Ramchander Rao: గతంలో క్రీడాకారులు బ్రాంజ్ మెడల్ కూడా గెలవలేకపోయేవాళ్లని, కానీ ఇప్పుడు క్రీడాకారులు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్‌ను అన్ని సెగ్మెంట్లలో విజయం సాధిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు తెలిపారు. హైదరాబాద్‌లోని జీఎంసీ బాలయోగి ఇండోర్ స్టేడియంలో జరిగిన 41వ జాతీయ సీనియర్ క్యోరుగి చాంపియన్‌షిప్‌ను ప్రారంభించి మాట్లాడారు. అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ లాంటి దేశం నలుమూలల నుంచి వచ్చిన అథ్లెట్స్ క్రీడలతో పాటు హైదరాబాదును కూడా చూసి, ఇక్కడి ఆతిథ్య సత్కారాన్ని ఆస్వాదించాలని కోరారు.
Also Read: Ramchander Rao: పార్టీ నిబంధనలు ఉల్లంఘిస్తే వేటే.. దూకుడు పెంచిన రాంచందర్ రావు!
ప్రభుత్వం క్రీడలపై 130 రెట్లు ఎక్కువ ఖర్చు
హైదరాబాద్ బిర్యానీ ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధిచెందిందని ఆస్వాదించాలంటూ సూచించారు. 2014తో పోలిస్తే భారత ప్రభుత్వం క్రీడలపై 130 రెట్లు ఎక్కువ ఖర్చు చేస్తోందని రాంచందర్ రావు తెలిపారు. దేశ నిర్మాణంలో క్రీడలు ఒక శక్తివంతమైన మార్గదర్శక శక్తిగా నిలవాలనే సంకల్పం ఈ కార్యక్రమాల ద్వారా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.
Also Read:Ramchander Rao: ఫ్యూచర్ సిటీకి కేంద్ర నిధులు ఎందుకు? ప్రభుత్వం కనీసం ఆలోచించిందా? : రాంచందర్ రావు

