Pawan Kalyan: ప్రభుత్వం తరపున సాయం అందించడం పెద్ద విషయమేమీ కాదు.. కానీ, ప్రభుత్వం చేతుల్లో ఉన్నా.. వ్యక్తిగతంగా లక్షల్లో సాయం అందించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. మరోసారి అని ఎందుకూ అంటే, ఆయనకు పదవి వచ్చిన తర్వాత కూడా ఇలా వ్యక్తిగతంగానే ఎన్నో సాయాలు చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు (Indian Blind Women Cricket Team)కు ఆయన ఊహించని సాయం అందించారు. ప్రపంచ కప్ విజేతగా నిలిస్తే ప్రధాన జట్లలోని భారత క్రికెటర్లకు ప్రభుత్వాలు కనకవర్షం కురిపిస్తాయనే విషయం తెలియంది కాదు. కానీ, ప్రపంచ కప్ విజేతగా నిలిచినా కూడా భారత మహిళల అంధుల క్రికెట్ జట్టును ఎవరూ పట్టించుకోకపోవడం విడ్డూరం. ఆ తప్పు పవన్ కళ్యాణ్ చేయలేదు. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టు సభ్యులను, శిక్షకులను, సహాయక సిబ్బందిని మంగళగిరిలోని తన క్యాంపు కార్యాలయానికి పిలిచి, వారిని ఘనంగా సత్కరించి పంపించారు.
Also Read- Mahesh Babu: ‘వారణాసి’ తర్వాత ఊర మాస్ దర్శకుడితో మహేష్ బాబు మూవీ.. ఫ్యాన్స్‌కి మరో ట్రీట్!
రూ. 84 లక్షల వ్యక్తిగత సాయం
ఈ కార్యక్రమంలో.. ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్‌కు రూ.5 లక్షల చొప్పున, శిక్షకులకు రూ.2 లక్షలు చొప్పున మొత్తం రూ. 84 లక్షలు వ్యక్తిగత సాయం అందించారు. అలాగే ప్రతి మహిళా క్రికెటర్‌కు పట్టు చీర, శాలువాతో పాటు జ్ఞాపిక, కొండపల్లి బొమ్మలు, అరకు కాఫీతో కూడిన బహుమతులను అందించి సత్కరించారు. మహిళా అంధ క్రికెటర్లు సాధించిన విజయం దేశానికే గర్వకారణమని కొనియాడుతూ.. అంధ క్రికెటర్ల ప్రాక్టీస్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని, అన్ని విధాలా అండగా నిలవాలని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు స్వయంగా విజ్ఞప్తి చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహిస్తోందని, మహిళా క్రికెటర్లు తెలిపిన అంశాలను ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. ఇంకా, ప్రపంచ కప్ గెలిచిన జట్టులో ఆంధ్రప్రదేశ్ చెందిన క్రీడాకారిణులు దీపిక (జట్టు కెప్టెన్), పాంగి కరుణా కుమారి ఉండటం సంతోషంగా ఉందన్నారు. ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
అంధ క్రికెటర్ల గ్రామ సమస్యలపై వెంటనే చర్యలు
ఈ సందర్భంగా జట్టు కెప్టెన్ దీపిక తమ గ్రామ సమస్యలు ఏపీ డిప్యూటీ సీఎంకు తెలిపారు. ఆమె శ్రీ సత్యసాయి జిల్లా హేమావత్ పంచాయతీ తంబలహట్టి తండాకు చెందినవారు. తమ గ్రామానికి రహదారి సౌకర్యం కావాలని దీపిక విజ్ఞప్తి చేయగా.. అందుకు అవసరమైన చర్యలు వెంటనే చేపట్టాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆదేశించారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన క్రికెటర్ కరుణకుమారి చేసిన విజ్ఞప్తులపైనా తక్షణమే చర్యలు ప్రారంభించాలని పేషీ అధికారులకు ఆయన సూచించారు. దీంతో పవన్ కళ్యాణ్‌పై అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇటీవల ఆయనకు వచ్చిన ‘అభినవ శ్రీకృష్ణదేవరాయ’ బిరుదును నిలబెట్టుకున్నారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రపంచ కప్ విజేతగా నిలిచిన భారత మహిళల అంధుల క్రికెట్ జట్టుతో భేటీ అయిన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో క్రికెటర్లు, శిక్షకులు, సహాయక సిబ్బందితో ఈ భేటీ జరిగింది.
• ప్రపంచ కప్ సాధించిన క్రికెటర్లను అభినందించి, ఒక్కో మహిళా క్రికెటర్ కు రూ.5… pic.twitter.com/ckIiVOJRbJ
— JanaSena Party (@JanaSenaParty) December 12, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

