Annagaru Vastaaru Trailer: ‘అన్నగారు వస్తారు' ట్రైలర్ వచ్చేసింది..
annagaru-vastaru(X)
ఎంటర్‌టైన్‌మెంట్

Annagaru Vastaaru Trailer: కార్తి ‘అన్నగారు వస్తారు’ సినిమా నుంచి ట్రైలర్ వచ్చేసింది చూశారా..

Annagaru Vastaaru Trailer: కోలీవుడ్ స్టార్ హీరో కార్తికి తెలుగులో ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన నటించే ప్రతి సినిమా ఇక్కడి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది. తాజాగా ఆయన నటించిన కొత్త చిత్రం ‘వా వాతియార్’ (Vaa Vaathiyaar) తెలుగులో ‘అన్నగారు వస్తారు’ పేరుతో విడుదలకు సిద్ధమవుతోంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులలో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఈ సినిమా ట్రైలర్లో హైలైట్ అంశం కార్తి పాత్ర చిత్రణ. ఇందులో ఆయన ఒక పోలీస్ ఆఫీసర్‌గా కనిపిస్తూనే, స్వర్గీయ నటసామ్రాట్ నందమూరి తారక రామారావు (ఎన్టీఆర్) గారి వీరాభిమానిగా అలరించనున్నారు. తమిళ వెర్షన్‌లో ఎంజీఆర్ అభిమానిగా కనిపిస్తుండగా, తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా ఎన్టీఆర్ ఫ్యాన్‌గా మార్పులు చేయడం విశేషం. ట్రైలర్ ఆద్యంతం కార్తి ఎనర్జీ, కామెడీ టైమింగ్ రెట్రో స్టైల్ లుక్స్‌తో ఆకట్టుకున్నారు. ముఖ్యంగా, ‘అన్నగారు వస్తారు’ అనే టైటిల్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై ఆసక్తిని పెంచుతున్నాయి.

Read also-Pragathi Powerlifting: ఏషియన్ గేమ్స్‌లో సీనియర్ నటి ప్రగతి సాధించిన మెడల్స్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..

వినోదం, యాక్షన్ మేళవింపు: విలక్షణ దర్శకుడు నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పూర్తి స్థాయి యాక్షన్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. సీరియస్ పోలీస్ కథకు, ఫన్ ఎలిమెంట్స్‌ను జోడించి ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వబోతున్నారు. ట్రైలర్లో చూపించిన యాక్షన్ సన్నివేశాలు స్టైలిష్‌గా ఉండటంతో పాటు, కార్తి మార్క్ కామెడీ డైలాగ్స్ నవ్వులు పూయిస్తున్నాయి.

Read also-Madhuri Srinivas: బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బుతో దివ్వెల మాధురి ఏం చేసిందో తెలుసా?..

ఈ చిత్రంలో కార్తికి జోడీగా కృతి శెట్టి నటిస్తుండగా, సత్యరాజ్, రాజ్ కిరణ్, ఆనంద రాజ్, కరుణాకరన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై కె.ఇ. జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. సంతోష్ నారాయణన్ అందించిన సంగీతం, ముఖ్యంగా ట్రైలర్‌లోని రెట్రో బీట్స్ సినిమాకు ప్రధాన బలంగా నిలిచేలా ఉన్నాయి. భారీ అంచనాల నడుమ ‘అన్నగారు వస్తారు’ చిత్రం డిసెంబర్ 12న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. కార్తి గత చిత్రాలైన ‘ఖైదీ’, ‘సర్దార్’ వంటి విభిన్న చిత్రాల తర్వాత వస్తున్న ఈ సినిమా, కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన పక్కా పండుగ సినిమాలాగే కనిపిస్తోంది. ట్రైలర్‌తోనే పాజిటివ్ బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.

Just In

01

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?

MLC Kavitha: గులాబీ నాయకులకు కవిత గుబులు.. ఎవరి అవినీతిని బయట పడుతుందో అని కీలక నేతల్లో టెన్షన్!

Akhanda2: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశంసలు పొందిన బాలయ్య ‘అఖండ 2 తాండవం’..

Gold Rates: ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయంటే?