Google Pixel 10: భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్
Google Pixel 10 ( Image Source: Twitter)
Technology News

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్

Google Pixel 10: కొత్త గూగుల్ Google ఫ్లాగ్‌షిప్ ఫోన్ Pixel 10 కోసం వేచి చూస్తున్నవారికి ఇదొక మంచి అవకాశం. ఇటీవల ఇండియాలో రూ.79,999 వద్ద లాంచ్ అయిన Pixel 10 ఇప్పుడు అమెజాన్ ( Amazon‌) లో భారీ డిస్కౌంట్‌తో లభిస్తోంది. ఈ ఆఫర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లపై ఎప్పటికీ ఉండదు కాబట్టి, ఆసక్తి ఉన్నవారికి త్వరగా తీసుకోవడం మంచిది.

Amazon లో ఈ స్మార్ట్ ధర అంత భారీగా తగ్గిందా?

గూగుల్ పిక్సెల్ 10 (Google Pixel 10) ప్రారంభ ధర రూ.79,999. Amazon ప్రస్తుత ధర తగ్గింపుతో రూ. 11,549 తగ్గించి డిస్కౌంట్ లో రూ. 68,450 కి వస్తుంది. అదనంగా, Axis Bank క్రెడిట్ కార్డ్ EMI పేమెంట్లపై రూ.3,500 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. ఇంకా ఎక్కువ ఆదా చేయడానికి, మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు.

Also Read: Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..

Pixel 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు

Pixel 10 6.3-inch OLED డిస్‌ప్లేతో వస్తుంది, 120Hz రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. డిస్‌ప్లే Corning Gorilla Glass Victus 2 ప్రొటెక్షన్‌తో కప్పబడింది. ఫోన్ లో Tensor G5 చిప్‌సెట్, 12GB వరకు RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. 4,970mAh బ్యాటరీ 30W ఫాస్ట్ ఛార్జింగ్, 15W వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.

Also Read: Shyamali Response: రాజ్ నిడిమోరు వివాహం తర్వాత మౌనం వీడిన మాజీ భార్య శ్యామలి దే.. ‘నిద్రలేని రాత్రుల’పై ఆవేదన..

ఫోటోగ్రఫీ కోసం, Pixel 10 లో 48MP ప్రైమరీ కెమెరా మాక్రో ఫోకస్, 13MP అల్ట్రావైడ్ లెన్స్, 10.8MP టెలిఫోటో లెన్స్ (5× ఆప్టికల్ జూమ్) ఉన్నాయి. ఫ్రంట్‌లో 10.5MP కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఉంది. Google యొక్క క్లీన్ సాఫ్ట్‌వేర్, అధునాతన AI ఫీచర్లను ఆస్వాదించాలనేవారికి ఇది ఆకర్షణీయమైన ఆఫర్.

Also Read:  BCCI Team Selection: దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు జట్టుని ప్రకటించిన బీసీసీఐ… గిల్‌ విషయంలో కండిషన్

Just In

01

Big Ticket Abu Dhabi: సౌదీలోని భారతీయుడికి భారీ జాక్‌పాట్.. లాటరీలో రూ.61 కోట్లు!

OnePlus 13: OnePlus 13 ఫోన్ కు 10 వేల డిస్కౌంట్.. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

Hidma Encounter: హిడ్మా ఎన్‌కౌంటర్‌‌పై మావోయిస్టుల మరో లేఖ.. అంతా వాళ్లే చేశారు!

Akhanda 2: తెలంగాణలోనూ లైన్ క్లియర్.. ఎట్టకేలకు ప్రీమియర్‌కు, టికెట్ల ధరల హైక్‌కు అనుమతి! కండీషన్స్ అప్లయ్!

Google Pixel 10: అమెజాన్‌లో అదిరిపోయే ఆఫర్.. భారీ డిస్కౌంట్ తో పిక్సెల్ 10 ఫోన్