Politics

Notice: నోటీస్.. టెన్షన్

– బీఆర్ఎస్ ఆఫీసులకు వరుస నోటీసులు
– ఇప్పటికే నల్లగొండ ఆఫీస్ కూల్చివేయాలన్న కోమటిరెడ్డి
– తాజాగా హనుమకొండ బీఆర్ఎస్ కార్యాలయానికి నోటీసులు
– ప్రభుత్వ భూమిలో నిర్మాణంపై అభ్యంతరం
– అనుమతి పత్రాలు సమర్పించాలని ఆదేశం

BRS Party latest news(Political news today telangana): గులాబీ పార్టీకి వరుస షాకులు తగులుతున్నాయి. ఓవైపు నేతలు జారుకుంటుంటే, ఇంకోవైపు పార్టీ పెద్దలను కేసులు వెంటాడుతున్నాయి. ఇదే సమయంలో జిల్లాల్లో నిర్మించిన బీఆర్ఎస్ ఆఫీసులకు చిక్కులు ఎదురవుతున్నాయి. ఇప్పటికే నల్లగొండ పట్టణంలో నిర్మించిన భవనానికి అనుమతి లేదని, నిబంధనలకు విరుద్ధంగా ఉందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. పేదవాళ్లు సొంత స్థలంలో ఇల్లు కట్టుకుంటే సవాలక్ష రూల్స్ పెడుతున్న అధికారులు, వంద కోట్ల విలువైన భూమిలో అనుమతి లేకుండా బీఆర్ఎస్ ఆఫీస్ కడుతుంటే ఏం చేశారని ప్రశ్నించారు. నోటీసులిచ్చి అక్రమ నిర్మాణాన్ని కూల్చివేయాలని ఆదేశించారు.

అయితే, హనుమకొండ బీఆర్ఎస్ ఆఫీస్‌కు కూడా నోటీసులు అందాయి. ప్రభుత్వ భూమిలో నిర్మించారని, జిల్లా మున్సిపల్ అధికారులు నోటీసులు జారీ చేశారు. పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపు, బిల్డింగ్ నిర్మాణ అనుమతి పత్రాలను అందించాలని పేర్కొన్నారు. మూడు రోజుల్లో అనుమతి పత్రాలు సమర్పించాలని, లేకుంటే మున్సిపల్ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని సర్వే నెంబర్ 1066లో నిర్మించారు. ఎకరం ప్రభుత్వ స్థలంలో బీఆర్ఎస్ నిర్మించింది. పార్టీ కార్యాలయానికి నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ భూమి కేటాయించారని గత నెలలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. 1066 సర్వే నెంబర్‌లోని ఎకరం భూమిలో నిర్మించిన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి సంబంధించి అనుమతి పత్రాలు అందించాలని నోటీసులు పంపారు. రెండు సార్లు నోటీసులు పంపినా బీఆర్ఎస్ నాయకులు వాటిని తిరస్కరించారు. దీంతో మున్సిపల్ అధికారులు సోమవారం స్వయంగా వెళ్లి నోటీసులు అందించారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!