Akhanda 2: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా నటసింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘అఖండ 2: తాండవం’ (Akhanda 2: Thaandavam) సినిమాకు సంబంధించి టికెట్ ధరలు పెంచుకునేందుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానుల్లో ఆనందం మొదలైంది. తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) అనుమతి ఇస్తుందా? లేదా? అని అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఈ చిత్ర నిర్మాతలపై వేసిన కేసు కారణంగా.. కోర్టు అనుమతులు ఆపేసినట్లుగా వార్తలు వచ్చాయి. కాస్త ఆలస్యమైనప్పటికీ టికెట్ల ధరలను పెంచుకునేందుకు, అలాగే ప్రీమియర్‌కు అవకాశం ఇస్తూ.. ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది. అయితే, ఈ పెంపునకు ప్రభుత్వం ఒక ముఖ్యమైన షరతును విధించింది. ఆ వివరాల్లోకి వెళితే..
Also Read- Fan Incident: మహేష్ బాబు అభిమానులకు క్లాస్ పీకిన నా అన్వేషణ.. జన్ జీ కి జరిగేది ఇదే..
డిసెంబర్ 4 రాత్రి ప్రీమియర్, ధరల పెంపు వివరాలు
‘అఖండ 2’ (Akhanda 2) సినిమా కోసం ప్రభుత్వం డిసెంబర్ 4వ తేదీన రాత్రి 8 గంటలకు ప్రత్యేక ప్రదర్శనకు అనుమతినిచ్చింది. ఈ ప్రత్యేక షోకు టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. అంతేకాకుండా, సినిమా విడుదలైన రోజు నుండి మొదటి 3 రోజుల పాటు టికెట్ ధరలను పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ పెంపు వివరాలు ఇలా ఉన్నాయి: సింగిల్ స్క్రీన్ ధియేటర్లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.50 పెంచుకోవచ్చు. మల్టీప్లెక్స్‌లలో ఒక్కో టికెట్‌పై అదనంగా రూ.100 పెంచుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం సింగిల్ స్క్రీన్ థియేటల్లో రూ. 75, మల్లీప్లెక్స్ థియేటర్లలో రూ. 100 పెంచుకునేందుకు వెసులు బాటు కల్పించడంతో.. ఈ ధరలు 10 రోజుల పాటు అమలులో ఉంటాయని ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, తెలంగాణలో మాత్రం కేవలం మూడు రోజులకు మాత్రమే అనుమతి లభించింది.
Also Read- Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎన్ని స్టార్స్ ఇచ్చారో తెలుసా?
మాట నిలబెట్టుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఇక ఈ జీవోలో ఉన్న కండీషన్ విషయానికి వస్తే.. టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూనే, తెలంగాణ ప్రభుత్వం ఒక ముఖ్యమైన షరతును జీవోలో స్పష్టంగా పేర్కొంది. పెంచిన టికెట్ రేట్ల నుండి వచ్చిన అదనపు ఆదాయంలో 20 శాతం మొత్తాన్ని సినీ కార్మికుల శ్రేయస్సు నిమిత్తం మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్‌కు ఇవ్వాలని ప్రభుత్వం కండిషన్ విధించింది. సినీ కార్మికుల సంక్షేమానికి తోడ్పడాలనే ఉద్దేశ్యంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. సినీ కార్మికులకు ఈ హామీని ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ హామీ ‘అఖండ 2’ నుంచే మొదలు కాబోతోంది. ప్రభుత్వం విధించిన ఈ కండిషన్ ప్రకారం, ‘అఖండ 2’ నిర్మాతలు పెంచిన టికెట్ రేట్ల ద్వారా వచ్చిన 20 శాతం వాటాను మా (MAA) అసోసియేషన్‌కు బదిలీ చేయాల్సి ఉంది. ప్రస్తుతానికి మూవీ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అకౌంట్‌కు పంపించాలని, త్వరలోనే ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (FDC) తరుపున సినీ కార్మికుల శ్రేయస్సు నిమిత్తం అకౌంట్ ఓపెన్ చేయించడం జరుగుతుందని తెలిపారు. లేబర్ కమిషనర్ ఆధ్వర్యంలో ఈ అకౌంట్ కార్యకలాపాలు ఉంటాయని ఈ జీవోలో తెలిపారు. థియేటర్లలో డ్రగ్స్, నార్కోటిక్స్, సైబర్ క్రైమ్ అవగాహన ప్రకటనలు తప్పనిసరిగా ఉండాలని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని డిస్ట్రిక్ట్ కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లకు ఆదేశాలిచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు
