Fan Incident: వారణాసి టైటిల్ రివీల్ ఈవెంట్ లో జరిగిన ఒక సంఘటనపై నా అన్వేషణ యూ ట్యూబ్ చానల్ నిర్వాహకుడు అన్వేష్ ఫైర్ అయ్యారు. మహేష్ అభిమాని బీర్ బాటిల్ తలకు కొట్టుకుని రక్తం వస్తే దానిని మహేష్ బాబు పోటోకు వీర తిలకం దిద్దాడు. దీనిని చూసిన నా అన్వేషణ భారత యువత చేస్తున్న వెకిలి చేష్టలపై మండి పడ్డారు. అభిమానం అంటూ ఇలా పిచ్చి పనులు చేస్తే నష్టపోయే ది వారి తల్లిదండ్రులేనని హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో ప్రపంచం అంతా ముందుకు వెళ్తుంటే.. ఇండియన్ యువత మాత్రం దానికి భిన్నంగా ఇలా పిచ్చిపనులు చేసుకుంటూ జీవితాలు నాశనం చేసుకుంటున్నరని మండి పడ్డారు. ఇలాంటి చేష్టలు చేస్తే మీ హీరోలు రెమ్యూనరేషన్ ఇంకా పెంచుతారు. కానీ తగ్గించరు. కనీసం నీకు మంచి మాటలు కూడా చెప్పరు అంటూ చెప్పుకొచ్చారు.
Read also-Shashirekha Song: మెగాస్టార్ ‘మనశంకరవరప్రసాద్ గారు’ నుంచి మరో అప్డేట్.. సెకండ్ సింగిల్ ఎప్పుడంటే?
ఇప్పుడంతా ఏఐ యుగం..
అంతే కాకుండా నెలకు పది లక్షలు సంపాదిస్తున్న యువకుడిగా నేను చెప్తున్నా.. నా తల్లిదండ్రులను నేను చాలా బాగా చూసుకుంటున్నా.. మీరు వీరాభిమానంతో బీర్లు బద్దలు గొట్టకుంటే.. దానిని బాధ్యులు ఎవరు. మీ తల్లిదండ్రులే కదా, ప్రపంచం చాలా ముందుకు పోతుంది. ఇలాంటి సమయంలో ఇలాంటి పిచ్చి పనులు చేయకూడదు. ఏఐ వచ్చింది. దాదాపు అన్ని జాబ్స్ కీ ఎసరు పెట్టింది. అన్నీ పోతాయి.. ఏదోటి నేర్చుకోండి స్కిల్ వర్క్ లేకపోతే ఏం చేయలేరు. ఈ జన్ జీ అయితే ముఖ్యం గా చాలా జాగ్రత్తగా ఉండాలి.. అంటూ చెప్పుకొచ్చారు.
Read also-AVM Saravanan: ప్రముఖ నిర్మాత ఏవీఎం శరవణన్ కన్నుమూత.. సినీ పరిశ్రమకు తీరనిలోటు..
దీనిని చూసిన నెటిజన్లు.. రకరకాలుగు రియాక్ట్ అవుతున్నారు. ఒకరు అయితే అన్నా నువ్వు మేటివేషన్ ఇవ్వకు వారు మారిపోతే మేము ఏం చెయ్యాలి. కొంత మందిని అలా ఉండనీ.. అసలే ఉద్యోగాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంటూ రాసుకొచ్చారు. దీనికి వేలల్లో లైక్స్ వచ్చాయి. మరికొందరు అన్నా నువ్వు చెప్పింది నిజమే ఇప్పటికైనా మారతాము అంటూ కామెంట్లు పెడుతున్నారు. తాజాగా దీనికి సంబంధించి వీడియో తెగ వైరల్ అవుతోంది.
