Mythri Movie Makers: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)కు, సంగీత దిగ్గజం ఇళయరాజా (Ilaiyaraaja)కు మధ్య తన పాత పాటల కాపీరైట్ విషయంలో నెలకొన్న వివాదం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సమస్యను కోర్టు వెలుపల పరిష్కరించుకునేందుకు మైత్రీ నిర్మాతలు, ఇళయరాజాతో భారీ మొత్తంలో సెటిల్‌మెంట్ చేసుకున్నట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవల నిర్మించిన ‘డ్యూడ్’ (Dude Movie) సినిమాతో పాటు, అంతకు ముందు వచ్చిన అజిత్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ (Good Bad Ugly) వంటి చిత్రాలలో ఇళయరాజా రూపొందించిన పాత పాటలను, ఆయన అనుమతి లేకుండా ఉపయోగించడంతో.. ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పాటల హక్కుల విషయంలో మొదటి నుంచి కఠినంగా వ్యవహరిస్తూ వస్తున్న ఇళయరాజా, తన అనుమతి లేకుండా తన సంగీతాన్ని వాడటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
Also Read- Aryan Khan: ఫ్యాన్స్‌కు మిడిల్ ఫింగర్ చూపించి.. మరో కాంట్రవర్సీలో షారుఖ్ తనయుడు.. అసలేం జరిగిందంటే?
అప్పుడు రూ. 60 లక్షలతో సెటిల్‌మెంట్..
గతంలో ‘మంజుమ్మెల్ బాయ్స్’ (Manjummel Boys) సినిమాలో కూడా తన పాటను ఉపయోగించినందుకు ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ఆ నిర్మాతలు కూడా చివరకు రూ. 60 లక్షలతో సెటిల్‌మెంట్ చేసుకున్నారు. ఇప్పుడు ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’, ‘డ్యూడ్’ సినిమాల విషయంలో ఇళయరాజా చేస్తున్న కాపీరైట్ పోరాటానికి (Copyright Dispute) న్యాయస్థానం కూడా ఆయనకు అనుకూలంగా తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో, ఈ వివాదం మరింత పెద్దదిగా మారి, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత పరువు పోయేలా మారడంతో.. చేసేది లేక మైత్రీ ప్రొడ్యూసర్స్ సెటిల్‌మెంట్ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
Also Read- Sritej Health: ఇప్పటికీ పట్టించుకోవడం లేదు.. అల్లు అర్జున్ తీరుపై శ్రీతేజ్ తండ్రి షాకింగ్ కామెంట్స్
ఇళయరాజా, మైత్రీ వివాదం ముగిసింది
విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు, ఈ రెండు చిత్రాలలో ఇళయరాజా పాటలను వాడుకున్నందుకుగానూ, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఆయనకు రూ. 50 లక్షలు చెల్లించేందుకు అంగీకరించారు. ఈ సెటిల్‌మెంట్ (Settlement) మొత్తాన్ని స్వీకరించిన తర్వాత, ఇళయరాజా ఈ రెండు సినిమాలలో తన పాటలను వాడుకునేందుకు అంగీకారం తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సెటిల్‌మెంట్ వ్యవహారం మరోసారి సినీ పరిశ్రమకు, ముఖ్యంగా యువ నిర్మాతలకు ఒక హెచ్చరికగా మారింది. ఒక లెజెండరీ సంగీత దర్శకుడి కాపీరైట్‌ను గౌరవించడం, సరైన అనుమతులు తీసుకోవడం ఎంత ముఖ్యమో ఈ సంఘటన రుజువు చేసింది. పాటల విషయంలో ఎటువంటి రాజీ పడకుండా పోరాడుతున్న ఇళయరాజా మరోసారి తన హక్కులను కాపాడుకున్నారు. మరోవైపు అంత పెద్దాయన, లెజండరీ.. ఇలాంటి చీప్ ట్రిక్స్ ఎందుకు ప్లే చేస్తున్నాడు? డబ్బుల కోసం ఇంతగా పరితపించాలా? అనేలా కూడా ఆయనపై కామెంట్స్ పడుతుండటం విశేషం.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
