Anganwadi Teacher Resign: సర్పంచ్ అవుదామని అంగన్వాడీ రిజైన్
Sarpanch-Election (Image source X)
Telangana News, లేటెస్ట్ న్యూస్

Anganwadi Teacher Resign: సర్పంచ్ పదవి కోసం అంగన్వాడీ టీచర్ రాజీనామా

Anganwadi Teacher Resign:

మహబూబాబాద్, స్వేచ్ఛ: సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఉద్యోగాలు, హోదాలు  వదులుకున్న ప్రేరణాత్మక కథనాలు ఇప్పటికే చాలా చూశాం. ఈ ఇతివృత్తంతో కొన్ని సినిమాలు సైతం రూపుదిద్దుకున్నాయి. రామ్ చరణ్ నటించిన రంగస్థలం, నాగార్జున నటించిన ‘ప్రెసిడెంట్ గారి పెళ్ళాం’ ఈ కేటగిరి కిందకే వస్తాయి,. సర్పంచ్ పదవిలో అంత కిక్కు ఉంటుందా? అంటే అవుననే అంటున్నారు ఓ అంగన్వాడీ టీచర్. సర్పంచ్ పదవి కోసం ఆమె ఏకంగా తన ఉద్యోగానికి రాజీనామా (Anganwadi Teacher Resign) చేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం గాలివారి గూడేనికి చెందిన అంగన్వాడీ టీచర్ రాములమ్మ ప్రజాసేవ కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు.

గాలివారి గూడెం గ్రామ సర్పంచ్ స్థానం జనరల్ మహిళలకు కేటాయించడంతో అక్కడే అంగన్వాడి టీచర్‌గా పని చేస్తున్న రాములమ్మ బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాములమ్మను సంప్రదించి పార్టీ మద్దతు ఇస్తామంటూ హామీ ఇచ్చారు. ఇంకేముంది బుధవారం ఆమె తన అనుచరులతో కలిసి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. మరో 8 ఏళ్ల సర్వీస్ మిగిలి ఉన్నప్పటికీ ప్రజాసేవ కోసం ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోవడంతో ఆమెను గ్రామస్తులంతా అభినందించారు. ఎలాగో అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి ఉద్యోగం పోయినా సర్పంచ్ సీటు మీద ఆశీనులు అయ్యేందుకు మంచి అవకాశం దక్కిందని ఆమె నమ్మకం పెట్టుకున్నారు. దీంతో, తనకు కాంగ్రెస్ పార్టీ నుంచి టిక్కెట్ ఇచ్చేలా కృషి చేసిన స్థానిక ఎమ్మెల్యే జాటోత్ రామచంద్రనాయక్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

రిజర్వేషన్ల వివరాలు చూసుకోండి: జిల్లా కలెక్టర్ సంతోష్

గద్వాల, స్వేచ్ఛ: గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఆయా పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లను సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లను స్వీకరించాలని జిల్లా కలెక్టర్ బీఎం. సంతోష్ అన్నారు. గురువారం ఎర్రవల్లి మండల కేంద్రంలోని 10వ బెటాలియన్‌లో ఉన్న జెడ్పీహెచ్ఎస్ భవనంలో క్లస్టర్-1, క్లస్టర్-2 నామినేషన్లను స్వీకరించు కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. ఇక్కడ ఎర్రవల్లితో పాటు సాసనోలు, ఆర్.గార్లపాడు తిమ్మాపూర్, షేక్ పల్లె, బీచుపల్లి, జింకలపల్లి, కొండేరు, బి. వీరాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించిన నామినేషన్లను కూడా స్వీకరిస్తుండడంతో ఆయా పంచాయతీల ఓటర్ లిస్టును పరిశీలించారు. పోటీ చేయు అభ్యర్థులు పూరించాల్సిన వివిధ దరఖాస్తులను, నామినేషన్ వేసేందుకు అవసరమైన ఇతర సామాగ్రిని రిటర్నింగ్ అధికారులు సిద్ధంగా ఉంచుకోవడంతో సంతృప్తి వ్యక్తం చేశారు. నామినేషన్లు వేసేందుకు వచ్చే వారికి తగిన సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందికి సూచించారు.

Read Also- Kadapa New Mayor: కడప మేయర్ సురేష్ బాబుకు బిగ్ షాక్.. కొత్త మేయర్ ఎంపికకు ఈసీ ఆదేశాలు

సర్పంచు, వార్డు సభ్యులు పదవులకు పోటీ చేయు అభ్యర్థులు తమ దరఖాస్తుకు జతపరచాల్సిన వయసు, కుల, ఇతరత్రా ధ్రువీకరణ పత్రాలను నిబంధనల ప్రకారం స్వీకరించాలనీ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. పోటీ చేయు అభ్యర్థులు గ్రామ పంచాయితీకి చెల్లించాల్సిన పన్నులు పెండింగ్లో ఉండకుండా కట్టించుకోవాలన్నారు. నామినేషన్ల డిపాజిట్ స్వీకరించాక అభ్యర్థులకు రసీదును అందజేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి పత్రాలను విధిగా నామినేషన్ వేసిన వారికి అందజేయాలన్నారు. నామినేషన్ వేసిన వారి వివరాలను ఎప్పటికప్పుడు టీ-పోల్ యాప్ లో నమోదు చేయాలన్నారు. సాయంత్రం ఐదు గంటల లోగా నామినేషన్ కేంద్రం లోపల ఉన్న వారి నుంచి మాత్రమే నామినేషన్లు స్వీకరించాలని, నిర్దేశిత సమయం మించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కేంద్రంలోకి అనుమతించరాదన్నారు. ఈ పర్యటనలో ఎర్రవల్లి మండల తహసిల్దార్ నరేష్, ఎంపీడీవో అబ్దుల్ సయ్యద్ ఖాన్, తదితరులున్నారు.

Read Also- Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

Just In

01

Corruption Case: రంగారెడ్డి జిల్లా ల్యాండ్​ రికార్డుల అధికారి అరెస్ట్.. విస్తుపోయేలా అక్రమాస్తుల చిట్టా!

Mythri Movie Makers: ఇళయరాజాతో ఇష్యూ.. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతకి సెటిల్ చేసుకున్నారంటే?

HILT Policy: ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

Anganwadi Teacher Resign: సర్పంచ్ పదవి కోసం అంగన్వాడీ టీచర్ రాజీనామా

Teenmar Mallanna Office: మల్లన్న ఆఫీస్ ముందు యువకుడి ఆత్మహత్యాయత్నం!.. కారణం ఇదేనా?