Chamal Kiran Kumar Reddy: తెలంగాణ రాష్ట్రం అంటే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లెక్కలేదని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన ప్రత్యేకంగా మాట్లాడుతూ.. తెలంగాణ అప్పులతో సతమతమవుతుంటే కిషన్ రెడ్డి(Kishan Reddy) పట్టింపు లేనట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్(BRS) పదేళ్ల పాలనలో కుదేలు అయిన వ్యవస్థలను రేవంత్ రెడ్డి గాడిన పెడుతున్నారన్నారు. బీఆర్ఎస్ పాలనలో తప్పులు జరిగితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైలెంట్ గా ఉన్నారని గుర్త చేశారు. తెలంగాణకు 13 లక్షల కోట్లు కేంద్రం నుంచి తెచ్చామని కిషన్ రెడ్డి ప్రకటించడం విచిత్రంగా ఉన్నదన్నారు. ఈ నిధులు వచ్చిఉంటే, 8 లక్షల కోట్లు అప్పులు ఎలా అవుతాయి? అంటూ ఫైర్ అయ్యారు. ప్రతి నెల ఎనిమిది వేల కోట్లు అప్పులు కడుతున్నామన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ దోపిడి జరుగుతుంటే, కిషన్ రెడ్డి కళ్లకు గంతలు కట్టుకొని నిలబడ్డారని మండిపడ్డారు. రాష్ట్రం అప్పుల పాలవుతుంటే, కేంద్ర వ్యవస్థలతో ఎందుకు నియంత్రించలేకపోయారని ఎంపీ ప్రశ్నించారు.
దొంగ లెక్కలతో..
కిషన్ రెడ్డి దొంగ లెక్కలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. 13 లక్షల కోట్లు ఏ శాఖకు తెచ్చారో కిషన్ రెడ్డి స్పష్టంగా చెప్పాలన్నారు. గత రెండు ఏళ్లుగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Redy) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి మోడీ,కేంద్ర మంత్రులను కలిసి మెట్రో రెండవ దశ, మూసీ పునరుజ్జీవం, ట్రిపుల్ ఆర్, కొత్త ఎయిర్ పోర్టుల కోసం అనుమతులు, నిధులు ఇవ్వాలని కోరినట్లు ఎంపీ తెలిపారు. కానీ తెలంగాణకు రావాల్సిన సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ రాత్రికి రాత్రి ఏపీకి తరలించారన్నారు. దీనిపై తెలంగాణ ప్రజలకు కిషన్ రెడ్డి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు. 18 వ లోక్ సభలో చంద్రబాబు నాయుడును ప్రసన్నం చేసుకోవడానికి ఏపీకి సెమీ కండక్టర్ ప్రాజెక్ట్ ఇచ్చారా…? అని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా.. ఆరు గ్యారెంటీలు అమలు చేయాలన్న చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా సన్నబియ్యం ఉచితంగా ఇస్తున్నారా? ఏ రాష్ట్రంలో అయినా మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం బీజేపీ ఇచ్చిందా? అనేది కిషన్ రెడ్డి చెప్పాల్సిన అవసరం ఉన్నదన్నారు.
Also Read: Minister vivek: సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ సత్తా చాటుదాం: మంత్రి వివేక్
3 లక్షల కోట్లు టార్గెట్..
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ పేరుతో 3 లక్షల కోట్లు పెట్టుబడులు తేవాలని ప్రయత్నం చేస్తుంటే కిషన్ రెడ్డి తప్పుడు ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. మంచి జరుగుతుంటే బీజేపీ నేతలు కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారన్నారు. తెలంగాణకు నిధులు ఇచ్చి ఉంటే జూబ్లీహిల్స్ లో బీజేపీకి డిపాజిట్లు ఎందుకు పోతాయని ప్రశ్నించారు. తెలంగాణ కు కిషన్ రెడ్డి, బండి సంజయ్ లు విలన్ లు గా మారరని ఫైర్ అయ్యారు. ప్రపంచానికి తెలంగాణ ఖ్యాతిని చాటి చెప్పే విధంగా గ్లోబల్ సమ్మిట్ ను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోందని, దేశ,విదేశాల నుంచి మూడు వేల మంది ప్రతినిధులు గ్లోబల్ సమ్మిట్ కు వస్తున్నారన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి యువతకు ఉద్యోగ,ఉపాధి కల్పనలు కల్పించే విధంగా సీఎం రేవంత్ రెడ్డి గ్లోబల్ సమ్మిట్ కు శ్రీకారం చుట్టారన్నారు. ఇక పింక్ శునకాలు పైత్యం తగ్గించుకుంటే మంచిదని బీఆర్ ఎస్ పార్టీ నేతలను ఎంపీ విమర్శించారు.
ఇండిగో నిర్లక్యం…
దేశ వ్యాప్తంగా ఇండిగో విమానాల్లో ప్రయాణిస్తున్న వారు ఇబ్బందులు పడటానికి ఇండిగో యాజమాన్యం నిర్లక్ష్యం ప్రధాన కారణం అంటూ ఎంపీ తెలిపారు. గత సంవత్సరం డీజీసీఏ కొత్త రూల్స్ తెచ్చిందని, ఇండిగో ఎయిర్ లైన్స్ కొత్త రూల్స్ అమలు కాకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిందని, కొత్త రూల్స్ అమలు అయితే పైలెట్లను ఎక్కువ మందిని తీసుకోవాల్సి వస్తుందని ఇండిగో ఎయిర్ లైన్స్ భావించిందని ఎంపీ చామల వివరించారు. ఏవియేషన్ ఇండ్రస్టీలో ఇండిగో ఎయిర్ లైన్స్ కు 60 శాతానికి పైగా వాటా ఉన్నదన్నారు. డీజీసీఏ కొత్త రూల్స్ పై ఇండిగో ఎయిర్ లైన్స్ కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేసిందన్నారు. కొత్త నిబంధనలు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావించినప్పుడు ఇండిగో ఎయిర్ లైన్స్ దగ్గర సరిపడా స్టాఫ్ ఉందా ?,ఎయిర్ క్రాఫ్ట్స్ ఎన్ని ఉన్నాయి? ఎంతమంది ప్రయాణికులు బుక్ చేసుకున్నారు? అనే ఆలోచన విమానయాన శాఖ చేయాల్సి ఉండేదని కానీ అలా జరగలేదన్నారు. ఇండిగో ఫ్లైట్స్ ఎగరకపోతే దేశ వ్యాప్తంగా ప్రజలకు నష్టం జరుగుతుందని, తద్వారా కేంద్ర ప్రభుత్వం దిగి వస్తుందని ఇండిగో యాజమాన్యం పట్టుదలకు పోయిందన్నారు. దేశ వ్యాప్తంగా విమాన ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారని, అత్యవసర ప్రయాణాల్లో

