Pragathi Fitness: టాలీవుడ్ తెరపై అమ్మ, అత్త పాత్రల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి ఇటీవల కాలంలో తన ఫిట్‌నెస్ ట్రాన్స్‌ఫర్మేషన్, పవర్ లిఫ్టింగ్ విజయాలతో అందరి దృష్టిని ఆకర్షించిన సంగతి తెలిసిందే. తాజాగా జరిగిన పవర్ లిఫ్టింగ్ పోటీల్లో ఆమె ఏకంగా నాలుగు పతకాలను సాధించి తనలోని అంకితభావాన్ని, దారుఢ్యాన్ని నిరూపించుకున్నారు. అయితే, ఈ ఫిట్‌నెస్ ప్రయాణం అంత సులభంగా సాగలేదని, తాను ఎదుర్కొన్న అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఆమె ఎమోషనల్ అయ్యారు.
Read also-Saroj Comments: ‘అఖండ 2’ సినిమా గురించి బండి సరోజ్ ఏం అన్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..
‘త్రీ రోజెస్’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు ప్రగతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సినిమా గురించి మాట్లాడిన తర్వాత, ఆమె తన వ్యక్తిగత జీవితంలో జిమ్, పవర్ లిఫ్టింగ్ తనకు ఇచ్చిన కొత్త ఉత్సాహం గురించి పంచుకున్నారు. ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న కష్టాలు, విమర్శలను గుర్తు చేసుకుని ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. “నాకు జిమ్ కొత్త జీవితాన్ని ఇచ్చింది. నా వ్యక్తిగత జీవితంలో ఎన్నో కష్టాలు చూసిన తర్వాత, నేను ఏకాకిగా ఉన్నానని అనిపించినప్పుడు, నాలోని ఒంటరితనాన్ని పోగొట్టుకోవడానికి నేను జిమ్‌కు వెళ్లడం మొదలుపెట్టాను.” అంటూ ప్రగతి తన ప్రయాణాన్ని ప్రారంభించారు. జిమ్‌కి వెళ్లడం మొదలు పెట్టినప్పుడు, ఒక ప్రముఖ నటిగా ఆమెకు చాలా మంది నుంచి విమర్శలు ఎదురయ్యాయి. “అసలు ఈ వయసులో మీకు జిమ్ ఎందుకమ్మా?” అయినా అలాంటి బట్టలు వేసుకోవడం ఏంటి అని చాలా మంది నన్ను క్రిటిసైజ్ చేశారు. కానీ జిమ్ కి అవే వేసుకెళ్లాలి తప్పదు. ఆ సమయంలో నేను చాలా బాధ పడ్డా.. నాకూ ఓ కూతురు ఉంది ఆమె చదువుకుంటుంది. ఆమె ఫ్రెండ్స్ ఏమనుకుంటారు. ఇలాంటి ఆలోచనలు చాలా వచ్చాయి. కానీ వాటన్నింటికీ నా పథకాలతో సమాధానం చెప్పాను. అంతే కాకుండా నేను మెడల్స్ సాధిచినపుడు.. నాకు ఇద్దరు మాత్రమే ఫోన్ చేశారు. అది భ్రహ్మానందం, మంచు లక్ష్మి వీరిద్దరు మాత్రమే కాల్ చేశారు. అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Save the Tigers Season 3: టైగర్స్ వస్తున్నారు.. ‘సేవ్ ద టైగర్స్ సీజన్ 3’ గ్లింప్స్ చూశారా?
ప్రగతి మాటల్లో ఆమె ఫిట్‌నెస్ ప్రయాణం కేవలం శారీరక మార్పుల కోసం కాదు, మానసిక దృఢత్వం కోసం అన్నది స్పష్టంగా అర్థమవుతుంది. జిమ్ తనకు ఒంటరితనాన్ని దూరం చేసి, తనలో ఆత్మవిశ్వాసాన్ని నింపింది. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు సాధించడం ద్వారా, వయస్సు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని, ఏదైనా సాధించాలనే సంకల్పం ఉంటే ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చని ఆమె నిరూపించారు. ఆమె విజయం కేవలం నటనారంగానికే పరిమితం కాకుండా, క్రీడా రంగంలో కూడా మహిళలకు, ముఖ్యంగా మధ్య వయస్కులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. తన వ్యక్తిగత అనుభవాలను పంచుకున్న తర్వాత, ఆమె ‘త్రీ రోజెస్’ సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తంగా, ప్రగతి ఎమోషనల్ ప్రసంగం తన వ్యక్తిగత పోరాటాన్ని, పట్టుదలను వెల్లడి చేయడమే కాక, సమాజంలోని విమర్శలు, అంచనాలను ఎదుర్కొని నిలబడాలనే సందేశాన్ని కూడా బలంగా ఇచ్చింది.

