Chaitanya Sobhita: నాగ చైతన్య పెళ్లి చేసుకుని ఏడాది పూర్తి..
NAGA-CHAITNYA(x)
ఎంటర్‌టైన్‌మెంట్

Chaitanya Sobhita: నాగ చైతన్య వివాహ బంధంలోకి అడుగు పెట్టి నేటికి ఏడాది పూర్తి.. ఇప్పుడు ఎలా ఉన్నారంటే?

Chaitanya Sobhita: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, నటి శోభిత ధూళిపాళ వివాహ బంధంలోకి అడుగుపెట్టి సరిగ్గా సంవత్సరం పూర్తయింది. ఈరోజు (డిసెంబర్ 4) ఈ అందమైన జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకుంటున్నారు. గతేడాది ఇదే రోజున హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి వివాహం అంగరంగ వైభవంగా, సంప్రదాయబద్ధంగా జరిగింది. నాగ చైతన్య, శోభిత డేటింగ్‌లో ఉన్నారనే ఊహాగానాలు కొన్నాళ్ల పాటు సినీ వర్గాల్లో వినిపించాయి. అయితే, వీరిద్దరూ తమ బంధాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నించినప్పటికీ, వివిధ సందర్భాలలో కలిసి కనిపించడంతో ఆ వార్తలకు బలం చేకూరింది. చివరకు, పెద్దల అంగీకారంతో వీరి ప్రేమ బంధం వివాహంగా మారింది.

Read also-Fan Incident: మహేష్ బాబు అభిమానులకు క్లాస్ పీకిన నా అన్వేషణ.. జన్ జీ కి జరిగేది ఇదే..

పెళ్లి వేడుకలు అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకంగా మారాయి. నాగ చైతన్య తాతగారు, దివంగత నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు (ANR) గారు స్థాపించిన అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఈ శుభకార్యం జరగడం ఎంతో సెంటిమెంట్‌ను పంచిచ్చింది. నాగ చైతన్య, శోభిత వివాహం పూర్తిగా హిందూ తెలుగు సంప్రదాయ పద్ధతిలో జరిగింది. నాగ చైతన్య తన తాతగారిని స్మరించుకుంటూ సాంప్రదాయబద్ధమైన తెల్లటి పంచెకట్టు, ఖాదీ కుర్తాలో కనిపించారు. శోభిత పట్టుచీర, సంప్రదాయ బంగారు ఆభరణాలతో తెలుగు వధువుగా మెరిసిపోయారు. పసుపు దంచడం వంటి తెలుగు ప్రీ-వెడ్డింగ్ వేడుకల ఫోటోలు కూడా అప్పట్లో వైరల్ అయ్యాయి. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ వంటి వారు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పెళ్లి తర్వాత ఈ జంట నాగార్జునతో కలిసి ప్రముఖ పుణ్యక్షేత్రాలను కూడా దర్శించుకున్నారు.

Read also-Bigg Boss9: బిగ్ బాస్ 9 మొదటి ఫైనల్ సభ్యుడు కోసం చేసే రణరంగంలో.. ఆ టాస్క్ మామూలుగా లేదుగా..

ఈ రోజు, వారి మొదటి వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని, అక్కినేని, ధూళిపాళ కుటుంబాలకు అభిమానులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నాగ చైతన్య-శోభిత ధూళిపాళ మరిన్ని వసంతాలు చూస్తూ, ఆనందంగా జీవించాలని అభిమానులు కోరుకుంటున్నారు. శోభితా ధూళిపాళ తన వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశారు. తాజాగా ఈ వీడియో వైరల్ అవుతోంది. వీడియో కింది ఇలా రాసుకొచ్చారు. “గాలి ఎల్లప్పుడూ ఇల్లు వైపుకే వీస్తుంది. డెక్కన్‌కు తిరిగి వచ్చాను. నేను భర్త అని పిలిచే వ్యక్తితో సూర్యుని చుట్టూ ఒక అద్భుతమైన ప్రయాణం పూర్తైంది. కొత్తగా అనిపిస్తోంది. అగ్నితో శుద్ధి చేయబడిన అనుభూతి. శ్రీమతిగా ఒక సంవత్సరం పూర్తైంది!” అంటూ రాసుకొచ్చారు. దీనిని చూసిన నెటిజన్లు వారికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Just In

01

BRS Strategy: హంగామా చేస్తున్న బీఆర్ఎస్.. గులాబీ అటెన్షన్ డైవర్షన్?

Sonu Sood Praises Pawan: డిప్యూటీ సీఎం పవన్‌పై సోనూసూద్ పొగడ్తలు.. వీడియో ఇదిగో

Coal Block Allegations: సైట్ విజిట్ సర్టిఫికేట్ ఎందుకు?.. కేంద్ర మంత్రికి హరీష్ రావు కీలక లేఖ

Harish Rao Investigation: పైనుంచి ఫోన్లు వచ్చాయ్.. సిట్ విచారణపై హరీష్ రావు సంచలన వ్యాఖ్యలు

Political News: బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దారి తప్పారు.. ఎంపీ రఘనందన్ రావు షాకింగ్ కామెంట్స్