Sritej Father: ‘పుష్ప 2’ (Pushap 2) ప్రీమియర్ నిమిత్తం గత సంవత్సరం హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట (Sandhya Theater Stampade) ఘటనలో తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్లి, ప్రస్తుత కోలుకుంటున్న శ్రీతేజ్ (Sritej) కుటుంబానికి సంబంధించి నిర్మాత దిల్ రాజు (Dil Raju) కీలక విషయాన్ని వెల్లడించారు. బాలుడి వైద్య ఖర్చుల నిమిత్తం అదనపు ఆర్థిక సాయం అవసరమని కోరుతూ శ్రీతేజ్ తండ్రి భాస్కర్ (Sritej Father Bhaskar) తనను సంప్రదించినట్లు ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (TFDC) చైర్మన్ హోదాలో ఉన్న దిల్ రాజు మీడియాకు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో..
Also Read- Sritej Health: ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.. అల్లు అర్జున్ తీరుపై శ్రీతేజ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
అదనపు సహాయం కావాలని కోరుతూ..
దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘లాస్ట్ ఇయర్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ ఘటనలో కోమాలోకి వెళ్లి కోలుకున్న శ్రీతేజ్.. ఇప్పుడిప్పుడే ఇంకాస్త బెటర్ అవుతున్నాడు. అప్పుడు నేను.. భాస్కర్‌కు, భాస్కర్ ఫ్యామిలీకి అల్లు అర్జున్ ద్వారా రూ. 2 కోట్ల రూపాయలను డిపాజిట్ చేయించడం జరిగింది. ఆ డిపాజిట్ ద్వారా వచ్చే వడ్డీని నెలవారి ఖర్చులకు, అలాగే బాబు హాస్పిటల్ ఖర్చులకు ఉపయోగపడేలా.. మంత్లీ రూ. 75 వేలు వడ్డీ రూపంలో వచ్చేలాగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా ఇంట్రెస్ట్ ద్వారా వచ్చే అదనపు అమౌంట్‌ని, ప్రతి సంవత్సరం వారు తీసుకునేలా చేయడం జరిగింది. బాబు ప్రస్తుతం కొంచెం బెటర్‌గానే రికవరీ అవుతున్నాడు. ఇది మంచి పరిణామం. భాస్కర్‌కు, ఫ్యామిలీకి అల్లు అర్జున్ రూ. 2 కోట్లు ఇవ్వడంతో పాటు, అప్పటి వరకు అయిన హాస్పిటల్ ఖర్చులు దాదాపు రూ. 70 లక్షల వరకు అల్లు అర్జునే పే చేశారు. ఈ ఘటన జరిగి వన్ ఇయర్ అవుతుంది. బాబులో రికవరీ కనిపిస్తోంది. బాబు హెల్త్‌కు మంత్లీ ఖర్చు చాలా అవుతుందని, ఇప్పుడు భాస్కర్ అదనపు సహాయం కావాలని కోరుతూ నన్ను కలిశారు. దీని గురించి కూడా అల్లు అరవింద్ (Allu Aravind), అల్లు అర్జున్ (Allu Arjun)తో మాట్లాడి సహాయం చేయిస్తానని చెప్పడం జరిగింది’’ అని చెబుతూ శ్రీతేజ్ తండ్రి భాస్కర్‌ని వివరాలు చెప్పమని అన్నారు.
ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్స్
భాస్కర్ మాట్లాడుతూ.. ‘‘ఆ ఘటన జరిగిన రెండో రోజు నుంచి.. మేము ఏదైతే సపోర్ట్ కోరుకున్నామో.. ఆ సపోర్ట్ అనేది మాకు కంటిన్యూగా ఉంది. అల్లు అర్జున్ సార్, బన్నీ వాసు సార్ సపోర్ట్ ఇచ్చి.. అంతా ప్రాపర్‌గా సెట్ చేశారు. నేను ఏదయితే అదనపు సాయం అడిగానో అది రాజు సార్‌కి వివరించాను. అదనపు సాయం ఎందుకు అడుగుతున్నానో కూడా తెలియజేశాను. ఈ విషయంలో దిల్ రాజు సార్ కూడా సపోర్టివ్‌గా మాట్లాడారు. అల్లు అర్జున్, అరవింద్ సార్లతో మాట్లాడతానని చెప్పారు. ఒక ఆరు నెలల వరకు మెడికల్ ఖర్చుల నిమిత్తం నేను అల్లు అర్జున్ సార్ సపోర్ట్ కోరుతున్నాను. అదే దిల్ రాజు సార్‌కు చెప్పాను. ఇదే ట్రీట్‌మెంట్ జరిగితే, బాబు ఇంకొంచెం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని డాక్టర్లు చెప్పారు. ఆ విషయమే చెప్పాను’’ అని అన్నారు.
మేమందరం మీకు సపోర్ట్‌గా ఉంటాం
అనంతరం దిల్ రాజు మాట్లాడుతూ.. ‘‘ఆరు నెలలు కాదు, వన్ ఇయర్ ట్రీట్‌మెంట్ అయినా సరే.. అక్కడే చేయించు. దీనిని నేను ప్రాపర్‌గా మాట్లాడి చేయించే బాధ్యత నాది. ఇంత చేసిన వాళ్లకు ఇది పెద్ద కష్టమేమీ కాదు. మేమందరం మీకు సపోర్ట్‌గా ఉంటాము. ఏదున్నా మేము చూసుకుంటాం.. డోంట్ వరీ’’ అని దిల్ రాజు హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
