Corruption Case: డబ్బు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ మార్చిన సునీల్
Corruption Case ( image CREDit: swetcha reporter)
Telangana News

Corruption Case: డబ్బు తీసుకుని ఎఫ్‌ఐఆర్‌ మార్చిన సునీల్.. సీఐను సస్పెండ్ చేసిన కమిషనర్ సజ్జనార్!

Corruption Case: హైదరాబాద్‌లోని కుల్సుంపురా సీఐ సునీల్ విధి నిర్వహణలో అవినీతికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై హైదరాబాద్ కమిషనర్ వీ.సీ. సజ్జనార్ (VC Sajjanar) సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కుల్సుంపురా పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణపై స్టేషన్‌కు ఫిర్యాదు కూడా అందింది. అయితే, కేసు నమోదు చేసే క్రమంలో సీఐ సునీల్ అవినీతికి పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి.

Also Read: Corruption Case: రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ ఇంట్లో సోదాలు.. బయటపడ్డ 17 టన్నుల తెనే‌, ఊహకందని డబ్బు, ఆస్తులు

సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు

ఫిర్యాదులో ఉన్న నిందితులలో ఒక పక్షం వారి నుంచి సునీల్ భారీ మొత్తంలో డబ్బులు తీసుకున్నట్లు తెలిసింది. అందుకు ప్రతిఫలంగా, ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసేటప్పుడు అతను నిందితుల పేర్లను మార్చి నమోదు చేసినట్టు ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారం కమిషనర్ దృష్టికి వెళ్ళింది. ఆయన వెంటనే ఈ సంఘటనపై అంతర్గత విచారణకు ఆదేశించారు. ఈ విచారణలో, సీఐ సునీల్ నిందితుల పేర్లను మార్చిన మాట నిజమేనని నిర్ధారణ అయింది. దీంతో, సజ్జనార్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

Also Read: Corruption Case: రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డుల అధికారి అరెస్ట్.. విస్తుపోయేలా అక్రమాస్తుల చిట్టా!

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..