John Wesley: హిల్ట్‌ పాలసీపై అఖిలపక్షం వేయాలి.. జాన్ వెస్లీ!
John Wesley ( image CREDIT: SWETCHA REPORTER)
Political News

John Wesley: హిల్ట్‌ పాలసీపై అఖిలపక్షం వేయాలి.. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ!

John Wesley: హిల్ట్ పాలసీ తీసుకొచ్చి కన్వర్షన్‌ పేరుతో రియల్‌ ఎస్టేట్‌కు కట్టబెడతారనే ఆరోపణలు వస్తున్నాయని, వేలాది ఎకరాలు, లక్షల కోట్లకు సంబంధించిన అంశంపై తక్షణమే అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, శాసనసభలో చర్చించి నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ (John Wesley) డిమాండ్ చేశారు. మీడియా ప్రకటన విడుదల చేశారు. హైదరాబాదులోని 22 పారిశ్రామిక కేంద్రాల్లోని పరిశ్రమలన్నింటినీ నగరం అవతలికి తరలించేందుకు జీవో నంబర్‌ 27ను ప్రభుత్వం విడుదల చేసిందని, దీని కోసం 9300 ఎకరాల భూమిని అతి తక్కువ ధరలకే పారిశ్రామిక వేత్తలకు కట్టబెట్టడం వల్ల లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతుందని ఆందోళనలు జరుగుతున్నాయన్నారు.

Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి: జాన్ వెస్లీ

విద్యా, వైద్యం, ఉపాధి పరిస్థితులు ఏంటీ?

ప్రజల సౌకర్యాల కోసం, ఇంటి స్థలాలు, క్రీడా స్థలాలు, స్కూళ్ళు, హాస్టల్స్‌ కోసం కేటాయించవచ్చు అన్నారు. కాలుష్యాన్ని సృష్టించే పరిశ్రమలను నగరం నుంచి తరలించాలి తప్ప, మిగతా పరిశ్రమలనన్నింటిని ఎందుకు తరలిస్తున్నారు? పరిశ్రమలు తరలిస్తే కార్మికుల పరిస్థితి, వారి భధ్రతకు తీసుకుంటున్న చర్యలు ఏమిటి? వాళ్ళకు అక్కడ నివాసం, విద్యా, వైద్యం, ఉపాధి పరిస్థితులు ఏంటీ? పరిశ్రమలను బయటికి తరలిస్తే, ఈ భూములను ఆ పారిశ్రామిక వేత్తలకే మార్కెట్‌ ధరకు కాకుండా, అతి తక్కువ ధరకే ఎందుకివ్వాలి? ప్రభుత్వం కేటాయించిన భూముల్లో మూతపడిన పరిశ్రమలు ఎన్ని? ఆ భూములు ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదు? నగరంలో విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు దారాదత్తం చేయడమే ఇదొక హిల్ట్‌ పాలసీ స్కామ్‌లా మారే పరిస్థితి కనపడుతున్నదన్నారు.

ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి

గతంలో బీఆర్‌ఎస్‌ కూడా చేసిందని కాంగ్రెస్‌ వారు అంటున్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేసినా, అది బీజేపీ ప్రభుత్వం చేసినా, కాంగ్రెస్‌ ప్రభుత్వం చేసినా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలి తప్ప, ప్రజల ప్రయోజనాల పేరుతో పారిశ్రామిక వేత్తలకో, రాజకీయ నాయకులకో అప్పగించే పద్ధతులను పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేస్తున్నామని, ఈ సమస్యలన్నింటిపై నిర్ధిష్టమైన వివరాలు ప్రజలముందు ఉంచాలని, ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని డిమాండ్ చేవారు. విలువైన భూములను పారిశ్రామికవేత్తలకు ధారాదత్తం చేసి, లక్షల కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం చేస్తే ఆందోళనకు పూనుకుంటామని హెచ్చరించారు.

Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి: జాన్ వెస్లీ

Just In

01

Geethanjali 4K: ‘శివ’ తర్వాత కింగ్ నాగ్ మరో అద్భుత క్లాసిక్ త్వరలోనే థియేటర్లలోకి!

Panchayat Elections: పంచాయతీ పోరు రెండో దశలోనూ కాంగ్రెస్ హవా.. భారీ సంఖ్యలో పంచాయతీల కైవసం

MA Yusuff Ali: దుబాయ్‌లో పబ్లిక్ బస్సెక్కిన ఇండియన్ బిలియనీర్.. వైరల్‌గా మారిన వీడియో ఇదిగో!

VC Sajjanar: న్యూ ఇయర్ ఈవెంట్​ జరుపుతున్నారా?.. అయితే అనుమతి తప్పనిసరి!

Artificial Intelligence: ఏఐ రంగంలో భారత్ సరికొత్త రికార్డు.. గ్లోబల్ ర్యాంకింగ్‌లో మూడో స్థానం