Telangana Govt: రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ
Telangana Govt (image Credit: swetcha reporter)
Telangana News

Telangana Govt: రికార్డ్ స్థాయిలో ధాన్యం సేకరణ.. కొనుగోళ్లు మరింత స్పీడప్!

Telangana Govt: ​రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల పక్రియ ఈ వానాకాలంలో సరికొత్త రికార్డులను లిఖిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు, ఏర్పాటు చేసిన విస్తృతమైన కొనుగోలు కేంద్రాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయి. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించడమే కాకుండా, సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం అందిస్తున్న అదనపు బోనస్ సాగు ముఖచిత్రాన్నే మార్చేసింది. ఈ సీజన్ ఆరంభం నుంచే ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందడుగు వేసింది. వానాకాలం పంటగా రైతులు పండించిన ధాన్యంలో రికార్డ్ స్థాయిలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ ద్వారా కొనుగోలు చేయాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నది.

ఈ ధాన్యం విలువ అక్షరాలా రూ.13,661 కోట్లు

ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా 8,433 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. గతంతో పోలిస్తే ఈ స్థాయిలో కేంద్రాలు ఏర్పాటు చేయడం ఇదే ప్రథమం. దీనివల్ల రైతులకు రవాణా కష్టాలు తప్పి, తమ ఊరి పొలిమేరల్లోనే పంటను అమ్ముకునే వెసులుబాటు కలిగింది. కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు ధాన్యం సేకరణ జోరుగా సాగుతున్నది. బుధవారం నాటికి ప్రభుత్వ వర్గాల గణాంకాల ప్రకారం ప్రభుత్వం నిర్దేశిత లక్ష్యంలో సగానికి పైగా, అంటే 51.86 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. ఇప్పటివరకు కొనుగోలు చేసిన ఈ ధాన్యం విలువ అక్షరాలా రూ.13,661 కోట్లు. ఈ మొత్తం నేరుగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలోకి చేరడం శుభపరిణామం.

​సమతూకంలో సన్న, దొడ్డు రకాలు

ధాన్యం కొనుగోళ్లలో సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోళ్లు దాదాపు సమాన స్థాయిలో ఉన్నాయి. ఇప్పటి వరకు ​దొడ్డు రకం 26.37 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించగా, 25.49 లక్షల మెట్రిక్ టన్నులు సన్న రకాన్ని కొనుగోలు చేశారు. సాధారణంగా దొడ్డు రకం సాగు ఎక్కువగా ఉండేది. కానీ, ఈసారి ఆ పరిస్థితి మారింది. సన్న రకం ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. సన్న బియ్యం సాగు వైపు రైతులు మొగ్గు చూపడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్రోత్సాహకమే ప్రధాన కారణం. సన్న రకం ధాన్యం పండించిన రైతులకు క్వింటాలుకు మద్దతు ధరతో పాటు, అదనంగా రూ.500 బోనస్ చెల్లిస్తామని కాంగ్రెస్ సర్కార్ ప్రకటించింది. ఈ నిర్ణయం క్షేత్రస్థాయిలో అద్భుత ఫలితాలను ఇచ్చింది. ఇప్పటికే సన్న రకం ధాన్యం విక్రయించిన రైతులకు ప్రభుత్వం రూ.314 కోట్లను కేవలం బోనస్ రూపంలోనే చెల్లించింది. ఇది రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కుతుండడంతో కర్షకుల కళ్లలో ఆనందం వెల్లివిరుస్తున్నది.

Also Read: Telangana Govt: ఆదర్శవంతమైన నిర్ణయాలు.. ఆర్థిక భరోసా పథకాలు.. పారిశ్రామికవేత్తలతో పోటీ పడుతున్న మహిళలు

సర్కార్ ప్లాన్ సక్సెస్

ఈ వానాకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లు రాష్ట్ర వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయానికి తెరలేపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, సకాలంలో జరుగుతున్న చెల్లింపులు, బోనస్ ప్రోత్సాహకాలు వెరసి రైతులు భరోసాగా సాగులో ముందుకు సాగుతున్నారు. గత ఏడాది అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఏడాది వ్యవసాయ శాఖ పకడ్బందీగా ప్లాన్ చేయడం వలనే ఇది సాధ్యమైందని అధికారులు చెబుతున్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటనూ కొనుగోలు చేసినట్లు వివరించారు. తేమ శాతాన్ని తేలిగ్గానే తీసుకొని కొనుగోలు చేసినట్లు ఓ అధికారి తెలిపారు. రైతుకు నష్టం జరుగకుండా ప్రభుత్వం సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకున్నదని ఆయన వివరించారు.

ధాన్యం కొనుగోలు వివరాలు

– కొనుగోలు లక్ష్యం 80 లక్షల మెట్రిక్ టన్నులు
– ఏర్పాటు చేసిన కేంద్రాలు 8,433
– ఇప్పటి వరకు కొనుగోలు చేసింది 51.86 లక్షల మెట్రిక్ టన్నులు
– మొత్తం విలువ రూ.13,661 కోట్లు
– దొడ్డు రకం సేకరణ 26.37 లక్షల మెట్రిక్ టన్నులు
– సన్న రకం సేకరణ 25.49 లక్షల మెట్రిక్ టన్నులు
– సన్న రకం బోనస్ (క్వింటాలుకు) రూ.500 అదనం
– ఇప్పటి వరకు అందించిన బోనస్ రూ.314 కోట్లు

Also Read: Telangana Govt: మత్స్యకారులకు ప్రభుత్వం పెద్దపీట.. గత ప్రభుత్వం కంటే రూ.30 కోట్లకు పైగా నిధుల పెంపు!

Just In

01

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!