Panchayat Elections: రెండో విడతలో మొత్తం 4,332 గ్రామ పంచాయతీలకు, 38342 వార్డులకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. నామినేషన్లు స్వీకరించింది. 4,332 సర్పంచ్ స్థానాలకు 28278 నామినేషన్లు రాగా, 38342 వార్డులకు 93595 నామినేషన్లు వచ్చాయి. అయితే 4332 సర్పంచ్ స్థానాల్లో 415 పంచాయతీలలో సర్పంచులు ఏకగ్రీవమయ్యాయి. పలు కారణాలతో 5 గ్రామాల సర్పంచ్ స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. దీంతో మిగిలిన 3,911 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనుండగా 13,128 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 38,342 వార్డులకు నోటిఫికేషన్ ఇవ్వగా 8,304 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. ఇక మిగిలిన 29,903 వార్డు స్థానాలకు పోలింగ్ జరగనుండగా 78,158 మంది అభ్యర్థులు పోటీ లో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Viral Video: చాలా బోర్ కొడుతోంది.. ఇక పని చేయలేనంటూ.. ఉద్యోగం వదిలేసిన Gen Z కుర్రాడు
ఏకగ్రీవాలైనవి..
రాష్ట్రంలోనే కామారెడ్డి జిల్లాలో 197 పంచాయతీలకు 44 సర్పంచ్ లు ఏకగ్రీవం కాగా, నిజామాబాద్ జిల్లాలో 196 పంచాయతీలకు 38, నల్గొండ జిల్లాలో 282 పంచాయతీలకు 38 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. వార్డుల్లోనూ కామారెడ్డి జిల్లాలో 1654 వార్డులు 776 ఏకగ్రీవంకాగా నిజామాబాద్ జిల్లాలో వార్డులు 674, నల్గొండ జిల్లాలో 553 స్థానాలు ఏకగ్రీవం అయినట్లు అధికారులు వెల్లడించారు. పోటీలో నిలిచిన అభ్యర్థులకు గుర్తులను కేటాయించారు. ఈనెల 14న పోలింగ్ నిర్వహించి అదేరోజు విజేతలను ప్రకటించనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Akhanda 2: ఆ సమస్య ఓ కొలిక్కి వచ్చింది కానీ.. ఇప్పుడు మరో సమస్య!

