Mega Parents-Teachers Meeting: ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో మెగా పేరెంట్ – టీచర్స్ మీటింగ్ (PTM) అట్టహాసంగా ప్రారంభమైంది. పార్వతిపురం మన్యం జిల్లాలో భామినిలో జరిగిన పీటీఎం 3.0 కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తో కలిసి పాఠశాలకు వెళ్లిన సీఎం.. తరగతి గదిలోని చిన్నారులపై టేబుల్ పై కూర్చుకున్నారు. విద్యార్థుల ప్రొగ్రెస్ కార్డును పరిశీలిస్తూ వారితో కొద్దిసేపు ముచ్చటించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం చిలకలూరిపేటలోని ప్రభుత్వ స్కూల్ లో జరిగిన పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ లో పాల్గొన్నారు.
విద్యార్థులతో ముచ్చటించిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా గల 45,000 ప్రభుత్వ పాఠశాలలు, ఎయిడెడ్ స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ఈ పీటీఎం 3.0 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ మన్యం జిల్లా పాలకొండలోని భామిని మోడల్ స్కూల్ లో నిర్వహించిన పీటీఎం కార్యక్రమానికి హాజరయ్యారు. రాష్ట్ర సమగ్ర శిక్షా ఆధ్వర్యంలో ఏర్పాటు ప్రాథమిక నమూనా తరగతి గదిని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల మధ్య కూర్చొని వారితో ముచ్చటించారు. టీచర్ల భోదన, విద్యా ప్రమాణాల నాణ్యత, స్కూల్లోని సౌకర్యాల గురించి విద్యార్థులను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అయితే విద్యార్థులతో చంద్రబాబు మాట్లాడుతున్న క్రమంలో లోకేశ్ పక్కనే నిలబడి అంతే చూస్తూ ఉండిపోవడం గమనార్హం.
పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో మెగా పేరెంట్ టీచర్ మీటింగులో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు.
భామినిలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో ముచ్చటించిన సీఎం, విద్యార్థులకు ఇచ్చిన లెర్నింగ్ టూల్స్ పరిశీలించారు. #MegaPTM3inAP… pic.twitter.com/mY5c9DcAQR— Telugu Desam Party (@JaiTDP) December 5, 2025
విద్యార్థుల నాలెడ్జ్ భేష్..
తరగతి గదిలోని ఓ విద్యార్థిని వద్ద కూర్చున్న సీఎం చంద్రబాబు.. ప్రభుత్వం అందించిన ట్యాబ్ ను ఏ విధంగా వినియోగిస్తున్నారో అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ట్యాబ్ ఓపెన్ చేసి పిల్లలు చదివే విధానాన్ని పరిశీలించారు. మరోవైపు విద్యార్థిని తల్లిదండ్రుల సమక్షంలోనే ప్రొగ్రెస్ కార్డును పరిశీలించారు. విద్యార్థిని చదువు గురించి వారి పేరెంట్స్ ను ఆరా తీశారు. అనంతరం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని మాట్లాడారు. పేరెంట్స్ మీటింగ్ లో పాల్గొన్న విద్యార్థుల తల్లిదండ్రులకు అభినందనలు తెలియజేశారు. పిల్లలతో ముచ్చటించిన సమయంలో వారికున్న నాలెడ్జ్ చూశానని అన్నారు. వారి నుంచి నేర్చుకునే పరిస్థితి త్వరలోనే తనకు వస్తుందని చంద్రబాబు అన్నారు.
పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో మెగా పేరెంట్స్ – టీచర్స్ మీటింగ్ 3.0 కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారు https://t.co/zZRHQcIbAY
— Telugu Desam Party (@JaiTDP) December 5, 2025
Also Read: RBI BSBD 2026 New Rules: జీరో బ్యాలెన్స్ ఖాతాలపై కొత్త రూల్స్.. ఫ్రీగా మరికొన్ని సేవలు.. ఆర్బీఐ కీలక ఆదేశాలు
చిలకలూరిపేటలో పవన్ పర్యటన
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. టీచర్స్ – పేరెంట్స్ మీటింగ్ 3.0లో భాగంగా చిలకలూరిపేటలోని శ్రీ శారదా హైస్కూల్ ను సందర్శించారు. తరగతి గదిలోని విద్యార్థులతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ ‘పిల్లలు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల దగ్గరే ఉంటారు. కాబట్టి వారు దైవసమానులు అవుతారు. తల్లిదండ్రుల తరువాత విద్యార్థుల జీవితాల్లో ఉపాధ్యాయులకు అంత గొప్ప స్థానం ఉంటుంది. అందుకు ఈ పేరెంట్ – టీచర్స్ మీటింగ్ అద్భుతంగా దోహదపడుతుంది’ అని అన్నారు. ఇటీవల పిఠాపురం స్కూల్లో ఇద్దరు విద్యార్థుల మధ్య జరిగిన గొడవను కొందరు రాజకీయ లబ్దికోసం వాడుకోవాలని చూశారని పవన్ అన్నారు. కాబట్టి పిల్లల విషయంలో తల్లిదండ్రుల ప్రమేయం చాలా అవసరమని పవన్ పేర్కొన్నారు.
Honorable Deputy Chief Minister Shri @PawanKalyan interacting with students as part of a Mega Parents – Teachers meeting at ZPHS, Chilakaluripet.#AndhraPradesh pic.twitter.com/hfKhsVi1MX
— JanaSena Shatagni (@JSPShatagniTeam) December 5, 2025

