Krithi Shetty: ఆ అనుభవం లేకపోవడమే కారణమని తెలుసుకున్నా..
Krithi Shetty (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Krithi Shetty: ఆ అనుభవం లేకపోవడమే కారణమని తెలుసుకున్నా.. బ్రేక్ తీసుకుంటా!

Krithi Shetty: కృతి శెట్టి.. ఈ పేరు టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘ఉప్పెన’ (Uppena) సినిమాతో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న కృతి శెట్టి (Krithi Shetty), ఆ తర్వాత వరుసగా అవకాశాలను అందిపుచ్చుకుంది. ‘బంగార్రాజు’ రూపంలో ఆమెకు మరో హిట్ కూడా పడింది కానీ, ఆ తర్వాతే ఆమెకు అసలు కష్టాలు మొదలయ్యాయి. ఈ మధ్యకాలంలో ఆమె చేసిన సినిమాలన్నీ నిరాశనే మిగిల్చాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘అన్నగారు వస్తారు’ (Annagaru Vostaru) మూవీ ఉంది. కార్తి (Karthi) హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ 12న విడుదలకు సిద్ధమైన క్రమంలో కృతి శెట్టి.. మూవీ ప్రమోషన్స్‌లో యమా జోరుగా పాల్గొంటుంది. పలు మీడియా సంస్థలకు ఆమె ఇంటర్వ్యూలు ఇస్తుంది. ఈ ఇంటర్వ్యూలో తనపై సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్‌పై ఎమోషనల్ అవుతూ.. కొన్ని విషయాలను షేర్ చేసుకుంది.

Also Read- Jr NTR: చిరు బాటలో జూనియర్ ఎన్టీఆర్.. అనుమతి లేకుండా పేరు, ఫొటో వాడకూడదంటూ..!

తీవ్రమైన ఒత్తిడిని ఫేస్ చేశాను

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ఉప్పెన’ సినిమా చేసే సమయంలో నాకు ఏం తెలిసేది కాదు. ఆ సినిమా ఇచ్చిన సక్సెస్‌తో అంతా బాగానే ఉందని అనుకున్నాను. ఆ సినిమా నా లైఫ్‌ని మార్చేసింది. ఆ సమయంలో ఎన్నో విషయాలను నేర్చుకున్నాను. ఏదీ కష్టమని అనిపించలేదు. కాకపోతే చిన్న వయసు కావడంతో తీవ్రమైన ఒత్తిడి ఉండేది. జుట్టు రాలిపోతుండేది. అదే సమయంలో చర్మ సంబంధిత సమస్యలు కూడా ఫేస్ చేశాను. దీంతో అసలు ఏం చేయాలో కూడా తోచేది కాదు. కష్టంగా ఉంటే సినిమాలు ఆపేసేయమని అమ్మానాన్నలు కూడా చెప్పారు. నేను కూడా అదే నిర్ణయానికి వచ్చాను. ఎందుకంటే ఆ పరిస్థితులను ఫేస్ చేసే సామర్థ్యం అప్పట్లో నాకు లేదు.

Also Read- Bandi Saroj Kumar: కొంచమైనా బాధ్యత ఉండాలిగా.. ‘అఖండ 2’ నిర్మాతలపై ‘మోగ్లీ’ విలన్ ఫైర్!

అనుభవం లేకపోవడమే..

దీనికి తోడు సోషల్ మీడియాలో నాపై ట్రోలింగ్, నెగిటివిటీ బాగా పెరిగిపోయాయి. అవి నన్ను ఎంతగానో కుంగదీశాయి. నేను చేసిన ప్రతి సినిమాకు.. వంద శాతం ఎఫెర్ట్ పెట్టాను. నా బెస్ట్ ఇచ్చాను. అయినా కూడా నన్నే టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం చాలా బాధగా అనిపించేది. ఈ ఒత్తిడి, వరుస ఫ్లాప్స్‌తో కొంతకాలం బ్రేక్ తీసుకునే ఆలోచనలో ఉన్నాను. నిజంగా స్టోరీలను సెలక్ట్ చేసుకోవడంలో ఫెయిలయ్యాను. దానికి కారణం నాకు అనుభవం లేకపోవడమే. ఇది నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇంత కష్ట సమయంలో కూడా నేను స్ట్రాంగ్‌గా ఉన్నానంటే.. అందుకు కారణం మాత్రం నా తల్లిదండ్రులు, స్నేహితులే’’ అని ఈ బేబమ్మ చెప్పుకొచ్చింది. నిజమే, ఆమె చెప్పిన మాటల్లో వంద శాతం న్యాయం ఉంది. ఆమె చేసిన సినిమాలన్నీ ఒకసారి గమనిస్తే.. ఆమె పాత్ర పరంగా, ఆ పాత్రకు ఆమె చేసిన న్యాయపరంగా ఆమెదేం తప్పులేదు. కథలో దమ్ము లేకపోతే ఆమె మాత్రం ఏం చేయగలదు. హీరోకి హిట్ రాకపోతే హీరోయిన్ ఏం చేస్తుంది? అయినా, ఈ మధ్య పర్సనల్‌గా టార్గెట్ చేయడం ఎక్కువైపోయింది. అందుకే కృతి అంత ఇబ్బందిని ఫేస్ చేయాల్సి వచ్చింది. మరి కొన్నాళ్లు బ్రేక్ తీసుకుంటానంటుంది కాబట్టి.. సక్సెస్ సీక్రెట్‌ని పట్టుకుని రీ ఎంట్రీ ఇస్తుందేమో చూద్దాం..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!