Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
Prabhas and Sandeep Reddy (Image Source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్!

Spirit: రెబల్ స్టార్ ప్రభాస్ (Rebel Star Prabhas) తన స్టార్‌డమ్‌తో భారతీయ సినీ పరిశ్రమలో మరోసారి రికార్డులు తిరగరాస్తున్నారు. ఆయన తదుపరి ప్రాజెక్ట్, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వం వహిస్తున్న భారీ కాప్ డ్రామా ‘స్పిరిట్’ (Spirit) కోసం ప్రభాస్ ఊహించని స్థాయిలో పారితోషికం తీసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, ‘స్పిరిట్’ సినిమా కోసం ప్రభాస్ ఏకంగా రూ. 160 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ (Prabhas Remuneration) తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీంతో, ఒక్క టాలీవుడ్ మాత్రమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న నటుల్లో ఆయన అగ్రస్థానంలోకి చేరారు. గత పదేళ్లలో ఆయన నటించిన ‘ఆదిపురుష్, సలార్, కల్కి 2898 AD, ది రాజా సాబ్’ వంటి చిత్రాలకు కూడా రూ. 100 నుంచి రూ. 150 కోట్ల రేంజ్‌లో పారితోషికం తీసుకున్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ‘స్పిరిట్’ కోసం ఆ రేంజ్‌ను దాటి కొత్త ప్రమాణాన్ని ఆయన సెట్ చేశారు.

Also Read- Mythri Movie Makers: ఇళయరాజాతో ఇష్యూ.. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతకి సెటిల్ చేసుకున్నారంటే?

గ్లోబల్ మార్కెట్ విలువే కీలకం

ప్రభాస్‌కు ఉన్న తిరుగులేని పాన్-ఇండియా చార్మ్, భారీ అభిమాన గణం, ముఖ్యంగా అమెరికా, యూరప్, జపాన్ వంటి అంతర్జాతీయ మార్కెట్‌లలో ఆయన చిత్రాలకు ఉన్న డిమాండ్ కారణంగానే ఈ స్థాయిలో పారితోషికం సాధ్యమైంది చెప్పుకోవచ్చు. ఆయన సినిమాలు ప్రాంతీయ సరిహద్దులను దాటి ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేయబడుతుండటంతో, నిర్మాతలు ఆయనపై భారీగా పెట్టుబడి పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి సంచలన విజయాల దర్శకుడు సందీప్ రెడ్డి వంగా.. ఫస్ట్‌ టైమ్ ప్రభాస్‌తో కలిసి పనిచేస్తుండటం ఈ సినిమాపై అంచనాలను పీక్స్‌కు తీసుకెళ్లింది. ఈ చిత్రం రూ. 600 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్నట్లు సమాచారం. అంతేకాదు, ఈ చిత్ర డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను కూడా షూటింగ్ ప్రారంభానికి ముందే ఏకంగా రూ. 150 కోట్ల ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ప్రభాస్-వంగా కాంబినేషన్‌కు ట్రేడ్ వర్గాల్లో ఉన్న అపారమైన నమ్మకాన్ని తెలియజేస్తుంది. ప్రభాస్ ఈ ప్రాజెక్ట్‌కు సుమారు ఆరు నెలల సమయం కేటాయించనున్నట్లు తెలుస్తోంది.

Also Read- Sritej Father: దిల్ రాజును కలిసిన శ్రీతేజ్ తండ్రి భాస్కర్.. ఎందుకంటే?

ప్రభాస్‌కు పోటీగా అల్లు అర్జున్

ప్రభాస్ పారితోషికంలో అగ్రస్థానంలో ఉన్నప్పటికీ, ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప 2: ది రూల్’ విజయాల తర్వాత అల్లు అర్జున్ బలమైన పోటీదారుగా ఎదిగారు. అల్లు అర్జున్ తదుపరి ప్రాజెక్ట్, దర్శకుడు అట్లీతో కలిసి చేసే చిత్రం కూడా ఆయన అంతర్జాతీయ మార్కెట్‌ను మరింత విస్తరించే అవకాశం ఉంది. ఏది ఏమైనా, స్పిరిట్ చిత్రం ద్వారా ప్రభాస్ తన కెరీర్‌లో మరో యాక్షన్-ప్యాక్డ్ సినిమాతో పాటు, భారతీయ సినిమా పారితోషిక రికార్డులను తిరగరాసి, కొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమయ్యారని మాత్రం ఫిక్సైపోవచ్చు. ‘స్పిరిట్’ సినిమా ఇటీవలే ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ కూడా జరుగుతోంది. ప్రభాస్ బర్త్‌డేని పురస్కరించుకుని వచ్చిన ఆడియో గ్లింప్స్ ఎలాంటి సంచలనాన్ని క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ సినిమాపై ఉన్న అంచనాలకు జస్ట్ బిగినింగ్ మాత్రమే ఇది.. ముందు ముందు రాబోయే వార్తలతో ఈ సినిమా స్థాయే మారిపోవచ్చు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kissik Talks With Varsha: సుధీర్ గురించి ఆ విషయం చెబితే రష్మీ నా పీక కొరికేస్తది.. నటి ఇంద్రజ సంచలన కామెంట్స్

Indigo Operations: ఇండిగో విమాన సర్వీసుల్లో అంతరాయాలపై కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సమీక్ష

Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్!

Local Polls: బీజేపీ అభ్యర్థి పేరు సోనియా గాంధీ.. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంలో కాంగ్రెస్ ప్రత్యర్థి!

Tollywood Heroines: శ్రీలీల టు భాగ్యశ్రీ బోర్సే.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేసిన భామలు వీరే!