Kalvakuntla Kavitha: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. మరోమారు బీఆర్ఎస్ పార్టీ (BRS Party)ని టార్గెట్ చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR), మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)లు చేసిన పోస్టులపై సెటైరికల్ గా స్పందించారు. దీక్షా దివస్ (నవంబర్ 29), విజయ్ దివస్ (డిసెంబర్ 9) గురించి ప్రస్తావిస్తూ వారు చేసిన పోస్టులపై పరోక్షంగా చురకలు అంటించారు. ప్రస్తుతం కవిత చేసిన ఎక్స్ పోస్ట్.. తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
కవిత ఏమన్నారంటే?
కల్వకుంట్ల కవిత తన అధికారిక ఎక్స్ ఖాతాలో స్పందిస్తూ ‘అధికారం కోల్పోయాక దీక్షా దివస్ లు, విజయ్ దివస్ లు. ఇది ఉద్యమాల గడ్డ.. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు’ అని రాసుకొచ్చారు. కాగా, బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన కవిత.. జనం బాట కార్యక్రమం ద్వారా ప్రజలకు చేరువ అవుతున్నారు. ఈ క్రమంలో విపక్ష బీఆర్ఎస్ పార్టీని ఆమె టార్గెట్ చేయడాన్ని చూస్తూనే ఉన్నాం. అయితే దీక్షా దివస్, విజయ్ దివస్ లపై కేటీఆర్, హరీశ్ రావు పోస్టు పెట్టిన కొద్దిసేపటికే కవిత ఈ మేరకు స్పందించడం ఆసక్తి రేపుతోంది. ఈ పోస్టు ద్వారా కేటీఆర్, హరీశ్ రావులకు కవిత చురకలు అంటించారన్న ప్రచారం జరుగుతోంది.
అధికారం కోల్పోయాక
దీక్షా దివస్ లు.. విజయ్ దివస్ లుఇది ఉద్యమాల గడ్డ
ప్రజలు అన్నీ గమనిస్తున్నరు !!— Kavitha Kalvakuntla (@RaoKavitha) December 9, 2025
కేటీఆర్ పోస్ట్
అంతకు ముందు కేటీఆర్ ఎక్స్ లో ఒక పోస్టు పెట్టారు. ‘తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్). సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16 ఏళ్లు. నవంబర్ 29 (దీక్షా దివస్) లేకుంటే డిసెంబర్ 9 (విజయ్ దివస్) లేదు. డిసెంబర్ 9 లేకుంటే జూన్ 2 లేదు’ అని కేటీఆర్ రాసుకొచ్చారు.
తుది దశ తెలంగాణ ఉద్యమ ఫలితంగా రాష్ట్ర ఏర్పాటుకు తొలి అడుగుపడ్డ రోజు డిసెంబర్ 9 (విజయ్ దివస్).
సబ్బండ వర్గాల పోరాటం, అమరుల త్యాగం, కేసీఆర్ గారి ఆమరణ నిరాహార దీక్షతో ఢిల్లీ పీఠం వణికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి నేటికి 16… pic.twitter.com/nVLX9xcYMq
— KTR (@KTRBRS) December 9, 2025
Also Read: Global Summit 2025: తెలంగాణ రైజింగ్ సమ్మిట్.. రెండో రోజూ పెట్టుబడుల వెల్లువ.. రూ.1,04,350 కోట్ల ఒప్పందాలు
హరీశ్ రావు ఏమన్నారంటే?
మరోవైపు హరీశ్ రావు సైతం డిసెంబర్ 9 ప్రత్యేకతను ఉద్దేశించి ఎక్స్ లో పోస్ట్ పెట్టారు. ‘దశాబ్దాల ఆశ, ఆవేదన, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారి ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినం నేడు. నవంబర్ 29 దీక్ష దివాస్. డిసెంబర్ 9 విజయ్ దివాస్. 2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావం. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజులివి. కేసీఆర్ పోరాటం + నాలుగు కోట్ల ప్రజల చైతన్యం = తెలంగాణ ఉద్యమ చరిత్ర. చెరిపేస్తే చెరిగిపోయేది కాదు.. చరిత్ర నుదిటిపై కాలం చేసిన సంతకం.. కేసీఆర్ గారు’ అని పోస్ట్ పెట్టారు.
దశాబ్దాల ఆశ, ఆవేదన, నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారి ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినం నేడు.
నవంబర్ 29 దీక్ష దివాస్
డిసెంబర్ 9 విజయ్ దివాస్
2014 జూన్ 2 తెలంగాణ ఆవిర్భావంతెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన… pic.twitter.com/6EBJEZNgQP
— Harish Rao Thanneeru (@BRSHarish) December 9, 2025

