Kissik Talks With Varsha: వారికి పుట్టగతులుండవ్.. - ఇంద్రజ
Kissik Talks With Varsha (Image Source: YT)
ఎంటర్‌టైన్‌మెంట్

Kissik Talks With Varsha: సుధీర్ గురించి ఆ విషయం చెబితే రష్మీ నా పీక కొరికేస్తది.. నటి ఇంద్రజ సంచలన కామెంట్స్

Kissik Talks With Varsha: ‘కిస్సిక్ టాక్స్ విత్ వర్ష’ (Kissik Talks With Varsha)లో ఈ వారం సీనియర్ నటి ఇంద్రజ (Indraja) ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. మరీ ముఖ్యంగా ఆమె చెప్పిన కొన్ని మాటలు వింటే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. వర్ష కూడా ఈ ఇంటర్వ్యూలో ఆమెను చాలా మంచి ప్రశ్నలు అడిగారు. ఈ ప్రశ్నలకు సమాధానమిచ్చిన ఇంద్రజ.. అందరి మనసులు దోచుకున్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం కూడా లేదు. మరీ ముఖ్యంగా సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer) గురించి, తన మదర్ గురించి చెప్పిన విషయాలతో ప్రతి ఒక్కరినీ ఆమె కంటతడి పెట్టించారు. ప్రస్తుతం ఈ టాక్‌ షోకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోను గమనిస్తే.. యాంకర్ వర్ష, ఇంద్రజ చిరునవ్వుకి చిన్న పిల్లల నుండి పెద్దవారి వరకు అభిమానులు ఉన్నారని ప్రస్తావించారు. దీనికి ఇంద్రజ స్పందిస్తూ, జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చేవరకూ తన ఆదరణ ఏ స్థాయిలో ఉందో తనకు తెలియదని చెప్పారు. వర్ష కోరిక మేరకు, ఆమె ‘ఓ మనసా తొందర పడకే’ పాటను ఆలపించారు.

Also Read- Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్!

సుడిగాలి సుధీర్‌తో అనుబంధం

హైపర్ ఆది (Hyper Aadhi) మీద పంచ్ అనంతరం.. శ్రీదేవి డ్రామా కంపెనీలో ఆమె న్యాయమూర్తిగా, సుధీర్ యాంకర్‌గా ఉన్నప్పుడు వారి మధ్య ఏర్పడిన ‘అమ్మ-కొడుకుల బాండింగ్’ గురించి ఇప్పటికీ ప్రేక్షకులు అడుగుతుంటారని ఇంద్రజ తెలిపారు. ‘అమ్మ అంటే అమ్మ అంతే.. ఆ మాటకు ఫిక్సైపోయి నన్ను అలాగే చూసుకుంటారు. నాతో అంత ప్రేమగా ఉంటారు. నాకు తెలిసి ఈ బంధం దేవుడిచ్చిన బంధమే’.. అని ఇంద్రజ చెప్పారు. ‘సుధీర్‌ ఉండే ఈ షో బాగుంటుందనే ప్రశ్నకి నేను ఆన్సర్ చెబితే.. రష్మి నా పీక కొరికేస్తది’ అంటూ నవ్వుతూ, ఆయనలో మంచి లక్షణాలు ఉన్నాయని, మెచ్చుకున్నారు. అయితే, సుధీర్ చేరుకోవాల్సిన స్థానానికి ఇంకా చేరుకోలేదనే చిన్న బాధ ఉందని అన్నారు. ‘మీ పర్సనల్ స్పేస్‌లో మీరు ఏమైనా చేసుకోండి. అది మీ ఇష్టం. కానీ పబ్లిక్‌లోకి వచ్చి మీరు ఒక విషయం చేస్తున్నప్పుడు కచ్చితంగా కామెంట్ చేస్తారు’ అని ప్రస్తుతం కొందరు సెలబ్రిటీ డ్రస్సింగ్‌ కాంట్రవర్సీపై ఆమె వివరణ ఇచ్చారు.

ప్రేమ పేరుతో మోసపోయే వారికి..

ప్రస్తుత తరంలో త్వరగా బ్రేకప్‌లు అవుతున్నాయని ప్రస్తావిస్తూ, ప్రేమలో మోసపోతే కలిగే బాధ వర్ణించలేదనిదని వివరించారు. ప్రేమలో మోసం చేసిన వారు ఆడవారైనా, మగవారైనా.. వారికింక పుట్టగతులు ఉండవు, సర్వనాశనం అయిపోతారని చాలా గట్టిగా చెప్పారు. మోసపోయి ఆత్మహత్య చేసుకోవాలనుకునే యువతకు ఆమె ఒక ముఖ్యమైన సందేశాన్నిచ్చారు: ‘మీరు పుట్టింది ప్రేమించడానికి కాదు, సాధించడానికి’ అని ఆమె చాలా గొప్పవిషయాన్ని చెప్పారు. సినీ పరిశ్రమలో విజయం సాధించడానికి లక్ ముఖ్యమని, టాలెంట్ ఉంటే కేవలం నిలదొక్కుకోగలుగుతామని ఆమె అభిప్రాయపడ్డారు.

Also Read- Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీ‌లో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?

తల్లి జ్ఞాపకాలు, గిల్ట్ ఫీల్

జీవితంలో ఏదైనా కష్టం వస్తే ఎవరికి కాల్ చేస్తారని అడగ్గా, తాను ఎవరికీ కాల్ చేయనని, తన బొజ్జ గణపయ్యతో పాటు నమ్ముకున్న దేవతలందరినీ ప్రార్థిస్తానని తెలిపారు. ఈ క్రమంలో, తన తల్లితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. తన తల్లిని వడపళని గుడికి తీసుకెళ్లమని పదేపదే అడిగితే, ఆమె వాయిదా వేస్తూ వచ్చానని, తీరా వారం రోజుల్లోనే తన తల్లి చనిపోయారని పంచుకున్నారు. ఆ సమయంలో ఏర్పడిన ‘ఆ గిల్ట్ ఫీల్… అది అనుభవించిన వాళ్ళకు మాత్రమే తెలుసు’ అని కన్నీటి పర్యంతమయ్యారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kissik Talks With Varsha: సుధీర్ గురించి ఆ విషయం చెబితే రష్మీ నా పీక కొరికేస్తది.. నటి ఇంద్రజ సంచలన కామెంట్స్

Indigo Operations: ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష

Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్!

Local Polls: బీజేపీ అభ్యర్థి పేరు సోనియా గాంధీ.. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంలో కాంగ్రెస్ ప్రత్యర్థి!

Tollywood Heroines: శ్రీలీల టు భాగ్యశ్రీ బోర్సే.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేసిన భామలు వీరే!