National Band Competition: విద్యార్థుల్లో వికాసం, క్రమశిక్షణ
National Band Competition ( image credit: swetcha reporter)
Telangana News

National Band Competition: విద్యార్థుల్లో వికాసం, క్రమశిక్షణకు పోటీలు.. ఢిల్లీలో జరిగే బ్యాండ్ పోటీలకు విజేతలు!

National Band Competition: సమగ్ర శిక్ష తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సౌత్ ఇండియా బ్యాండ్ కాంపిటీషన్ ముగిసింది. ఈనెల 11, 12 తేదీల్లో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయ కాంపస్‌లోని క్రీడా ప్రాంగణంలో ఈ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను బ్రాస్ బ్యాండ్ (బాలురు, బాలికలు), పైప్ బ్యాండ్ (బాలురు, బాలికలు) విభాగాల్లో నిర్వహించారు. దక్షిణ ప్రాంత స్థాయిలో విజేతగా నిలిచిన బృందాలు, ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి బ్యాండ్ పోటీకి సౌత్ జోన్ నుంచి ప్రాతినిధ్యం వహించనున్నాయి.

Also Read: National Herald case: నేషనల్ హెరాల్డ్ కేసులో ట్విస్ట్… సోనియా, రాహుల్ గాంధీలపై మరో కేసు

యాక్టివిటీస్‌లో ప్రోత్సహించేందుకు సిద్ధం

ఈ పోటీలు కాలేజ్ ఆఫ్ ఫిజికల్ ఎడ్యుకేషన్ సహకారంతో నిర్వహించారు. ఈ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్, అండమాన్ నికోబార్, లక్షద్వీప్, పుదుచ్చేరి వంటి 9 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల విద్యార్థి బృందాలు పాల్గొన్నాయి. ఈ కార్యక్రమానికి సీఎం సలహాదారు కేశవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. పిల్లల్లో ఇలాంటి కార్యక్రమాలు వారి వికాసానికి దోహదం చేస్తాయని పేర్కొన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ మాట్లాడుతూ, విద్యార్థులకు అన్ని యాక్టివిటీస్‌లో ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. విద్యార్థుల్లో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, సమన్వయ భావనలను పెంపొందించడంలో ఇలాంటి పోటీలు ముఖ్య పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ రాజీవ్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: 71st National Awards: జాతీయ అవార్డులు అందుకున్న తెలుగు గ్రహీతల ఫస్ట్ రియాక్షన్.. ఏంటంటే?

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క