YS Sharmila: మోదీ, చంద్రబాబులపై షర్మిల విమర్శనాస్త్రాలు
YS-Sharmila (Image source X)
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Sharmila: కర్త మోదీ.. కర్మ చంద్రబాబు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై షర్మిల విమర్శనాస్త్రాలు

YS Sharmila: ఒక్కొక్కటిగా అదానీకి అన్ని అప్పగిస్తూ రాష్ట్రాన్ని అదానీ ప్రదేశ్‌గా మార్చాలని చూస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారుపై ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ఆరోపణలు గుప్పించారు. అమ్మేది లేదంటూనే అప్పనంగా అన్నీ అదానీ చేతిలో పెడుతున్నారని అన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ లేదంటూ, అమ్మబోమని, ఆదుకుంటామని బీజేపీ చెప్పేవన్నీ కల్లబొల్లి కబుర్లేనని ఆమె విమర్శించారు. తెరముందు గొప్పలు.. తెరవెనుక అదానీ కోసం స్కెచ్చులు.. విశాఖ స్టీల్‌పై ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సైలెంట్ కిల్లింగ్ చేస్తున్నారని ఆరోపించారు. ఉద్యోగులను తప్పిస్తున్నారని, కొత్త నియామకాలు లేకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. అడ్డికి పావుసేరు లెక్కన ప్లాంట్ భూములను అదానీకి ధారాదత్తం చేయాలని చూస్తున్నారని, ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కుకు ఉరి పెడుతున్నారని వైఎస్ షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు.

Read Also- Bigg Boss Telugu 9: సంజన జైలుకి, తాత్కాలిక కెప్టెన్‌గా భరణి.. నామినేషన్స్ టాస్క్‌లో విన్నర్ ఎవరు?

విశాఖ ఉక్కును అమ్మే కుట్రలో కర్త ప్రధాని మోదీ అయితే, క్రియ చంద్రబాబు అని ఆమె విమర్శనాస్త్రాలు సంధించారు. ‘‘ఒక చేత్తో సాయం అని చెప్పి మరో చేత్తో గుంజుకున్నారు. పొమ్మనకుండా పొగపెడుతున్నారు. నష్టాల సాకు చూపి ఉద్యోగులను వేధిస్తున్నారు. పనికొద్ది జీతమని ప్రపంచంలో లేని రూల్స్‌ను పెడుతున్నారు. టెండర్ల పేరుతో ముక్కలుగా కోసి విడిభాగాలుగా అమ్మకానికి పెట్టి, ప్రతి అడుగూ ఆదానీకి దగ్గర చేస్తున్నారు. స్టీల్ ఉత్పత్తికి కావాల్సిన ముడి సరుకులను ఇవ్వకుండా ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇంత చేస్తూ స్టీల్ ప్లాంట్‌పై చిత్తశుద్ధి ఉందని గొప్పలు చెప్పడానికి బీజేపీకి సిగ్గుండాలి. విశాఖ స్టీల్‌పై కేంద్రానికి చిత్తశుద్ధి ఉంటే , తెలుగు వారి ఆత్మగౌరవం మీద గౌరవముంటే అదానీకి కట్టబెట్టే ఆలోచనే లేకుంటే, వెంటనే ఈ పార్లమెంట్ సమావేశాల్లో ప్రధాని మోదీ నిలబడి , ప్రకటన చేయాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. స్టీల్ ప్లాంట్‌ను అమ్మేది లేదని చెప్పాలి. విశాఖ స్టీల్‌కి సొంతగా గనులను కేటాయించాలి. విశాఖ స్టీల్‌ను సెయిల్‌లో విలీనం చేస్తున్నట్లు హామీ ఇవ్వాలి. రాష్ట్ర ఎంపీలకు దమ్ముంటే మోదీతో ఈ ప్రకటన చేయించాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం’’ అని షర్మిల పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ఆమె ఎక్స్ వేదికగా స్పందించారు.

Read Also- Drunk driving: ప్రమాదాల నివారణకు డ్రంకెన్ డ్రైవ్.. 900 మంది మందుబాబులు అరెస్ట్!

దేశవ్యాప్తంగా ఇంతే!

ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాదు, దేశవ్యాప్తంగా బీజేపీ కూటమి ప్రభుత్వాలు మొత్తం అన్ని రంగాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నాయని వైఎస్ షర్మిల ఆరోపించారు. తాజాగా, ఇండిగో IndiGo) సంక్షోభం, గందరగోళ పరిస్థితులు ఒక వ్యవస్థకు ప్రత్యక్ష ఉదాహరణ మాత్రమేనని వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలలో సామాన్య ప్రజలను బందీలుగా మార్చి, ప్రభుత్వం మాత్రం తన కార్పొరేట్ స్నేహితుల ముందు నిస్సహాయంగా వ్యవహరిస్తోందని ఆమె ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కనీసం ప్రాథమిక సేవలను కూడా నియంత్రించేందుకు నిరాకరిస్తోందని, పౌరులు ఇంకెంత కాలం బాధపడాలని ఆమె ప్రశ్నించారు.

Just In

01

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం

Congress Election Strategy: రెండో విడత కాంగ్రెస్ కొత్త స్ట్రాటజీ.. మెజార్టీ స్థానాలపై ఫోకస్..!

Telangana BJP: మున్సిపాలిటీలు విలీనంపై బీజేపీ పోరుబాట.. ఎస్ఐఆర్ పై కీలక నిర్ణయం