో గ్రూప్ ఫొటో ఉంటుంది. పిల్లలతో ఈ ఫొటోలు దిగుతారు. 8.17 గంటలకు టికీ టాకీ జోన్ 1 (పిల్లల క్లినిక్) ప్రారంభం ఉంటుంది. లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్, సీఎం రేవత్, రాహుల్ గాంధీ పాల్గొంటారు. 8.22 గంటలకు టికీ టాకీ – జోన్ 2 (పిల్లల క్లినిక్) ప్రారంభం, 8.27కి జోన్-3 క్లీనిక్, 8.32 జోన్-4 క్లీనిక్ ప్రారంభిస్తారు. 8.53కి కప్ ప్రదానం, 8.58కి రేవంత్ రెడ్డి, 8.59 గంటలకు రాహుల్ గాంధీ మాట్లాడుతారు. 9.10 గంటలకు కార్యక్రమం పూర్తవుతుంది.

Read Also- Pakistan Spy: ఎయిర్‌ఫోర్స్ రిటైర్డ్ ఆఫీసర్ అరెస్ట్.. పాకిస్థాన్‌కు సమాచారం చేరవేస్తున్నట్టు గుర్తింపు!

భారీ భద్రత..

మెస్సీ-సీఎం రేవంత్ రెడ్డి జట్ల మధ్య జరగనున్న ఫ్రెండ్లీ హై-ప్రొఫైల్ మ్యాచ్ కోసం ఉప్పల్ స్టేడియం వద్ద భారీ ఏర్పాట్లు చేశారు. కోల్‌కతాలో మెస్సీ ఆడాల్సిన ఫ్రెండ్లీ మ్యాచ్ రద్దు కావడం, అనంతరం చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల నేపథ్యంలో, తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. డీజీపీ నేరుగా ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ స్టేడియాన్ని పరిశీలించారు.

 

Just In

01

Gold Rates: గోల్డ్ లవర్స్ కి గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన బంగారం ధరలు

Medak District: స్టీల్ పరిశ్రమలో భారీ పేలుడు.. ఒకరు మృతి, నలుగురికి గాయాలు!

WhatsApp Scam: ఆన్‌లైన్ బెట్టింగ్‌లో రూ.75 లక్షలు గోవిందా.. లాభాలు ఆశ చూపి కొట్టేసిన సైబర్ క్రిమినల్స్

Jammu Kashmir Encounter: జమ్మూ కాశ్మీర్ ఉధంపూర్‌లో ఉగ్రవాదుల కాల్పులు.. పోలీసు అధికారి మృతి

GHMC: డీలిమిటేషన్‌పై ప్రశ్నించేందుకు సిద్ధమైన బీజేపీ.. అదే బాటలో అధికార పార్టీ ప్రజాప్రతినిధులు!