Nari Nari Naduma Murari: ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికే
Nari Nari Naduma Murari (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Nari Nari Naduma Murari: ‘నారి నారి నడుమ మురారి’ సంక్రాంతికే.. మరోసారి కన్ఫర్మ్ చేసిన మేకర్స్!

Nari Nari Naduma Murari: చార్మింగ్ స్టార్ శర్వానంద్ (Sharwanand( హీరోగా నటిస్తున్న ఫీల్-గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘నారి నారి నడుమ మురారి’ (Nari Nari Naduma Murari). ఈ మూవీ రాబోయే సంక్రాంతి బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే సంక్రాంతికి వచ్చే మూవీస్ లిస్ట్ పెరిగిపోవడంతో ఈ మూవీ రేసులో ఉంటుందా? ఉండదా? అనేలా అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో మేకర్స్ మరోసారి స్ట్రాంగ్‌గా సంక్రాంతికే వస్తున్నామని ప్రకటించారు. ‘సామజవరగమన’తో బ్లాక్ బస్టర్ డెబ్యు చేసిన రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా ఉండబోతోంది. ఇది ఫెస్టివల్‌కి పర్ఫెక్ట్ మూవీగా ఉండబోతుంది. అడ్వెంచర్స్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ చిత్రంలో సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేసింది. సినిమా రిలీజ్ విషయంలో ఉన్న కన్ఫ్యూజన్‌కు తెరదించుతూ మేకర్స్ అధికారిక ప్రకటన చేశారు.

Also Read- Akhanda 2 Producers: ప్రయత్నాలు ఫలించలేదు.. అభిమానులకు క్షమాపణలు, కొత్త తేదీ త్వరలో!

సంక్రాంతికి వస్తున్నాం

‘నారి నారి నడుమ మురారి’ మూవీ 2026లో ప్రపంచవ్యాప్తంగా సంక్రాంతికి థియేటర్లలోకి రానుంది. ఇది తెలుగు సినిమా రిలీజెస్‌కి బిగ్గెస్ట్ సీజన్. ఈ సినిమా పూర్తి ఫ్యామిలీ ఎంటర్టైమెంట్ కావడంతో సంక్రాంతి విడుదలకు పర్ఫెక్ట్ అని భావిస్తున్నాం. అందుకే మొదటి నుంచి సంక్రాంతికి వస్తున్నామని చెబుతున్నామని అన్నారు. శర్వానంద్ హీరోగా సంక్రాంతి సీజన్‌కు వచ్చిన సినిమాలతో స్ట్రాంగ్ ట్రాక్ రికార్డ్‌ను కలిగి ఉన్నాడు. ‘శతమానం భవతి, ఎక్స్‌ప్రెస్ రాజా’ వంటి చిత్రాలు సంక్రాంతికి విడుదలై పెద్ద బ్లాక్‌బస్టర్‌లుగా నిలిచాయి. ఇదే జోరులో ఈ పండుగకు రాబోతున్న ఈ ‘నారి నారి నడుమ మురారి’ కూడా బ్రహ్మాండమైన విజయం సాధిస్తుందని టీమ్ నమ్మకంగా చెబుతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ విడుదల చేసిన వీడియోలో కూడా ఇదే తెలియజేశారు.

Also Read- Mirchi Madhavi: ప్రకాశ్ రాజ్ వైఫ్ పాత్ర.. ఐదుగురుతో కాంప్రమైజ్ అడిగారు.. నటి మిర్చి మాధవి షాకింగ్స్ కామెంట్స్

సంక్రాంతి బరిలో ఉన్న చిత్రాలివే..

భాను బోగవరపు ఈ చిత్రానికి కథను అందించారు. త్వరలోనే మరింత ఎక్సయిటింగ్ కంటెంట్‌ను ప్రామిస్ చేస్తూ నెక్స్ట్ ఫేజ్ ప్రమోషన్స్ ప్రారంభిస్తామని ఈ అప్డేట్‌లో మేకర్స్ తెలిపారు. ఇంక సంక్రాంతికి వచ్చే రేసులో ఉన్న చిత్రాలను (Sankranthi 2026 Movies List) గమనిస్తే.. రెబల్ స్టార్ ప్రభాస్, మారుతి కాంబోలో రూపుదిద్దుకుంటోన్న ‘ది రాజా సాబ్’.. మెగాస్టార్ చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబో మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’.. మాస్ మహారాజా రవితేజ, కిశోర్ తిరుమల కాంబో మూవీ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’.. నవీన్‌ పొలిశెట్టి, మారి కాంబో ఫిల్మ్ ‘అనగనగా ఒక రాజు’ చిత్రాలు బరిలో దిగుతున్నాయి. ఈ సినిమాతో పాటే శర్వా కూడా తన ‘నారి నారి నడుమ మురారి’ దించేందుకు రెడీ అవుతున్నాడు. ఇంతేనా, ఇంకా ఏమైనా చిత్రాలు యాడ్ అవుతాయా? అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..