Corruption Case: అవినీతి అధికారి అరెస్ట్.. అక్రమాస్తుల చిట్టా పెద్దదే!
Corruption-Officer (Image source Swetcha)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Corruption Case: రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డుల అధికారి అరెస్ట్.. విస్తుపోయేలా అక్రమాస్తుల చిట్టా!

Corruption Case: భారీగా అక్రమాస్తులు కూడబెట్టిన వైనం

ఆదాయానికి మించి ఆస్తులను గుర్తించిన ఏసీబీ
రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డు ఏడీ శ్రీనివాస్​ అరెస్ట్

రంగారెడ్డి బ్యూరో, స్వేచ్ఛ: రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డు ఏడీ శ్రీనివాస్​ వ్యవహార శైలిపై మొదటి నుంచి వ్యక్తమవుతున్న అనుమానాలే నిజమయ్యాయి. తప్పుడు పనులు చేసేందుకు తాను ఒప్పుకోనుని బహిరంగంగా చెబుతున్నప్పటికీ అంతర్గతంగా పెద్ద అవినీతి అధికారిగా ముద్రపడింది. ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రంగంలోకి ఏడీ శ్రీనివాస్​ నివాసం, కలెక్టరేట్​ కార్యాలయం, బంధువుల, స్నేహితులు, బినామీల ఇండ్లపై ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో విస్తుగొల్పే నిజాలు ఏసీబీ అధికారులు బయటపెట్టారు. ఆదాయానికి మించిన అవినీతికి (Corruption Case) పాల్పడి, వేర్వేరు రాష్ట్రాలలో పెద్ద మొత్తంలో ఆస్తులు సంపాదించినట్లు అధికారులు గుర్తించారు. హైదారాబాద్​ అవినీతి నిరోధక శాఖ అధికారులు ఏడీ శ్రీనివాస్‌పై అక్రమ ఆస్తులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు.

Read Also- Teenmar Mallanna Office: మల్లన్న ఆఫీస్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం!.. కారణం ఇదేనా?

కర్ణాటక, ఏపీలో ఆస్తులు

ఏసీబీ అధికారులు గురువారం హైదరాబాద్​ రాయదుర్గంలోని మై హోమ్​ భుజా అపార్ట్​‌మెంట్స్‌లో నివాసముంటున్న ఏడీ శ్రీనివాస్‌ను అదుపులోకి తీసుకున్నారు. అదే సమయంలో బంధువులు, మిత్రులు, బినామీల, సహచరులకు చెందిన 6 ప్రదేశాల్లో కూడా ఏసీబీ సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో రాయదుర్గంలోని మైహెమ్​ భుజాలోని ఒక ప్లాట్​, నారాయణపేట్ జిల్లాలోని రైస్​ మిల్లు, కర్ణాటక రాష్ట్రంలో 11 ఎకరాలు, ఏపీలోని అనంతపూర్‌లో 11 ఎకరాల వ్యవసాయ భూమి, మహబూబ్‌​నగర్ జిల్లా కేంద్రంలో 4 ప్లాట్లు, నారాయణపేట్​ జిల్లాలో 3 ప్లాట్లకు సంబంధించిన పత్రాలను అధికారులు గుర్తించారు. అదేవిధంగా, 1.6 కిలోల బంగారు అభరణాలు, దాదాపు 770 గ్రాముల బరువున్న వెండి వస్తువులు, రూ.5 లక్షల నగదు, ఒక కియో సెల్టోస్​ హైక్రాస్​, ఒక ఇన్నోవా కారు గుర్తించారు. ఈ స్థిర, చరాస్థుల మార్కెట్ విలువ, డాక్యుమెంట్ విలువ కంటే అనేక రెట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Read Also- Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

లంచగొండుల అడ్డగా రంగారెడ్డి!

అక్రమ ఆస్తుల సంపాదనకు రంగారెడ్డి జిల్లా అధికారులకు అడ్డగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనతీకాలంలోనే, అవినీతి అధికారులపై నిఘా పెట్టడంతో ఎక్కడాలేని విధంగా రంగారెడ్డి జిల్లాలోనే అత్యధిక మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడ్డారు. ప్రధానంగా రెవెన్యూ, విద్యుత్​ శాఖ, పంచాయితీ, టౌన్​ ప్లానింగ్ విభాగాల్లోనే అవినీతి ఎరులై పారుతుందని ఏసీబీ దాడులతో స్పష్టమైతుంది. మొడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పు చూడు పురుగులుండును అనే చందంగా అధికారుల వ్యవహారం ఉంటుంది.​

Just In

01

Spirit: ‘స్పిరిట్’ సినిమాకు ప్రభాస్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే రికార్డ్!

Local Polls: బీజేపీ అభ్యర్థి పేరు సోనియా గాంధీ.. స్థానిక ఎన్నికల్లో ఓటమి భయంలో కాంగ్రెస్ ప్రత్యర్థి!

Tollywood Heroines: శ్రీలీల టు భాగ్యశ్రీ బోర్సే.. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ ఫేస్ చేసిన భామలు వీరే!

Corruption Case: రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డుల అధికారి అరెస్ట్.. విస్తుపోయేలా అక్రమాస్తుల చిట్టా!

Mythri Movie Makers: ఇళయరాజాతో ఇష్యూ.. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతకి సెటిల్ చేసుకున్నారంటే?