Lockdown Delay: మరో సారి రిలీజ్ ఆగిపోయిన అనుపమ ‘లాక్ డౌన్’
lockdown-release-postpone
ఎంటర్‌టైన్‌మెంట్

Lockdown Delay: మరో సారి రిలీజ్ ఆగిపోయిన అనుపమ పరమేశ్వరన్ ‘లాక్ డౌన్’.. నిర్మాతలు ఏం చెప్పారంటే?

Lockdown Delay: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్ర పోషించిన చిత్రం ‘లాక్‌డౌన్’ (Lockdown) విడుదలను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 5వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కావాల్సిన ఈ సినిమాను 12 కు వాయిదా వేశారు. ప్రస్తుతం అది కూడా వాయిదా వేశారు. ఇప్పటికే ఈ సినిమా పలు మార్లు విడుదల వాయిదా పడింది. తాజాగా మరొక్కసారి ఈ సినిమా వాయిదా పడింది. దీనికి సంబంధించి అధికారిక నోట్ విడుదల చేశారు నిర్మాతలు. ఈ సినిమా విడుదల కోసం అనుపమ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కనీసం విడుదల తేదీ అయినా ప్రకటిస్తే బాగుంటుందని వారు అభిప్రాయ పడుతున్నారు. అయితే ఈ సినిమా విడుదల తేదీ కోసం ఎదురు చూడాల్సిందే.

Read also-Aadi Double: బాలయ్య బాబుకు ఎదురెళుతున్న ఆది పినిశెట్టి.. ‘అఖండ 2’లో అనుకుంటే పొరపాటే?

అధికారిక ప్రకటనలో ఏం చెప్పారు అంటే.. ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ (Lyca Productions) నుంచి రాబోతున్న చిత్రం ‘లాక్‌డౌన్’ (Lockdown) విడుదల వాయిదా పడింది. ‘అనుకోని పరిస్థితుల’ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. లైకా ప్రొడక్షన్స్ విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయం స్పష్టం చేసింది. ఈ చిత్రానికి సంబంధించిన కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని వారు తెలిపారు. ఈ చిత్రం పట్ల ఉన్న ఆసక్తిని తాము అర్థం చేసుకున్నామని, ఈ మార్పు వలన ప్రేక్షకులు, థియేటర్ భాగస్వాములు, పంపిణీదారులు, మీడియాకు కలిగే అసౌకర్యానికి చింతిస్తున్నామని లైకా ప్రొడక్షన్స్ తెలిపింది. అదే సందర్భంలో సినిమాను అత్యుత్తమ పరిస్థితుల్లో ప్రేక్షకులకు అందించడానికి తాము కట్టుబడి ఉన్నామని సంస్థ హామీ ఇచ్చింది. ప్రేక్షకులు చూపిస్తున్న సహనం, మద్దతు మరియు అవగాహనకు ధన్యవాదాలు తెలుపుతూ, కొత్త విడుదల తేదీని త్వరలో ప్రకటిస్తామని పేర్కొంది.

Read also-Eesha Movie: ‘ఈషా’ కూడా అదే తరహాలో రాబోతుంది.. కన్ఫామ్ చేసిన నిర్మాతలు.. అంటే మరో హిట్?

‘లాక్‌డౌన్’ సినిమాకు AR జీవా దర్శకత్వం వహించారు. ఈ చిత్రం టైటిల్‌కు తగ్గట్టుగానే.. 2020లో దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా మహమ్మారి లాక్‌డౌన్ సమయంలో జరిగిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సైకలాజికల్ డ్రామాగా రూపొందింది. అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో అనిత అనే కీలకమైన, భావోద్వేగభరితమైన పాత్రను పోషించింది. ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు దక్కే అవకాశం ఉందని ఇప్పటికే ట్రైలర్ ద్వారా తెలుస్తోంది. ఈ సినిమా కథ కేవలం లాక్‌డౌన్ రోజుల్లోని ఇబ్బందులను మాత్రమే కాకుండా, ఆ ఒంటరితనం, అభద్రతా భావం వ్యక్తుల మానసిక ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపాయో విశ్లేషించే విధంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు. ఇప్పటికే ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు నుంచి ‘U/A’ సర్టిఫికేట్ లభించింది.

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క