- ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్
- నా గొంతు నొక్కాలని చెప్పి నామీద అక్రమ కేసులు
- ఇలాంటి చర్యలు సరైనవి కావని నా విజ్ణప్తి
- ప్రశ్నించే హక్కు నాకు రాజ్యాంగం కల్పించింది
- సమస్యలను ఎత్తి చూపడమే నేను చేసిన నేరమా?
- పిల్లలకు సరైన విద్యనందించాలని కోరడం తప్పా?
- సమాధానం చెప్పకుండా కలెక్టర్ వెళ్లిపోవడం భావ్యమా?
- దళిత బంధు నిధులు అడిగితే నేరమా?
- ఇదంతా కక్ష సాధింపులో భాగమే..
BRS MLA Padi Kaushik Reddy questioned government about criminal case on him
ఈ ప్రభుత్వం నిరంకుశంగా నా మీద కేసులు పెట్టి నా గొంతు నొక్కాలనుకుంటే ఇది సరైన పద్దతి కాదని విజ్ఖప్తి చేస్తున్నా.. ఇదేనా మీ ప్రజాపాలన అని అడుగుతున్నా అని ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కామెంట్స్ చేశారు. కాగా మంగళవారంకరీంనగర్ జిల్లా పరిషత్ సమావేశంలో కలెక్టర్ పమేలా సత్పతి బయటికి వెళ్ళే సమయంలో ఎమ్మెల్యే కౌషిక్ రెడ్డి అడ్డుకుని బైఠాయించి నిరసనకు దిగారు. డీఈఓ ప్రజా ప్రతినిధులను అవమానిస్తున్నారని ఆయన్ను సస్పెండ్ చేయాలని.. అలాగే దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని పట్టుబట్టారు. దీంతో జెడ్పీ సీఈవో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేయడంతో పోలీసులు కొత్త చట్టం ప్రకారం కేసు నమోదు చేశారు. తనపై పెట్టిన కేసుపై కౌశిక్ రెడ్డి స్పందిస్తూ నా గొంతును నొక్కలేరు ఇక్కడ కేసీఆర్ శిష్యులం టిఆర్ఎస్ పార్టీ సైనికులం మేమంతా..కౌన్సిల్ మీటింగ్ లో ప్రశ్నించేందుకు ఎమ్మెల్యేగా నాకు రాజ్యాంగం కల్పించిన హక్కు ఉంది.
రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం లేదా?
పేద విద్యార్థుల కోసం రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసి పిల్లలకు సరైన విద్యను అందించాలని చెప్పడమేనా .. నేను చేసిన తప్ప. ఎమ్మెల్యేగా రివ్యూ మీటింగ్ పెట్టుకునే అధికారం నాకు ఉన్నదా లేదా? అన్నారు. డీఈఓ పై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను అడిగితే సమాధానం చెప్పలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని కౌశిక్ రెడ్డి అన్నారు. కలెక్టర్ గారు సమాధానం చెప్పకుండా హాల్లో నుండి బయటకు వెళ్లిపోవడం బాధాకరం..హుజురాబాద్ నియోజకవర్గం లో రెండవ విడత దళిత బంధు నిధులు ఎందుకు ఇవ్వడం లేదని అడిగితే నేరమా? ఇదంతా చూస్తుంటే కక్ష సాధింపు చర్యగా కనిపిస్తోందని అన్నారు.