Mowgli 2025 OTT: ‘బబుల్ గమ్’ ఫేమ్ హీరో రోషన్ కనకాల (Roshan Kanakala), ‘కలర్ ఫొటో’ దర్శకుడు సందీప్ రాజ్ (Sandeep Raj) కాంబినేషన్‌లో వస్తున్న యాక్షన్ లవ్ స్టోరీ ‘మోగ్లీ 2025’ (Mowgli 2025). ప్రస్తుతం ఈ సినిమా సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. డిసెంబర్ 12న విడుదల కావాల్సిన ఈ సినిమా విషయంలో ఏం జరిగిందో అందరికీ తెలిసిందే. నందమూరి బాలయ్య ‘అఖండ 2’ కారణంగా.. ఈ చిత్రం 13 డిసెంబర్, 2025న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతోంది. ఇప్పటికే పడిన ప్రీమియర్స్‌కు మంచి స్పందన రావడంతో టీమ్ అంతా హ్యాపీగా ఉంది. అయితే ఇంకా ఈ సినిమా థియేటర్లలోకి రాకముందే.. ఓటీటీ విడుదల తేదీ గురించి ఇండస్ట్రీలో ఊహాగానాలు మొదలయ్యాయి. సినిమా విడుదలైన నెల రోజుల్లోపే అంటే, జనవరి 9న ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్‌కు రానుందనే వార్త బలంగా వినిపిస్తోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన లేనప్పటికీ, విడుదల కాకుండానే ఇలా ఓటీటీ డేట్ బయటకు రావడంతో సినీ విశ్లేషకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
డిజిటల్ స్ట్రీమింగ్ డిటైల్స్ ఇవేనా?
‘మోగ్లీ 2025’ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా ఇప్పటికే మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా, ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు ఏకంగా రూ. 7 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది. ఈ డిజిటల్ హక్కులను ఈటీవీ విన్ (ETV Win) సొంతం చేసుకోగా, శాటిలైట్ హక్కులను ఈటీవీ దక్కించుకున్నట్లు సమాచారం. సాధారణంగా, ఒక మీడియం బడ్జెట్ సినిమా థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత కనీసం 4 నుంచి 8 వారాల వ్యవధి తీసుకుని ఓటీటీలోకి వస్తుంది. కానీ, ‘మోగ్లీ 2025’ విషయంలో కేవలం 27 రోజుల్లోనే (డిసెంబర్ 13 నుండి జనవరి 9 వరకు) ఓటీటీలోకి వస్తుందనే టాక్ వినిపిస్తోంది. ఈ రూ. 7 కోట్ల భారీ డీల్‌లో భాగంగా ఓటీటీ స్ట్రీమింగ్‌కు సంబంధించిన లాక్-ఇన్ పీరియడ్ (Lock-in Period) చాలా తక్కువగా నిర్ణయించినట్లు తెలుస్తోంది. అందుకే థియేట్రికల్‌గా ఈ సినిమా రాబట్టాల్సిన కలెక్షన్స్ కూడా చాలా తక్కువే అన్నట్లుగా టాక్ వినబడుతోంది.
Also Read- Pawan Kalyan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు సాయం
‘మోగ్లీ’ ఈ విషయంలో హిట్టే..
ఇటీవలి కాలంలో, పెద్ద సినిమాలు కూడా త్వరగా ఓటీటీలోకి రావడానికి మొగ్గు చూపుతున్నాయి. పోటీ పెరగడం, ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడటం వల్ల నిర్మాతలు ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారని భావించవచ్చు. ఈటీవీ విన్ సంస్థ భారీ మొత్తానికి హక్కులు దక్కించుకోవడం వెనుక, తక్కువ వ్యవధిలోనే స్ట్రీమింగ్‌కు తీసుకురావాలనే షరతు ఉండే అవకాశం ఉందని అనుకోవచ్చు. సినిమా థియేటర్లలో హిట్ అయితే, ఆటోమెటిక్‌గా ఓటీటీలో కూడా మంచి వీక్షణలు వస్తాయి. తద్వారా ప్లాట్‌ఫామ్ తన పెట్టుబడిని త్వరగా తిరిగి పొందాలనుకునే క్రమంలో ‘మోగ్లీ’ విషయంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చు. ఏదిఏమైనా, స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలైన చాలా కాలం తర్వాత డిజిటల్ రైట్స్ అమ్ముడవుతున్నాయి. కానీ ‘మోగ్లీ’ ఈ విషయంలో హిట్ కొట్టిందనే అనుకోవాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

