Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ రివ్యూ.. ఎన్ని స్టార్స్ అంటే!
Akhanda 2 Review (Image source: X)
ఎంటర్‌టైన్‌మెంట్

Akhanda 2 Review: ‘అఖండ 2: తాండవం’ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది.. ఎన్ని స్టార్స్ ఇచ్చారో తెలుసా?

Akhanda 2 Review: నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’పై ఎలాంటి అంచనాలు ఉన్నాయో తెలియంది కాదు. ఇంకొన్ని గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ క్రమంలో ఇప్పటికే రివ్యూ అంటూ సోషల్ మీడియాలో కొందరు హడావుడి చేస్తున్నారు. దుబాయ్ సెన్సార్ బోర్డు మెంబర్‌గా చెప్పుకునే ట్రేడ్ అనలిస్ట్ ఉమైర్ సంధు.. విడుదలకు ముందే ఫస్ట్ రివ్యూ ఇచ్చేశాడు. ఈ రివ్యూతో నందమూరి అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరాయి. ఉమైర్ సంధు ఈ చిత్రానికి 5కి 6 రేటింగ్ ఇవ్వడంతో పాటు, ఇది బాలయ్య అభిమానులకు పర్ఫెక్ట్ ట్రీట్ అని ప్రకటించారు.

ఫస్ట్ రివ్యూ

ఉమైర్ సంధు తన రివ్యూలో ‘అఖండ 2: తాండవం’ ను ‘Paisa Vasool Mass Entertainer for hardcore #Balakrishna Fans!’ అని రాసుకొచ్చారు. బాలయ్య ఫ్యాన్స్‌ను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ చిత్రం, మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించడం ఖాయమని ఆయన పేర్కొన్నారు. ఈ ఫస్ట్ రివ్యూ, సినిమా విడుదలపై ఉన్న హైప్‌ను మరింత పెంచింది. అయితే ఆయన గతంలో ఇలా చెప్పిన కొన్ని రివ్యూలు అట్టర్ ఫ్లాప్‌గా నిలిచాయి. అస్సలు బాగోలేదు అని చెప్పిన సినిమాలు కలెక్షన్ల సునామీని సృష్టించాయి. కాబట్టి.. ఈ రివ్యూని పరిగణనలోకి తీసుకోకుండా.. ఎవరి మైండ్ సెట్‌తో వారు సినిమా చూసి ఎంజాయ్ చేయాలని నెటిజన్లు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం.

మాస్ ఆడియన్స్ కోసమే ‘తాండవం’

ఉమైర్ సంధు రివ్యూ ప్రకారం, ‘అఖండ 2: తాండవం’ లో యాక్షన్, డైలాగ్స్, క్లైమాక్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ‘ఇందులో యాక్షన్ ఉంది, పవర్ ఫుల్ డైలాగ్స్ ఉన్నాయి, మాస్ ప్రేక్షకులను ఉద్దేశించి చేసిన సిటీ మార్ క్లైమాక్స్ ఉంది’’ అని ఆయన వివరించారు. ఈ వ్యాఖ్యలు బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా పండుగలా ఉండబోతుందని స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ‘అఖండ’ చిత్రం సృష్టించిన ప్రభంజనం దృష్ట్యా, దాని సీక్వెల్ ‘అఖండ 2: తాండవం’ పై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ నేపథ్యంలో వచ్చిన ఉమైర్ సంధు రివ్యూ, సినిమా కచ్చితంగా మాస్ జాతరగా ఉండబోతుందని తెలియజేస్తుంది. ముఖ్యంగా, క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను నిలబడనీయకుండా చేస్తాయని ఆయన సూచించారు. చిత్రయూనిట్ కూడా మొదటి నుంచి ఇదే చెబుతూ వస్తుంది.

భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌

ట్రేడ్ వర్గాల నుండి వచ్చిన ఈ తొలి స్పందనతో, బాలకృష్ణ ఫ్యాన్స్, సాధారణ మాస్ సినిమా అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. బోయపాటి శ్రీను మరోసారి బాలకృష్ణను అత్యంత శక్తివంతమైన అవతార్‌లో చూపించడంలో విజయం సాధించారని ఈ రివ్యూ పరోక్షంగా తెలియజేస్తోంది. మొత్తం మీద, ‘అఖండ 2: తాండవం’ చిత్రం పక్కా మాస్ ఆడియెన్స్ కోసమే రూపొందించబడిన ఒక భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేయడానికి సిద్ధంగా ఉందని ఉమైర్ సంధు రివ్యూ స్పష్టం చేసింది. సినిమాలోని యాక్షన్ ఘట్టాలు, బాలయ్య పలికే డైలాగులు థియేటర్లలో పూనకాలు తెప్పించడం ఖాయమని ప్రమోషనల్ కంటెంట్ విడుదలైనప్పటి నుంచి ఫ్యాన్స్, ప్రేక్షకులు కూడా అదే భావనలో ఉన్నారనే విషయం తెలియంది కాదు. చూద్దాం మరి.. ఈ సినిమాకు ప్రేక్షకులు ఎలాంటి విజయాన్ని అందిస్తారో..

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్