Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 దాదాపు చివరి అంకానికి చేరుకుంటుంది. 90 వ రోజు ఈ గేమ్ మరింత రణ రంగంలా మారింది. తాజాగా ఈ శనివారం బిగ్ బాస్ సీజన్ 9 నుంచి మరో ప్రోమో విడుదలైంది. నాగ్ రావడంతో అందరూ చాల సంతోషంగా కనిపించినా ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్న టెన్షన్ వారిని వెంటాడుతుంది. రెండో ప్రోమోకు సంబంధించి నాగార్జున తనూజ, భరణి విషయం గురించి ప్రస్తావించారు. మీరిద్దరూ చేసింది అసలు సరి కాదు అంటూ వారిని హెచ్చరించారు. వీరిద్దరి మధ్య జరిగిన టాస్క్ లో భరణి త్రిభుజాన్ని పట్టుకుని అసలు అది త్రిభుజం కాదు అంటూ వాదించావు, అసలు ఇందులో నాలుగు భుజాలు ఎక్కడ ఉన్నాయి అని చెప్పడంతో ఒక్క సారిగా భరణి షాక్ కి గురయ్యాడు. తనూజ ను అయితే.. అసలు బిగ్ బాస్ చెప్పింది ఏమిటి? నువ్వు చేసింది ఏమిటి బిగ్ బాస్ అసలు త్రిభుజాల గురించి మాట్లాడలేదు. నువ్వు అనేసుకున్నావు అంతా బిగ్ బాస్ ఇంటిలో ఇన్ని వారాలు ఉండేసరికి ఏం చేస్తున్నావో నీరు అర్థం కావడం లేదు, అని చెప్పడంతో తసూజ ఒక్క సారిగా అలా ఉండిపోయారు.
Read also-Bigg Boss 9: ఫస్ట్ ఫైనలిస్ట్ టాస్క్.. సంజనాకు అన్యాయం.. ఇమ్మూను నిలదీసిన నాగ్!
దీంతో సీన్ మొత్తం కళ్యాణ్ మీదకు వెళ్లింది ఎందుకు అంటే.. అప్పుడు కెప్టెన్ కళ్యాణ్ ఉన్నాడు కాబట్టి. వీరిద్దరి మధ్యా ఇంత జరుగుతున్నా కెప్టెన్ మాత్రం పట్టించుకోలేదు. ఆ సమయంలో నువ్వు ఏం చేస్తున్నావు కళ్యాణ్ అంటే అప్పటికే బిగ్ బాస్ కూడా హెచ్చరించారు వారినీ అంటూ చెప్పుకొచ్చారు. అయితే నీ పని బిగ్ బాస్ చేస్తుంది, మరి నువ్వేం చేస్తున్నావు అని ప్రశ్నించారు. దీంతో కెప్టెన్ కళ్యాణ్ ఏం మాట్లాడకుండా ఉండిపోయాడు. తర్వాత ఫోకస్ డీమాన్ పవన్ మీదకు వెళ్లింది. పవన్ నువ్వు తప్పులు వెతకడం మీద ఎక్కువ ఫోకస్ చేశావు అనిపిస్తుంది. ఇది సరిగాలేదు అది సరిగా లేదు అనడమే సరిపోతుంది. ఆ గేమ్ ఆడుతున్నపుడు ఏమీ సరిచేయకుండా ఏందుకు అలా ఉంచేశావు అంటూ అని నాగార్జున అడిగాడు. దీంతో పవన్ బిత్తర చూపులు చూసుకుంటూ ఉన్నాడు. దీనిపై వివరణ అడగ్గా డిమాన్ అవన్నీ చెక్ చెయ్యడానికి ప్రయత్నించాను సార్ అన్నాడు. దీనిని సాకుగా భావించిన నాగార్జున.. దీని గురించి తెలుగులో ఒక సామెత ఉంటుంది. ‘ఆడలేక మద్దెల ఓడు’ అంటే నువ్వ అప్పుడు ఆడలేక పోయావు. అంటూ చమత్కరించారు. దీంతో సెకండ్ ప్రోమో అయిపోయింది. అయతే ఈ శనివారం ఎలిమినేషన్ అయ్యేది సుమన్ శెట్టి అని టాక్ వినిపించినా చివరకు రీతూ చౌదరి అని అంటున్నారు. అయితే అసలు అక్కడ ఏం జరిగింది తెలియాలి అంటే సాయంత్రం వరకూ ఆగాల్సిందే.
Read also-Gummadi Narsaiah Biopic: ప్రారంభమైన మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య బయోపిక్.. మంత్రి ఏం అన్నారంటే?

