Sreeleela: టాలీవుడ్ నో.. బాలీవుడ్ మాత్రం బంపరాఫర్స్ ఇస్తోంది
Sreeleela (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Sreeleela: టాలీవుడ్ వద్దనుకుంటోంది.. బాలీవుడ్ మాత్రం బంపరాఫర్స్ ఇస్తోంది

Sreeleela: యంగ్ సెన్సేషన్ శ్రీలీల (Sreeleela) ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎదురుదెబ్బలు తగిలినా, బాలీవుడ్‌లో మాత్రం ఆమెకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గడం లేదు. 2025లో విడుదలైన ఆమె సినిమాలు ‘రాబిన్‌హుడ్’, ‘మాస్ జాతర’తో సహా.. బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాయి. అయినప్పటికీ, ఈ డ్యాన్సింగ్ క్వీన్‌కు ఉత్తరాది చిత్ర పరిశ్రమ నుండి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. శ్రీలీల మొదటి హిందీ చిత్రం, కార్తీక్ ఆర్యన్ సరసన నటిస్తున్న రొమాంటిక్ డ్రామా ‘తూ మేరీ జిందగీ హై’ (‘ఆషికి 3’గా చెబుతున్నారు) ఇంకా విడుదల కావాల్సి ఉంది. అయినప్పటికీ, ఆమె చేతిలో బాలీవుడ్ ప్రాజెక్టుల సంఖ్య పెరుగుతోంది. తన తొలి సినిమా విడుదల కాకముందే, శ్రీలీల బాలీవుడ్‌లో ఏకంగా మూడు ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ వార్త బయటకు వచ్చినప్పటి నుంచి.. టాలీవుడ్ వద్దనుకుంటోంది, బాలీవుడ్ మాత్రం ఆహ్వానిస్తోంది అంటూ కామెంట్స్ పడుతుండటం విశేషం.

Also Read- Pawan Kalyan: మరోసారి గొప్ప మనసు చాటుకున్న పవన్ కళ్యాణ్.. భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుకు సాయం

‘పుష్ప 2’ ఐటెం సాంగ్ మ్యాజిక్

శ్రీలీల కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరగడానికి ముఖ్య కారణం ‘పుష్ప 2: ది రూల్’ చిత్రంలోని ‘కిస్సిక్’ ఐటెం సాంగ్ అని చెప్పుక తప్పదు. ఈ చిత్రం ఉత్తర భారతదేశంలో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు, ఆమె చేసిన ‘కిస్సిక్’ డ్యాన్స్ నంబర్ భారీ హిట్‌గా మారింది. ఈ పాటలో శ్రీలీల స్క్రీన్ ప్రెజెన్స్, అద్భుతమైన డ్యాన్స్ చూసి బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఆమెకు వరుస అవకాశాలు ఇవ్వడానికి క్యూ కడుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న బాలీవుడ్ చిత్రాల విషయానికి వస్తే.. ‘తూ మేరీ జిందగీ హై’ (Tu Meri Zindagi Hai). కార్తీక్ ఆర్యన్ సరసన అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. యువ నటుడు ఇబ్రహీం అలీ ఖాన్ (సైఫ్ అలీ ఖాన్ కుమారుడు) సరసన ఆమె నటిస్తున్న ‘దిలేర్’ సినిమా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది.

Also Read- Roshan Kanakala: యానిమల్ కూడా యాక్ట్ చేసింది.. ‘మోగ్లీ 2025’ హార్స్ రైడ్ సీక్వెన్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు

పాన్-ఇండియా స్టార్‌గా మారేందుకు

ఇక మూడో చిత్ర విషయానికి వస్తే.. బాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన మ్యాడాక్ ఫిల్మ్స్ బ్యానర్‌లో రూపొందుతున్న ‘చూమంతర్’ చిత్రంలో కూడా శ్రీలీల భాగమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం ఒక్కటి కూడా విడుదల కాకముందే.. ఇంతటి డిమాండ్‌ను సంపాదించుకోవడం, అలాగే టాప్ ప్రొడక్షన్ హౌస్‌లు, యువ స్టార్ హీరోలతో అవకాశాలు దక్కించుకోవడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. ఇలా 2026లో ఆమె ఫుల్ బిజీగా ఉండనున్నారు. తమిళంలో ‘పరాశక్తి’తో పాటు మరికొన్ని హిందీ, తెలుగు చిత్రాలు కూడా ఆమె లైనప్‌లో ఉన్నాయి. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’‌లో ఆమె నటించిన విషయం తెలిసిందే. మొత్తానికి చూస్తే.. తెలుగులో అవకాశాలు తగ్గినా హిందీ, తమిళ భాషల్లో సినిమా చేస్తూ.. పాన్-ఇండియా స్టార్‌గా మారేందుకు శ్రీలీల పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారనేది మాత్రం తెలుస్తోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!