Bigg Boss9: బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకర్షిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 9. 88 వ రోజు బిగ్ బాస్ ఫైనలిస్ట్ కోసం జరుగుతున్న రణరంగంలో సభ్యులు తమ సామర్ధ్యం మొత్తం పెడుతున్నారు. తోలి ఫైనలిస్ట్ కోసం జరుగుతున్న యుద్ధంలో ఈ రోజు ముందుగా ముగ్గురు సభ్యులకు టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అది ఏంటంటే.. కలర్ ఫుల్ టూల్ పవర్ ఫుల్ అందులో పోటీదారులు ఏం చెయ్యాలి అంటే.. పోలీదారులు మన మందు ప్లేట్ లో ఉన్న కలర్ పెయింట్ ను కాన్వస్ పై పూయాలి.. దీనికి గాను బిగ్ బాస్ ముగ్గురు సభ్యులను ఎంచుకున్నారు. వారు భరణి, రీతూ చౌదరి, పవన్ . ముగ్గురు ఆటను ప్రారంభించారు. అందులో భరణి రీతూ ల మధ్య చిన్న క్లాష్ వచ్చింది. దీంతో ఆటను ముగించారు. అక్కడ ఏం జరిగిందో తెలియాలి అంటే మరికొన్నిగంటలు ఆగాల్సిందే.
Read also-Rashmika Vijay: ఆ పుకార్లకు ఫుల్ స్టాప్ పెట్టిన రష్మికా మందన్నా.. ఏం అన్నారంటే?
తర్వాత ఆట ఆడటానికి అందరూ రంగులు ఉన్న గడుల్లో నించున్నారు. దీంతో ఫైనల్ సభ్యుడు అవ్వడం ఆడుతున్న నాలుగో టాస్క్ లో ఈ సారి ఇద్దరు పోటీదారులకు ఈ అవకాశం కల్పించింది బిగ్ బాస్. దీంతో బిగ్ బాస్ పవన్ ను సెలక్ట్ చేయగా రెండో పోటీదారుగా పవన్ ను ఎంచుకోమని చెప్పారు. దీంతో పవన్ సుమన్ శెట్టిని ఎంచుకున్నాడు. వారిద్దిరికీ ఇచ్చిన టాస్క్ ఏంటంటే.. రేజ్ రేంపేజ్. దీంట్లో.. ఇద్దరికి రెండు రూమ్స్ ఇస్తారు. అందులో కొన్ని ఫర్నీచర్ ఉంటుంది. వాటిని పగలగొట్టి ఎవరు అయితే తూకం వేస్తారో, ఎవరిది అయితే ఎక్కువ వెయిట్ వస్తుందో వారీ విజేతలు అవుతారు. అయితే వారిద్దరి మధ్య గేమ్ ఎలా సాగింది. దాంట్లో ఎవరు గెలిచారు అన్నది తెలియాలి అంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే..
Read also-AVM Saravanan: ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరనిలోటు..
